Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
షిరిడీకి రమ్మని బాబా ఆదేశించుట
1987వ. సంవత్సరం డిసెంబరు 20 వ. తారీకున నా భర్త ధ్యానంలో ఉండగా బాబా ఆయనను శిరిడీకి రమ్మని ఆజ్ఞాపించారు. షిరిడీకి వెడదామని నాకెంతగానో అనిపించింది. కాని అప్పుడు సంవత్సరం చివరిరోజులు, పైగా సెలవులు మొదలవడంవల్ల, ఎంతోమంది షిరిడీకి వస్తారు. మనకి అక్కడ బస దొరకడం చాలా కష్టమవుతుంది. ప్రశాంతంగా బాబాని దర్శించుకోలేమని మాపిల్లలు అడ్డు చెప్పారు. మేము మూడు నెలల క్రితమే షిరిడికి వెళ్ళాము. అయినా నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపించింది. పిల్లలు అన్న మాటలతో ఇంక మౌనంగా ఉండిపోయాను.
మరుసటిరోజు కాకినాడ నుంచి మా అన్నయ్య డా.సి.ఆర్.ప్రసాద్ వచ్చాడు. తామంతా ఒక మెటడార్ వ్యాన్ బుక్ చేసుకుని షిరిడీ వెడుతున్నామని, నన్ను, నాభర్తని కూడా తమతో రమ్మని చెప్పాడు. రెండు నెలలకు ఒకసారి షిరిడీకి రమ్మని బాబా సందేశం ఇచ్చినా, నాభర్త షిరిడీ వెళ్ళడానికి తటపటాయించారు. ఏమయినప్పటికీ కొద్దిరోజుల తరువాత మేము షిరిడీ వెళ్లాము. అంతా బాబా దయవల్ల, ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతాయి.
సరిగా క్రిస్మస్ రోజున మేము షిరిడీలో ఉన్నాము. ఆరోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిరిడీ వచ్చారు. అన్ని గెస్ట్ హౌస్ లు, హోటల్స్ ప్రముఖుల కోసం బుక్ చేయబడ్డాయి. కాని బాబా దయవల్ల మాకు వసతి దొరికింది. తల్లి తన పిల్లలకోసం ఎంతగా పరితపిస్తుందో, అదే విధమయిన ప్రేమతోను, దయతోను మాకు బాబా సందేశాన్నిచ్చారు. మా షిరిడీ యాత్ర మాకొక మరపురాని అనుభూతి. పరిపూర్ణమయిన సంతోషంతో హైదరాబాదుకు తిరిగి వచ్చాము.
శ్రీశివనేశన్ స్వామీజీగారు ఏది మాట్లాడినా అది బాబాగారే మాట్లాడుతున్నారని మాగట్టి నమ్మకం. శ్రీస్వామీజీ మమ్మల్ని రెండు నెలలకు ఒకసారి షిరిడీకి రమ్మన్నారు. మేము డిసెంబరులో షిరిడీకి వచ్చాము, కాబట్టి మరలా ఫిబ్రవరిలో వెళ్ళాలి. కాని కొన్ని అనుకోని పరిస్థితులవల్ల నాభర్త షిరిడీ వెళ్ళడం నిర్లక్ష్యం చేసారు.
అది 1988వ.సంవత్సరం మార్చి నెల 9వ. తారీకు. నాభర్త మధ్యాహ్నం వేళ నిద్రపోతున్నారు. హటాత్తుగా మాయిల్లంతా సుగంధ పరిమళంతో నిండిపోయింది. దోసెడు మంచిసువాసన గల మల్లెపూలు గాని, గులాబీ పువ్వుల నుంచి గాని అటువంటి పరిమళం వ్యాపించదు. దీనిని బట్టి బాబా మాయింటిలోకి ప్రవేశించారని గ్రహించుకున్నాము.
బాబా! వినయవిధేయతలతో మీకు మేము మా సాష్టాంగప్రణామాలను అర్పించుకోవడం తప్ప మీకు మేమేమివ్వగలం?
కొద్ది నిమిషాల తరువాత నాభర్త నిద్ర నుంచి మేల్కొన్నారు. తనకు బాబా కలలో కనిపించి నువ్వు షిరిడీకి ఎందుకని రాలేదని అడిగారని చెప్పారు. అప్పటికే రెండు నెలలు దాటిపోయింది. నాభర్త ఎంతో పరవశంతో ఉన్నారు.
దుప్పటి మీద, ఆయన నుదుటిమీద సువాసన ద్రవ్యం మరకలు ఉన్నాయి. మామనసులు ఆనందంతో నిండిపోయాయి. ఆసంతోషానికి మరొక ముఖ్యమైన కారణం, బాబా ఆదేశించిన ప్రకారం మేము షిరిడీకి వెడుతున్నామనే ఆలోచన. అది మాకెంతో చెప్పలేని ఆనందానుభూతులను కలిగించింది.
(రేపటి సంచికలో బ్రైన్ హెమరేజ్ నుండి బాబా నా భర్తను కాపాడుట)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 18వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 14వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 11వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 17వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 22వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments