Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
బాబా ప్రత్యక్ష దర్శనం
1986వ. సంవత్సరం వేసవికాలం రోజులు. హైదరాబాదులో మా యింటిలో ఉన్నాము. ఒకరోజు నాభర్త మూత్ర విసర్జనకై తెల్లవారు ఝామున మూడు గంటలకు లేచారు. గదిలోనుంచి డ్రాయింగ్ రూములోకి వచ్చారు.
రాగానే సోఫాలో తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని ఉండటం కనిపించింది. నాభర్త కంగారుగా “ఎవరది” అని గట్టిగా అడిగారు. మెల్లగా సోఫా దగ్గరకు వెళ్ళారు. సోఫాలో సాయిబాబా కూర్చుని ఉండటం స్పష్టంగా కనిపించింది. ఒక్క సెకను లోపే సాయిబాబా అదృశ్యమయ్యారు.
నా భర్త వేసిన కేక విని మేమంతా డ్రాయింగు రూములోకి వచ్చాము. నాభర్త ఎంతో సంతోషంగా కనిపించారు. ఆయన మొహం బ్రహ్మండమయిన సంతోషంతో వెలిగిపోతోంది. తన పూర్వజన్మ సుకృతం వల్ల తనకు బాబా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారని ఎంతో సంతోషంగా చెప్పారు.
బాబా సోపాలో కూర్చున చోట శాలువాతో కప్పిఉంచాము. అక్కడ బాబావారి పెద్ద సైజు ఫోటోని ఉంచాము. మేము ఆ డ్రాయింగు రూములోకి వెళ్ళినప్పుడెల్లా అనవసర విషయాలను ఏమీ మాట్లాడుకునేవారము కాము. బాబా అక్కడ కూర్చుని మమ్మల్ని గమనిస్తూనే ఉన్నరనే భావంతో ఉండేవాళ్ళము. మా కులదైవంగా బాబా మాయింట్లోనే నివాసం ఉన్నారని భావిస్తూ ఉంటాము.
సాయిబాబా లీలలు అధ్భుతమైనవి, అనంతమైనవి
హైదరాబాదులో ఉంటున్న ఒక సాయి భక్తుని ఇంటిలో నాభర్త, శ్రీ శివనేశన్ స్వామీజీ వారి ఫోటో చూశారు. ఆఫోటో నాభర్తకు చాలా నచ్చింది. అపుడా భక్తుడు ఫోటో ముందు చీటీలు వేసాడు. బాబా ఆఫోటోను మాకు ఇమ్మని తమ అనుమతిని ప్రసాదించారు. బాబా అనుమతితో అతను ఆ ఫోటోను నా భర్తకు ఇచ్చాడు. మేము శ్రీశివనేశన్ స్వామీజి వారి ఫోటోను ఎంతో సంతోషంతో మా యింటికి తీసుకుని వచ్చాము.
నాలుగు రోజుల తరువాత మాకు ఫోటో ఇచ్చిన సాయి భక్తుడు మాఇంటికి వచ్చి “మీకు స్వామీజీ ఫొటో ఇచ్చినప్పటి నుండి మాయింట్లో కష్టాలు మొదలయ్యాయి. ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా సమస్యలుగా ఉంది. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. దయచేసి నాఫొటో నాకు తిరిగి ఇచ్చేయండి” అని వేడుకున్నాడు.
మేమేమీ అభ్యంతరం చెప్పకుండా ఆయన ఫొటో అతనికి ఇచ్చేశాము. ఆతరువాత శ్రీశివనేశన స్వామీజీ వారి ఫొటో కొందామని ఎంతో ప్రయత్నించాము. షిరిడీలో కూడా ఆయన ఫొటో దొరకలేదు. శ్రీస్వామీజీ గారికి తన ఫొటో మావద్ద ఉండటం ఇష్టం ఉండచ్చు, లేకపోవచ్చు అని ఆలోచిస్తూ ఆ విషయాన్ని అయిష్టంగానే అంతటితో వదిలేశాము.
ఒక వారం తరువాత నాభర్త ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నిటినీ ఒక పెట్టెలో సద్దుతున్నారు. పుస్తకాల మధ్యలో శ్రీశివనేశన్ స్వామీజీ గారి ఫొటో కనిపించింది. ఇంతకు ముందు మేమా ఫోటో చూడలేదు. ఆఫొటో ఆ పుస్తకాల మధ్యలోకి ఎలా వచ్చిందో మాకర్ధం కాలేదు. ఆ ఫోటో బెస్ట్ సైజు వరకు ఎన్ లార్జ్ చేయబడి ఉంది. ఆ ఫొటోలో స్వామీజీ చిరునవ్వుతో ఉన్నారు. ఆఫొటో చూసి మాకెంతో సంతోషం కలిగింది. ఈ విధంగా బాబా మా కోరికను నెరవేర్చారు. మనఃస్ఫూర్తిగా ఆయనకు మాప్రణామాలు అర్పించుకున్నాము.
కొద్ది రోజుల తరువాత మేము షిరిడీ వెళ్ళినపుడు శ్రీ శివనేశన్ స్వామీజీ గారికి ఆఫొటో చూపించాము. మీ అనుగ్రహం వల్లనే మాకు మీ ఫొటో లభించిందని సంతొషంతో చెప్పాము. అప్పుడు స్వామీజీ “అటువంటి ఫొటో ఎవరైనా తీసారేమో నాకు తెలీదు. నేనా ఫొటోని ఎప్పుడూ చూడలేదు. ఇదంతా సాయిబాబా చూపించిన లీల” అన్నారు.
మరుసటి రోజు చావడిలో ఉండగా ఢిల్లీ నుండి కుమారి వందన అనే ఆమె వచ్చింది. ఆమె శివనేశన్ స్వామీజి వద్దకు వచ్చి తనకు ఎవరో తెలియని వాళ్ళు ఆయన ఫోటో బహుమానంగా ఇచ్చారని చెప్పింది. మేము మాదగ్గర ఉన్న స్వామీజీ ఫొటో చూపించాము. ఆమె ఫొటో చూసి ఇది వేరే ఫోజులో ఉందని చెప్పింది. భక్తులందరికీ వేరు వేరు రకాల భంగిమలతో ఉన్న ఫొటోలు ఎలా వచ్చాయి. ఇదంతా బాబా చూపించిన లీల.
రేపు తరువాయి భాగం…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 14వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 20వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 17వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 9వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments