Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
షిర్డీ యాత్రలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. బాబా యొక్క అనుమతి లేకుండా ఎవరైనా ఇంటికి తిరిగి వెళ్ళిన లేదా బాబా అనుమతి ఇచ్చిన తరువాత షిర్డీలో ఉన్న వారు అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. మరొక వైపు, భక్తుడు ఆయన సలహాను అనుసరించి భోజనం చేసి ఆలస్యంగా వెళ్ళిన వారికీ పరిస్థితులు అనుకూలంగా ఉండేవి. వారు వేళ కాని వేళ వెళ్ళిన కూడా రైళ్లు అందుకొని, ప్రయాణం సౌకర్యవంతంగా సాగేది. ఇటువంటి అనేక కథలు సచ్చరిత్రంలో ఇవ్వబడ్డాయి(హేమాద్పాంత్ సాయి సచ్చరిత్రా అధ్యాయం .9). దిగువ అటువంటి ఒక సంఘటన చెప్పబడుతుంది.
బాబురావు ఔరంగబాద్కర్ కొన్నిరోజులపాటు షిర్డిలో ఉన్నాడు. బాబా అతనికి తిరిగి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. అతను పదే పదే బాబాను అనుమతి అడుగుతూ ఉండేవాడు. అలా పదే పదే అడిగి విసిగిస్తూ ఉండటంతో బాబాకు కోపం వచ్చి “బాబురావు ఔరంగబాద్కర్ నీకు ఏది నచ్చితే అది చేయు, జరిగే పరిణామాలకి నేను భాద్యుడిని కాను” అన్నారు.
బాబా షిర్డీ వదిలి వెళ్ళమని తనకు అనుమతి ఇచ్చారని ఔరంగబాద్కర్ భావించాడు. అతను త్వరగా షిర్డీ నుండి నిష్క్రమించాడు. ఒక మైలు దూరం వరకు అంత బాగానే సాగింది. తరువాత భయంకరమైన తుఫాను ప్రారంభమైంది.
ఆ విధంగా అతను దారి మధ్యలో ఎటువంటి రక్షణ లేకుండా, ఎటువంటి ఆహరం లేకుండా ఆ చలిలో తడిసిపోయి వణుకుతూ ఒంటరిగా గడపవలసి వచ్చింది. మరుసటి రోజు మాత్రమే అతను తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించాలవలసి వచ్చింది. బాబా మాట జవదాటినందుకు తగిన పాఠం నేర్చుకున్నాడు.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – మూడవ భాగం
- ప్రాపంచికమా? ఆధ్యాత్మికమా? …..సాయి@366 జనవరి 22…Audio
- ‘‘మనం దర్శించుకోవాలనుకున్నంత మాత్రాన బాబా దర్శనం కాదు. అలాగే వెళ్ళాలనుకున్నంత మాత్రాన షిరిడికి వెళ్ళలేం. అన్నిటికీ బాబా అనుమతి కావాలి.
- శంకర్ లాల్ కె. భట్
- రామచంద్ర వి.. పాథంకర్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments