భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) నాల్గవ బాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

భావ తరంగాలు – హేమాజోషి – 4వ.భాగమ్

నానాసాహెబ్ నిమోన్ కర్ గారికి సాయిబాబా వారి సాహచర్యం లభించడం గొప్ప అదృష్టం.  ఆయన తన జీవిత కాలమంతా, తను చనిపోయేంత వరకు సాయిబాబాకు అత్యంత ప్రియతమ శిష్యునిగా ఉండే భాగ్యం లభించింది.  ఆయనకు సాయిబాబాపై ఎంతటి ప్రేమ, భక్తి ఉన్నాయంటే, ఆఖరికి నిమోన్ కర్ గారు తన గౌరవప్రదమయిన వృత్తిని, ఇంటిని, ఆస్తులను వదలిపెట్టి, తన భార్యతో సహా షిరిడీ వచ్చి, తన సద్గురువయిన సాయి సేవలోనే గడిపారు. 

ఆయన గారు తన సమయాన్ని సద్గురు సాయినాథుని సేవలో తప్ప మరింక  దేనికీ వినియోగించుకోలేదు.  ఆయన ఉదయాన్నే స్నానానికి మాత్రమే ఇంటికి వెళ్ళి, పూజాదికార్యక్రమాలని ముగించుకుని తిరిగి సాయిబాబా వద్దకు వచ్చి ఆయన సేవ చేసుకుంటూ గడిపేవారు. ఎంతో ఉత్సాహంతో, చురుకుగా ఆయన సేవలోనే మునిగిపోయేవారు.

సాయిబాబా ఆయనని ‘మ్హాతరే కాకా’ (ముసలి కాకా) అని అత్యంత ప్రేమతో పిలిచేవారు.  నానాసాహెబ్ గారు చాలా తరచుగా సాయిబాబాగారిని లెండీబాగ్ కు తీసుకునివెడుతూ ఉండేవారు.  సాయిబాబా, నానాసాహెబ్ గారిని సంస్కృత గ్రంథాలను, విష్ణుసహస్ర నామాలను చదవమని ప్రోత్సహించారు.

సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత నానాసాహెబ్ నిమోన్ కర్ గారు ఎక్కువ కాలం జీవించలేదు.  చివరి మూడురోజులు ఆయన నిరంతరం సాయిబాబా నామస్మరణ చేస్తూనే ఉన్నారు.  ఆయన అందరినీ ‘సాయిబాబా’ అనే పిలుస్తూ ఉండేవారు. కారణం ఆయన ప్రతివారిలోనూ తన ఆధ్యాత్మిక గురువయిన సాయిబాబానే దర్శిస్తూ ఉండేవారు.

ద్వారకామాయి శిథిలావస్థలోనున్న ఒక మసీదు.  అందుచేత స్వర్గీయ నానాసాహెబ్ చందోర్కర్ ఆ పాడుపడిన మసీదును బాగుచేయించుదామని ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొన్నాడు. 

కానీ, ఉద్యోగరీత్యా ఆఫీసు వ్యవహారాలలో మునిగి ఉండటంవల్ల ఈ బాధ్యతను నిర్వహించడానికి తగిన సమయం దొరకలేదు.  ఇక చేసేదేమీలేక ఆ బాధ్యతను నిమోన్ కర్ గారికి అప్పచెప్పాడు.  నిమోన్ కర్ ఆ బాధ్యతను ఎంతో సంతోషంగా స్వీకరించాడు.  భక్తిప్రపత్తులతో పనిని ప్రారంభించాడు.  

కానీ, సాయిబాబా సగం వరకు కట్టిన గోడలను పడగొట్టేసేవారు.  రాళ్ళు విసురుతూ ఉండేవారు.  మసీదు పునర్నిర్మాణంలో ఆటంకాలు కలిగించేవారు.  శ్రీనానాసాహెబ్ నిమోన్ కర్ గారి సహనానికి, భక్తికి సాయిబాబా ఆ విధంగా పరీక్ష పెట్టారు.  సాయిబాబా కోపగిస్తూ చేసిన పనులకి నిమోన్ కర్ ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు, కోపాన్ని ప్రదర్శించలేదు.  నిరాశ కూడా పడలేదు. 

మరలా ఎంత రాత్రయినా సరే ‘పునశ్చ హరిహి ఓమ్’  అని మరలా పనిని ప్రారంభించేవాడు. చేసిన పనినే మరలా మరలా మొదటినుంచి తిరిగి ప్రారంభించవలసి వచ్చేది.  ఆ విధంగా సాయిబాబా పెట్టిన పరీక్షలో ఎప్పుడూ అపజయాన్ని పొందలేదు. ఆఖరికి ద్వారకామాయి నిర్మాణం జరిగింది.  శ్రీనిమోన్ కర్ గారు ద్వారకామాయిని తిరిగి పునర్నిర్మించడంలో సఫలీకృతులయ్యారు.

శ్రీసాయిబాబాను దర్శించడానికి వచ్చే భక్తులందరికీ నిమోన్ కర్  గారు భోజనవసతులు కల్గించి హృదయపూర్వకమయిన సేవ చేసేవారు.  ద్వారకామాయిని తుడిచి శుభ్రం చేస్తూ ఉండేవారు.  చందోర్కర్, నిమోన్ కర్, మహల్సాపతి, మాధవరావ్ దేశ్ పాండే లాంటి భక్తులందరూ రాత్రివేళల్లో సాయిబాబాకు సన్నిహితంగా  కూర్చుని ఆసక్తికరమయిన విషయాలను చర్చించుకుంటూ ఉండేవారు.

ఆయనతో ఎంతో చనువుగా ఆధ్యాత్మిక సలహాలను, సూచనలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు.  వీరందరూ సాయిబాబాకు అంత సన్నిహితంగా ఉండటానికి కారణం, సాయిబాబా పెట్టే పరీక్షలకు తట్టుకుని ఆయన అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానాలను ఇవ్వడం వల్లనే.  వారందరూ సాయిబాబాపై తమ ప్రగాఢమయిన నమ్మకం, భక్తి, ప్రేమలవల్లనే ఆయనకత్యంత సన్నిహితులయ్యారు.

మేము ఎప్పుడూ సాయిబాబానే పూజిస్తూ ఉంటాము.  మా యింటిలో ఆయనకు ఆరతులు ఇస్తూ ఉంటాము.  ప్రతిరోజు సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాము. అన్ని పర్వదినాలలోను సద్గురు శ్రీసాయిబాబాని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాము.  మేమంతా ఆయన కుటుంబ సభ్యులం.

(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles