శ్రీసాయి లీలా తరంగిణి – 18వ. భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శ్రీసాయి లీలా తరంగిణి 

రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన :  తెలుగు.  తరువాత  ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)  అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు గారు.

ధ్యానంలో బాబా సందేశాలు

నాభర్త శ్రీ భారం ఉమామహేశ్వరరావు గారు శ్రీ సాయిబాబాకు అంకిత భక్తులు గొప్ప సాధకుడు.  ఆయనకు ధ్యానంలోను, స్వప్నంలోను బాబానుంచి స్వయంగా సందేశాలు అందుతూ ఉండేవి. ఆవిధంగా బాబా ఆయనను అనుగ్రహించారు. తోటి సాయిభక్తులందరికీ బాబావారి సందేశాలను, బోధనలను ప్రచారం చేసేందుకు ఆయనను తన సాధనంగా వినియోగించుకున్నారు.

బాబావారు ప్రసాదించిన ఈ సందేశాలు సాయిభక్తులకే కాదు, నేటి యువతరం జీవనవిధానంలో మార్పు రావడానికి, వారు సద్గురువు యొక్క అనుగ్రహానికి తగిన అర్హత పొందడానికి, సద్గురువు బోధనలను ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ఈ సందేశాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి.

1978వ. సంవత్సరంలో నాభర్త ఎడిషనల్ సూపరెంన్ టెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవీ విరమణ చేసిన తరువాత ప్రతిరోజు శ్రీసాయిబాబాను క్రమం తప్పకుండా పూజిస్తు ఉండేవారు.  తరచుగా మేము షిరిడీ వెడుతూ బాబాను దర్శించుకుంటూ ఉండేవాళ్ళం.

1987వ. సంవత్సరంలో మే 30వ. తారీకున కొంతమంది సాయిభక్తులతో కలిసి షిరిడీ వెళ్ళాము. కేరళ నుంచి ఒక స్వామీజీ మాదగ్గరకు వచ్చారు.  ద్వారాకామాయిలో కూర్చుని ఆయనతో మేము సాయి లీలలను గురించి ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నాము.

హటాత్తుగా నాభర్తకి ధ్యానం చేసుకోవాలనే గాఢమయిన సంకల్పం కలిగింది. ధ్యానంలో ఆయనకు బాబా దర్శనమిచ్చారు. బాబా ఆగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు. బాబా ఆంగ్లంలో మాట్లాడుతున్నది విన్న వెంటనే నా భర్త బిగ్గరగా మళ్ళి దానిని తిరిగి మాట్లాడసాగారు. జరుగుతున్నది చూసి మేము స్ఠాణువులమైపోయాము.  శ్రీ వి. నారాయణరావుగారు (రిటైర్డ్ డెప్యూటీ పే & ఎక్కౌన్ ట్స్ ఆఫీసర్) ఆయన కూడా మాతో షిరిడీకి వచ్చారు.  ఆయన వెంటనే కాగితం మీద నా భర్త పలుకుతున్న మాటలన్నీ రాయడం మొదలుపెట్టారు.  శ్రీసాయిబాబా నోటివెంట యదార్ధంగా వచ్చిన మొదటి సందేశం ఇదె.

అప్పటి నుండి ఆయనకు బాబా యొక్క వేదాంతము, తత్వం మీద ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు బాబా నుంచి అందుతూ ఉండేవి.  అవన్నీ కూడా బాబా తెలుగులో చెప్పినవే.  మూడు సందేశాలను మాత్రం బాబా ఆంగ్లంలో చెప్పారు.  బాబా నాభర్తకు సందేశాలు ఇచ్చే సమయంలో ఆయన ప్రక్కన ఎవరున్నాగాని వారా సందేశాలన్నిటినీ రాస్తూ ఉండేవారు.  ఆ సందేశాలలో ఎక్కువభాగం రాసే అదృష్టం నాకు మాత్రమే కలిగింది.

జనవరి 1వ.తారీకు 1989 వ. సంవత్సరంలో మేము షిరిడీలో ఉన్నాము. అప్పుడు బాబా తను ప్రసాదించిన సందేశాలన్నిటినీ ప్రచురించి ప్రచారంలోకి తీసుకురమ్మని ఒక సందేశాన్నిచ్చారు. అప్పటికే బాబా మావారికి సందేశాలను ఇచ్చారు. వాటినన్నిటినీ ‘సాయి తత్వ సందేశాలు” అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

ఆయనకు ఇంకా సాయిబాబా వారు సందేశాలను తరచుగా ఇవ్వసాగారు.  తను అంతవరకు ప్రసాదించిన సందేశాలను దేశం నలుమూలలా వ్యాపింప చేయమని వాటిని ఆంగ్లంలోకి కూడా అనువాదం చేయమని ఆదేశించారు. 

అప్పటివరకు 77 సందేశాలను బాబా ఇచ్చారు.  వాటినన్నిటిని ఆంగ్లంలోకి అనువదించి ‘సాయి తత్వ సందేశ్’ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు.  ఇంతవరకు ఆయనకు 300 లకు పైగా సందేశాలను బాబా ప్రసాదించారు. వాటినన్నిటిని ఆంగ్లంలోకి అనువదిస్తూ ఉన్నారు. బాబా అనుగ్రహంతో వాటిని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పుస్తకంగా ప్రచురిద్దామనుకుంటున్నారు.

బాబావారు ఇచ్చిన సందేశాలన్నీ ఆధ్యాత్మికతా పరిజ్ఞానం కలిగి ఉన్న బోధనలు. బాబావారి సందేశాలను కాస్తయినా అర్ధం చేసుకునేంత పరిజ్ఞానం నాభర్తకు లేదు.  శ్రీశివనేశన్ స్వామీజీవారు ఆసందేశాలన్నిటిని మాకు విపులంగా తెలియచేసారు.

ఈ సందేశాలలో సాయిబాబా తన తత్వాన్ని నలుదిశలా ప్రతి వారికి తెలియచేయమని తన భక్తులందరికీ ఉధ్భోధించారు.  బాబా మనలోనే ఉన్నారు.  అంతటా వ్యాపించి ఉన్నారు. ప్రతి అణువణువులోను ఉన్నారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా సాయిబాబా వారి వ్యక్తిత్వం మనకి అవగతమవుతుంది. ‘కష్టపడేవాడు ఎపుడూ చెడిపోడు’. అందుచేత మనం భగవంతుని గురించి తెలుసుకోవాలంటే నిజాయితీతోను, చిత్తశుధ్ధితోను కృషి చేయాలి.

బాబా చేసిన బోధనలను ప్రవృత్తి ద్వారా నివృత్తిగా అభివర్ణించవచ్చు. అనగా స్వార్ధపరమయిన కోర్కెలకి శీఘ్రఫలితాలను ఆశించకుండా భగవంతునియందు నిశ్చలమయిన భక్తితో కర్మనాచరించి జ్ఞానమును పొందాలి.

(రేపటి సంచికలో షిరిడీకి రమ్మని బాబా ఆదేశించుట)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles