శ్రీసాయి లీలా తరంగిణి – 14వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

1997వ. సంవత్సరంలో మేము షిరిడీ వెళ్ళాము. శ్రీసాయిబాబా వారిని దర్శించుకున్న తరువాత శ్రీశివనేశన్ స్వామీజీ వారి సమాధి వద్దకు వెళ్ళాము.  ఆయన సమాధి చూడగానే మేము దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము. ఆయన తన  ప్రేమతో మమ్మల్ని కట్టిపడేశారు.  ఆయన సమక్షంలో మా హృదయాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయేవి.

మా శ్రేయోభిలాషులలో ఒకరైన ఆయన లేని లోటు మాకు తీవ్రమయిన బాధను మిగిల్చింది.  ఆయన సమాధి మీద సుందరమయిన ఫొటో ఉంది.  కొంతసేపు అక్కడే ఉన్న తరువాత తిరిగి వచ్చేశాము. తరువాత ఒక పుస్తకాల షాపు వద్దకు వెళ్ళి అక్కడ షాపు ముందు నుంచున్నాము.  ఆ పుస్తకాల షాపతనితో మాకు పరిచయంలేదు.  అతను శ్రీశివనేశన్ స్వామీజీ వారి లామినేషన్ చేయబడ్డ కలర్ ఫొటో ఇచ్చాడు.

** ఆ ఫొటో సరిగ్గ మేము స్వామీజీ సమాధి మీద చూసిన ఫొటోలాగే ఉంది. ఏమాత్రం తేడా లేదు.  ఆఫొటో చూడగానే మాకు అత్యంతానందం కలిగింది.  ఆసంతోషంలో ఆఫొటోకు తగిన వెల ఇద్దామని షాపతనికి డబ్బివ్వబోయాము.  కాని అతను డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు.  “నాదగ్గిర ఈ ఫొటో ఒక్కటె ఉంది. దీనిని మీకివ్వాలనిపించింది. అందుకనే ఇచ్చాను”అన్నాడు.

అంతకు ముందు మాకసలు స్వామీజీ ఫొటో కోసం ప్రయత్నిద్దామనే ఆలోచలే కలగలేదుఅటువంటిది ఆయన సమాధిని దర్శించుకున్న తరువాత ఈ ఫొటో లభించడం ఆయన అనుగ్రహమే.  ఈ సంతోషకరమయిన సంఘటన మా గుండెల్లో బలమయిన ముద్ర వేసింది.  మా ఆనందానికి అవధులు లేవు.

మేము షిరిడీ వెళ్ళినప్పుడెల్లా బాబాను దర్శించుకున్నంతనే గతించిన మాతల్లిదండ్రులను చూస్తున్నంతగా సంతోషం కలిగేది.  అదే విధంగా శ్రీశివనేశన్ స్వామీజిని దర్శించుకున్నపుడు ఆయన చూపే ప్రేమాభిమానాలు, ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం, ఇవన్నీ మేము మా అన్నయ్య సమక్షంలో ఉన్నంతగా ఆనందాన్ని కలిగించేవి. అనుకోకుండా విచిత్రంగా మాకు లభించిన శ్రీశివనేశన్ స్వామీజీవారి ఫోటోని మేము మాపూజా మందిరంలో ఉంచుకున్నాము.

ఆఫొటోను చూసినప్పుడేల్లా మాకు “నేనెక్కడికో వెళ్ళిపోయాననుకోవద్దు. విచార  పడవద్దు.  నేనెపుడూ మీతోనే ఉన్నాను” అని చెబుతున్నట్లుగా ఉండేది. ఈ విధంగా మాకు ఆయన నుండి చాలా శక్తివంతమయిన అండ మాకు ఉన్నదనే భావం కలుగుతూ ఉండేది. అంతేకాదు, ప్రతి విషయంలోను ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారనే అనుభూతి కలుగుతూ ఉండేది.  ఆకాశం యొక్క అంచులను కనుగొనవచ్చునేమో, సముద్రపు లోతును కొలవచ్చేమో గాని శ్రీశివనేశన్ స్వామీజీ లాంటి మహాపురుషులు దయతో ప్రసాదించే లీలలను ఊహించలేము.

************

త్యాగరాజు గారి అనుభవం

** బహుశ 2008 లేక 2009 వ.సంవత్సరం కావచ్చు.  అప్పట్లో నేను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న రోజులలో ఎస్.బి.ఐ. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను.  ఆ సందర్భంగా పాలసీలు చేయించడానికి బయటి ఊళ్ళకి కూడా వెడుతూ ఉండేవాడిని. ఆసందర్భంలో ఒక రోజు నరసాపురం నుండి ఆకివీడు వెళ్ళాను.

తిరుగు ప్రయాణంలో ఆకివీడు బస్ స్టాండులో బెంచీమీద కూర్చుని నరసాపురం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంతలో భీమవరం వెళ్ళే బస్సు వచ్చింది.  ఆ బస్సులోనుండి డ్రైవరు దిగాడు.  అతను కంట్రోలర్ వద్ద రికార్డులో సంతకం చేయడానికి వెడుతున్నాడు. అతను  నాముందు నుంచి నన్ను దాటుకుని నాలుగు అడుగులు వెళ్ళాడు.  వెళ్ళినవాడు మళ్ళి వెనక్కు నా దగ్గరకు వచ్చాడు.  తన జేబులోనుంచి శ్రీ రమణ మహర్షులవారి ఫోటో తీసి నా చేతులో పెట్టి వెళ్ళిపోయాడు.

అతనెవరో నాకు తెలీదు.  నేనెవరో అతనికి తెలీదు.  మరి శ్రీరమణమహర్షుల వారి ఫోటో (అరుణాచలం) నాకెందుకిచ్చినట్లు?  మహాపురుషుల లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి.  ఆయన ఫోటోని భద్రంగా ఉంచుకున్నాను.

సాయిరామ్  (త్యాగరాజు)

(రేపటి సంచికలో బాబా పరోక్షంగా ఇచ్చిన ఆదేశం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles