Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
అత్యధ్బుతమైన మహిమ – బ్రైన్ హెమరేజ్ నుండి రక్షించుట
డాక్టర్స్ పరీక్షించి ఆయనకు సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిందని నిర్ధారణ చేసారు. ఆయనని ఐ సి యు లో చేర్పించమని చెప్పారు. కాని ఆయన కోలుకుంటారని మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు.
అవసరమయిన వైద్యమంతా చేస్తున్నారు. నేను శ్రీసాయిబాబా గారి అభయ హస్తం ఉన్న ఫొటోను ఆయన తలదగ్గరి, ఆయన చొక్కా జేబులో బాబా ద్వారకామాయి ఫొటో ఉంచాను. నాభర్త మీద కనికరం చూపించమని బాబాను వేడుకుంటూ ఆయన నుదుటిమీద కాస్త విభూది రాసాను.
ఈలోగా ఒక డాక్టరు (బహుశా నాస్తికుడయి ఉండవచ్చు) జరుగుతున్న తతంగాన్నంతా చూసి నాదగ్గరకు వచ్చి “ఆయన పరిస్ఠితి చాలా ప్రమాదకరంగా ఉంది. మీ సాయిబాబా గాని, మరే భగవంతుడయినా సరే ఆయనను ఈపరిస్ఠితినుంచి కాపాడలేరు” అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. కాని బాబా మీద మానమ్మకం విశ్వాసం బాగా ధృఢంగా ఉన్నాయి. మానమ్మకం సడలదు.
నాభర్త యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారనే గట్టి నమ్మకం మాకుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయనకు ఎడమ కాలు, ఎడమ చేయిలలో కాస్త కదలిక వచ్చింది. డాక్టర్స్ పరీక్షించి ఆయనకు కుడివైపు పూర్తిగా పక్షవాతం వచ్చిందని చెప్పారు. సాయంత్రం ఆరు గంటలకి అధ్బుతం జరిగింది.
ఆయన తన కుడికాలుని, కుడిచేతిని కదపగలిగారు. శరీరంలోని అన్ని అవయవాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా కదలసాగాయి. రాత్రి ఏడు గంటలకు కొన్ని మాటలు మాట్లాడగలిగారు. రాత్రి ఒంటి గంట వరకు మరలా మాట్లాడలేకపోయారు. ఆతరువాత స్పృహలోకి వచ్చి చేతులు, కాళ్ళు అన్నీ కదుపుతూ మాట్లాడగలిగారు. బాబా దయవల్ల పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకున్నారు.
తరువాత తనను ఆస్పత్రిలో చేర్పించారని తెలిసి మామీద చిరాకు పడ్డారు. “బాబావిభూతి” ఒక్కటే తనకు తగిన మందని, అదొక్కటే తనకు మనశ్శాంతిని ఇస్తుందని చెప్పారు. తనను ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఇంత అర్ధరాత్రివేళ ఇంటికి వెళ్ళడం కష్టమని మరుసటిరోజు ఉదయాన్నే వెడదామని శాంతింపచేశాము. అతికష్టంమీద మామాట విన్నారు.
కాని తెల్లవారుఝాము అయిదు గంటలవరకు పడుకోకుండా మంచం మీదే కూర్చొని ఉన్నారు. ఆయన ఆవిధంగా కోలుకుని చాలా సంతోషంగా ఉండటం చూసి వైద్యం చేసిన డాక్టర్స్ అందరూ చాలా ఆశ్ఛర్యపోయారు. ఆయనని సి.టి. బ్రైన్ స్కాన్ చేయించుకోమని, ఇంకా కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండమని చెప్పారు. కాని మావారికి ఆస్పత్రిలో ఒక గంట కూడా ఉండటం సుతరాము ఇష్టంలేదు.
అందువల్ల తన స్వంత బాధ్యతమీదే తనను వెంటనే ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేసేయమని అడిగారు. ఆయన స్వంత పూచీకత్తు మీద డాక్టర్స్ డిశ్చార్జి చేసారు. సెరిబ్రల్ హెమరేజ్ తో బాధపడినవాళ్ళు బ్రతకడం చాలా అరుదు. ఒకవేళ ప్రమాదం నుండి బయటపడినా 12 గంటలలో సాధారణ స్ఠితికి రావడమనేది అసాధ్యం.
నాభర్త ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజున మా అబ్బాయి అత్తగారు శ్రీమతి ధనలక్ష్మి మాయింటిలో డ్రాయింగు రూములొ నిద్రపోతూ ఉన్నారు. ఆమెకు కలలో నలుగురు యమదూతలు మాయింటిలోకి వస్తున్నట్లుగా కన్పించింది. ఆవిడ వెంటనే లేచి బాబా పటంముందు శిరసువంచి “సాయిబాబా రక్షా కరో సాయిబాబా రక్షాకరో” అంటూ ప్రార్ధించసాగారు. ఆమె అలా ప్రార్ధించగానే ఆనలుగురు వెనుకకు మరలి వెళ్ళిపోయారు.
(ఓమ్ సాయి రక్షా కరో సాయి భజన్ యూట్యూబ్ లో వినండి లింక్ ఇస్తున్నాను)
https://www.youtube.com/watch?v=qmWlLldFMCk
https://www.youtube.com/watch?v=OuW2qh70DAc
ఆస్పత్రి నుంచి వచ్చిన తరువాత ఆయన తన రోజువారీ కార్యక్రమాలన్నీ యధావిధిగా చేసుకోసాగారు. ఈసంఘటన జరిగిన మూడవరోజున చర్లపల్లిలో ఉంటున్న మాదగ్గరి బంధువు ఒకరికి నాభర్తకు ఏదో ఉపద్రవం జరగబోతోందన్నట్లుగా కలవచ్చింది. ఆతరువాత నాభర్త మోపెడ్ మీద వెడుతు కనిపించడంతో ఆశ్చర్యం కలిగింది. ఆయన ప్రమాదం నుండి బయటపడి ఆరోగ్యంగా సంతోషంగా ఉండటం చూసి ఎంతో ఆనందించారు.
ఇది సాయిబాబా చేసిన అద్భుతం కాక మరేమిటి? బాబావారి పాదపద్మాలపై మాశిరసు నుంచి నమస్కరించుకోవడం తప్ప ఆయనకు మేమేవిధంగా మా కృతజ్ఞతలను తెలుపుకోగలం?
మాయింటిలో సంతోషకరమయిన, ఉల్లాసకరమయిన వాతావరణం నిండి ఉన్నదంటే అదంతా సాయిబాబా దయ ఆయన ఆశీర్వాదాల వల్ల మాత్రమే.
స్త్రీకి అత్యున్నతమైన సంపద సుమంగళిగా నుదుట సింధూరం, పసుపుకుంకుమలతో నిండు నూరేళ్ళు జీవించటం. సుమంగళి ఎప్పుడు వచ్చినా నానుదుట కుంకుమబొట్టు పెట్టినపుడు, ఆ సంపదని నేను పొందుతున్నందుకు నాకెంతో గర్వంగాను, అటువంటి అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగాను ఉంటుంది. నాకటువంటి గొప్పసంపదను అనుగ్రహించిన బాబాకు నేనెంతో కృతజ్ఞురాలిని. నాకెప్పుడూ ఆయన ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటూ ఉంటాను.
రేపటి సంచికలో కారులో ఏర్పడిన లోపాన్ని చెప్పిన బాబా
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 20వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 19వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 11వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 5 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 18వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీసాయి లీలా తరంగిణి – 21వ. భాగం”
Maruthi Sainathuni
September 9, 2017 at 9:03 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba