శ్రీసాయి లీలా తరంగిణి – 20వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

అత్యధ్బుతమైన మహిమ – బ్రైన్ హెమరేజ్ నుండి రక్షించుట

నాభర్తకు కలిగిన మరొక అధ్బుతమైన అనుభూతి

01.01.1987 వేకువఝామున నాభర్తకు కలలో బాబా వారి దివ్య దర్శనమయింది.  కలలో బాబా ఇలా అన్నారు. “ఈ రోజు నీకు మంచి రోజు కాదు.  ఈరోజు ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య నీకు పెద్ద ప్రమాదం జరగబోతోంది”

ఆకలలో నాభర్తకు తాను నేల మీద ప్రాణం లేకుండా పడుకుని ఉన్నట్లుగాను, సాయిబాబా తన తల వద్ద కూర్చుని తన ఛాతీ మీద ఆయన చేతిని వేసి ఉంచినట్లు, తన ప్రక్కన శ్రీపూజ్య శివనేశన్ స్వామీజీ గారు, ఆయన శిష్యుడు శ్రీ అయోధ్య కూర్చుని ఉన్నట్లు కనిపించింది.

తరువాత ఆరోజు ఉదయాన్నే ‘సాయిప్రభ’ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గారయిన శ్రీ వి.నారాయణరావు గారిని, శ్రీ డి. శంకరయ్య గారిని ఇంకా మాదగ్గరి బంధువులు కొందరిని, ఫోన్ చేసి పిలిపించాము. నా అన్నగారు డా.సి.ఆర్. ప్రసాద్, మా అబ్బాయి మామగారు డా.ఎ. ప్రభాకరరావుగారు (మచిలీపట్నం గవర్నమెంట్ ఆస్పత్రిలో సూపరింన్ టెండెంట్) వీరిద్దరూ మాతోనే ఉన్నారు.  కొంతమంది సాయి భక్తులు కూడా మాయింటికి వచ్చారు.

క్రితం వరకు మావారి ప్రాణానికి ప్రమాదం జరగబోతోందని ముందుగా సూచన చేసినపుడెల్లా బాబా మావారితో “నేను నీతోనే ఉన్నాను” అని అభయం ఇస్తూ ఉండేవారు.  కాని, ఈసారి బాబా ఆవిధంగా చెప్పలేదు.  మాలో ఆందోళన ఎక్కువయింది.  శ్రీ నారాయణరావు గారు నాభర్తకి విష్ణుసహస్రనామం పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. 

సాయిబాబా చెప్పిన సమయం ముగియడానికి ఇంక కొద్ది నిమిషాలే ఉంది.  బాబా చెప్పిన గడువు ఇంక కొద్ది నిమిషాలలో దాటిపోతుందని మేము కాస్త ఊపిరి పీల్చుకున్నాము.  తరువాత సమయమ్ 11.53 అయింది. 

నాభర్త కాస్త తల తిరుగుతోందని మెల్లిగా లేచి, బాబా ఫొటో దగ్గరకు వెళ్ళి బాబా ముందు శిరసు వంచి తెలివితప్పి పడిపోయారు.  మేమాయనని హాలు మధ్యలో పడుకోబెట్టాము. విష్ణుసహస్రనామ పారాయణ మిగిలిన భాగాన్ని శ్రీనారాయణరావుగారు పూర్తి చేశారు. మేమంతా సాయినామాన్ని జపించడం మొదలుపెట్టాము. 

స్పృహలేని స్ఠితిలోనే నాభర్త గురక పెట్టసాగారు. ఆయన గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. నేల మీద నుంచి జర్క్ వస్తున్నట్లుగా పైకి కిందకి పడుతూ లేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఈవిధంగా ఎప్పుడూ జరగలేదు.  మాకు చాలా భయంగాను, కంగారుగాను ఉంది. కాని నాభర్త తనను ఆస్పత్రిలో చేర్పించవద్దని ఖచ్చితంగా చెప్పడంవల్ల ఆయనని కాస్తయినా కదల్చడానికి మేము సాహసించలేదు.

ఆయన స్పృహలోకి వస్తారని గంట పైగా ఎదురు చూసాము.  కాని ఆయన స్పృహలోకి రాలేదు.  పరిస్ఠితి చాలా విషమంగా తయారయింది.  ఆఖరికి మా అబ్బాయి కృష్ణకిషోర్ సాయిబాబా పాదాల వద్ద చీటీలు వేసి ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లమంటారా వద్దంటారా అని బాబాని అడుగుదామని నిర్ణయించుకున్నాడు.

ఆవిధంగా ఆయన పాదాల వద్ద రెండు చీటీలు వేసి మామనవడు కళ్యాణ్ కౌశిక్ ను పిలిచి రెండు చీటీలలో ఒక చీటీని తీయమని చెప్పాడు. వాడు ఒక చీటీ తీశాడు. ఆచీటీలో ఆస్పత్రికి తీసుకునివెళ్లమని వచ్చింది.  వెంటనే ఆయనని మహావీర్ ఆస్పత్రికి తీసుకునివెళ్ళాము.  డాక్టర్ పరీక్షించి, ఆయనకు మొత్తం శరీరానికంతా పక్షవాతం వచ్చిందని చెప్పారు.

సూదితో ఆయన పెదవులమీద, చేతులమీద గుచ్చినా, పొడిచినా ఆయన శరీరంలో ఎటువంటి చలనం లేదు.  నాడి, గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటున్నాయి.  అది సెరిబ్రల్ హెమరేజ్.  ఆ రోజు ఆదివారం కావడంవల్ల స్పెషలిస్ట్ లు ఎవరూ లేరు.  అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఆయన ఇంక బ్రతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకునివెళ్ళిపొమ్మన్నారు.  లేకపోతే ఏ గవర్నమెంటు ఆస్పత్రికయినా తీసుకువెళ్లమని చెప్పారు.

మధ్యాహ్నం 1.30 కు ఆయనని అక్కడి నుండి సికిందరాబాదులో ఉన్న గాంధీ ఆస్పత్రికి తీసుకునివెళ్లాము.  అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పరీక్షించి ఆయనకు సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిందని నిర్ధారణ చేసారు.  ఆయనని ఐ సి యు లో చేర్పించమని చెప్పారు.  కాని ఆయన కోలుకుంటారని మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు.

అవసరమయిన వైద్యమంతా చేస్తున్నారు. నేను శ్రీసాయిబాబా గారి అభయ హస్తం ఉన్న ఫొటోను ఆయన తలదగ్గరి, ఆయన చొక్కా జేబులో బాబా ద్వారకామాయి ఫొటో ఉంచాను.  నాభర్త మీద కనికరం చూపించమని బాబాను వేడుకుంటూ ఆయన నుదుటిమీద కాస్త విభూది రాసాను.

ఇంకా ఉంది..

రేపు తరువాయి భాగం…..

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles