Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ప్రేమమయుని పరమ శ్రద్ధ వర్ణించతరమా!
సాయి అడిగిన దక్షిణ శ్రద్ధ సమర్పించతరమా!
శ్రీకాకుళం నుండి మీ సాయి సురేష్. నాకు ఫిబ్రవరి 8, 2017న జరిగిన ఒక అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బాబా గారికి నా ధన్యవాదాలు.
మన బాబా గారు భోదల గురువు కాదు, చేతల గురువని మనకు తెలుసు. మనం ఆయనను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనకు మాటలలో చెప్పకుండా, అందుకు తగిన పరిస్థితులు కల్పించి అనుభవపూర్వకంగా తెలియజేస్తారు. అలా తెలియజేయడం వలన మనం దానిని స్పష్టంగా గ్రహించగలం. అది మన మనస్సులో కూడా స్థిరంగా నాటుకుంటుంది.
దీనికి మంచి ఉదాహరణ సచ్చరిత్ర లో ఈశావాస్య ఉపనిషత్తు యొక్క అర్థం తెలపమని దాసగాణు బాబా ను అడిగినప్పుడు బాబా స్వయంగా భోదించక, విల్లిపార్లె లోని కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల చెప్తుంది అని పంపిస్తారు. అక్కడ అనుభవపూర్వకంగా ఉపనిషత్ సారం తెలుసుకొనేలా చేస్తారు కదా!
నాలుగు నెలల క్రిందట శ్రద్ధ అంటే ఏమిటి? అనే ప్రశ్న నా మనస్సులో లేపారు బాబా. నేను యెంత ఆలోచించిన నాకు సమాధానం దొరకలేదు. చివరికి బాబా నే అడిగాను. కొన్ని రోజుల తర్వాత గురువు(శరత్ బాబూజీ) గారి ద్వారా శ్రద్ధ అంటే సదా ఎరుకలో ఉండడమని తెలియజేసారు బాబా. మళ్ళి ఇన్ని రోజుల తర్వాత నాకు అనుభవపూర్వకంగా తెలియజేసారు. అది ఎలాగో ఈ క్రింది అనుభవం చదవండి మీకు అర్ధం అవుతుంది.
మా ఫ్యామిలీ అంత ఈ నెల(05.02.2017)న తిరుపతి వెళ్ళాము. 6, 7 తేదిలలో తిరుపతి కొండపైన ఉండి, మూడవ రోజు అనగా తేది 08.02.2017న కొండ దిగి శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి టెంపుల్ లో దర్శనం చేసుకోని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 10.15 అయ్యింది. మేము అప్పటికి ఇంక టిఫిన్ చేయలేదు. అప్పటికే బాగా లేట్ అయ్యిందని ఇంక లేటు చేయక టిఫిన్ చేద్దామని అనుకొన్నాను.
మా వాళ్ళు వెనక వస్తూ ఉన్నారు, నేను కాస్త ముందుగా టెంపుల్ ఎంట్రన్స్ గేటు బయటకు వచ్చి, అక్కడ నిల్చొని టిఫిన్ సెంటర్ కోసం చుట్టుపక్కల చూస్తున్నాను. అంతలో నేను గమనించలేదు గాని ఒక 4 వీలర్ నా పక్క నుండి క్రాస్ అవుతుంది. అది నాకు చాలా దగ్గరగా వచ్చింది. నాకు, వెహికల్ కు మద్య వెంట్రుకవాసి ఖాలీ మాత్రమే ఉంది. అంత దగ్గరగా వచ్చేసింది. ఆ డ్రైవర్ హార్న్ కూడా మ్రోగించట్లేదు.
ఆ వెహికల్ నా ప్రక్క నుండి టెంపుల్ లోపలికి టర్న్ అవుతుంది. (సాదారణంగా టర్న్ అయ్యేటప్పుడు ముందు చక్రాలు మనల్ని టచ్ కావు, కానీ వెనుక చక్రాలు మన మీదకు వస్తాయి.) అలా వెనుక చక్రాలు నా పాదం ఎక్కడం, వెహికల్ నన్ను గుద్దబోతుంది అన్న క్షణంలో నా ఎడమ చేయి, మోచేయి దగ్గర ఎవరో తాకిన స్పర్శ కలిగింది.
నేను ఎవరని ప్రక్కకు తిరిగాను. నేను తిరగడం, వెహికల్ క్రాస్ కావడం ఒకేసారి జరిగాయి. నాకు ఏ ప్రమాదం జరగలేదు గాని, వెహికల్ చూడగానే ఒక్కసారిగా భయంతో ఒళ్లు జలదరించిపోయింది. ఈ వెహికల్ ఎక్కడి నుండి వచ్చింది నేను గమనించనేలేదు అనుకున్నాను. మరుక్షణమే నా మోచేయి ఎవరో తాకారు అని గుర్తువచ్చి చుట్టు చూసాను. నా చుట్టుప్రక్కల దరిదాపుల్లో ఎవరు లేరు.
అప్పుడు నాకు అర్ధమైంది. జరుగనున్న పెద్ద ప్రమాదాన్ని అదృశ్య రూపంలో నా మోచేయి తాకి నన్ను ప్రమాదం నుంచి రక్షించింది నా బాబా అని. మనసులోనే బాబా కి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఆ క్షణం నాకు శ్రద్ధ అంటే ఏమిటో స్పష్టంగా అర్ధమైంది. బాబా మనల్ని అనుక్షణం యెంత శ్రద్ధతో కనిపెట్టుకొని ఉంటారో కదా! ఏ ఒక్క క్షణం ఏమారక అంతలా కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టే అటువంటి విపత్కర పరిస్టితి లో నన్ను రక్షించారు. లేకపోతే ఏమి జరిగి ఉండేదో. మన ఊరు కానీ చోట నేను, మావాళ్ళు యెంత ఇబ్బంది పడేవారమో!
బాబా మన నుండి శ్రద్ధ, సబూరి అనే రెండు రూపాయల దక్షిణ అడుగుతారు. కానీ బాబా మనపై చూపే అంతటి శ్రద్ధ ని మనం బాబాకు అర్పించడానికి అసలు మనకు సాధ్యమా! ఆయన ఈ సృష్టిలో ప్రతి జీవిపై బాబా ఇంతే శ్రద్ధతో ఎల్లవేళలా ఉంటారు. కానీ మనం అయన ఒక్కరిపైనే శ్రద్ధ ను చూపలేకపోతున్నామని నాకు ఆ క్షణంలో అనుభవమైంది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, కావలసింది కేవలం బాబా మీద భక్తి, ప్రేమ, శ్రద్ధ మాత్రమే!
- భక్తుల పట్ల బాబాకు ఉండే ప్రేమపూర్వకమైన శ్రద్ధ
- శ్రద్ధ….. సాయి@366 మార్చి 8….Audio
- శ్రీ సాయిబాబావారు శివనేశన్ స్వామిలా దర్శనమిచ్చారు.
- సాయిని ప్రార్ధించు సమస్యలు తొలగును
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ప్రేమమయుని పరమ శ్రద్ధ”
సాయినాథుని ప్రణతి
February 23, 2017 at 7:36 amNice experience sai. అయిన మిరు ఈ సాయిలీలాస్ ద్వార అందరికి అమితానందానే పంచుతునారు అటువంటి మిమల్ని బాబా కాపాడకుండ వుంటారా. బాబా ఎపుడు జగురుకత తోనె ఉంటారు కాని మనకే బాబా మిద నమ్మకం కొని సంద్భాలలో కుదరదు. కాని దానికి కూడ బాబానే నేనునాను అంటు నమాదానం ఇస్తారు.
Sai Suresh
February 23, 2017 at 7:58 amఅవును సాయి. మనం మర్చిపోయిన బాబా మాత్రం సదా నేనున్నాను అంటూ పలుకుతూ ఉంటారు. అంతటి ప్రేమ మూర్తి కి మనం ఏమి చేయగలం సాయి.
prathibha sainathuni
February 24, 2017 at 5:18 amనైస్.బాగుంది … .గురువు గారు చెప్పింది గుర్తుకువస్తుంది..మాములుగా బాబా మనల్ని శ్రద్ద సబూరి అడుగుతారు కానీ మనం ఇవ్వం .మనం ఇవ్వకుంటే ఆయనైనా ఇవ్వాలి కదా అందుకే అయన మనమీద అంతులేని సహనం తో మన మీద శ్రద్ద చూపించి మనలో తాను తీసుకురావాలన్న మార్పుని తెస్తారు.అందుకోసం యెంత కాలం ఐన సరే సంతోషంతో ఎదురు చూస్తారు.అనుకున్నది సాధిస్తారు … అది … బాబా అంటే ….అని గురువుగారు .. చెప్పారు .
Sai Suresh
February 24, 2017 at 3:26 pmనాకు కూడా ఆ సంఘటన జరిగినప్పుడు గురువు గారు చెప్పిన చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి సాయి.
Sreenivas Murthy
February 25, 2017 at 7:06 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba