వామన్ సి. ముంగె



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

నాసిక్ జిల్లా పింపల్ గావ్, బస్వంత్ లో ప్లేగు చెలరేగింది. న్యాయవాది అయిన వామన్ సి. ముంగె తన కుటుంబాన్ని తన ఫార్మ్ హౌస్ కి తరలించారు. ఒక రాత్రి అతని ఇంటిలో దొంగతనం చేసే ప్రయత్నంలో దొంగలు ఉన్నారు. దొంగలు గోడకు తెలివిగా ఒక రంధ్రం  చేశారు. ముంగే ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. పైన గోడపై బాబా యొక్క ఛాయాచిత్రం వేలాడుతూ ఉంది.

దొంగలలో ఒకడు గది లోపలకి ప్రవేశించి మంచం క్రింద ఉన్న చిన్న పెట్టెను తీసి బయట ఉన్న అతని సహచరుడికి అందిచాడు. ఆ పెట్టెలో రూ. 200/ – నగదు, రూ. 4000/ – విలువైన కొన్ని ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. తరువాత దొంగ మంచం ముందు ఉన్న పెద్ద ట్రంక్ పెట్టెను పైకి ఎత్తే పనిలో ఉన్నాడు. ఆ ట్రంక్ పెట్టెలో సుమారు రూ. 10,000/ –  విలువ చేసే కుటుంబ ఆభరణాలు ఉన్నాయి. గోడకు ఉన్న ఛాయాచిత్రం నుండి బాబా అన్నింటినీ చూస్తున్నారు.

ఆ వెంటనే, బాబా ముంగే కలలో కనిపించి, అతన్ని మేల్కొల్పి దొంగతనం గురించి హెచ్చరించారు. అందువలన అతను బిగ్గరగా అరవటం ప్రారంభించాడు. అతని వదిన(లేదా మరదలు) అతనితోపాటు కేకలు పెట్టింది. వీరిద్దరి అరుపులకి మొత్తం కుటుంబం, సేవకులు మరియు కాపలాదారుడు నిద్రలేచారు. వారు దొంగలను వెంబడించారు గాని వారు పారిపోయారు.

మరుసటి రోజు చిన్న పెట్టె సమీపంలోని పొలంలో దొరికింది. నగదు అయితే లేదు కానీ, ప్రామిసరీ నోట్లు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ రోజున అతను కలలో బాబా, అబ్దుల్ మరియు మరొక ఫకిర్ (అబ్దుల్ యొక్క గురువు)లను చూసాడు. తరువాత అతను షిర్డీని సందర్శించి అక్కడ ఆ ముగ్గురిని చూశాడు.

కొన్ని రోజుల తరువాత కోపరగావ్ కి చెందిన శ్రీ దత్త బ్రహ్మచారి భోజనం కోసం అతని వద్దకు వచ్చాడు. అతను కోల్పోయిన ఆస్తి స్వాధీనం అయ్యిందని ముంగేతో చెప్పాడు. పోలీసులు మార్వారీపై దాడి చేసి, అతని నుండి అనేక దోచుకున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారి కూడా ముంగే ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పారు. తదనుగుణంగా సరైన గుర్తింపుతో అతను తన డబ్బును తిరిగి పొందాడు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles