సాయినాధుడే శ్రీగణేశుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

1915వ సంవత్సరంలో త్రయంబక్ గోవింద్ సామంత్ షిరిడీకి వెళ్ళాడు. అతని వద్ద 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అందులో నుండి అతను రూ. 1/- బాబాకు దక్షిణ  ఇచ్చాడు. బాబా మరో రూపాయి ఇమ్మని అడిగారు. కానీ సామంత్ మరో రూపాయి ఇవ్వటానికి విముఖంగా ఉన్నాడు. బాబా మళ్ళీ మళ్ళీ అడగగా, చివరకు సామంత్ మరో రూపాయి సమర్పించుకున్నాడు.

అప్పుడు బాబా ఆ రూ. 2/-  తీసుకొని పైకి క్రిందకి తిరగేసి చూసి “నీవు ఈ రెండు రూపాయలు గణపతి భగవానునికి ఇచ్చావు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, గణు మహారాజ్ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు” అని చెప్పారు. సామంత్ తిరిగి వెళ్ళే ఆతురతతో ఉన్నాడు, మరియు మరో రూపాయి బాబాకు ఇచ్చి కోల్పోయినందుకు ఆందోళనగా ఉన్నాడు. అందువలన బాబా చెప్పిన దానిని అర్థం చేసుకోలేకపోయాడు.

బాబా అతనికి గణు మహారాజ్ గా దర్శనం ఇచ్చిన విషయం అతనిని దివించడం ద్వారా గుర్తు చేయాలని ప్రయత్నిచారు. 21 సంవత్సరాల వయస్సులో బాబా అతనికి గణు మహారాజ్ గా దర్శనం ఇచ్చి అతనికి గణపతి యొక్క ఏక అక్షర మంత్రం చెప్పారు. అప్పుడు సామంత్ ఆ మంత్రంతో ఒక కోటి నామజపం చేసాడు.

అతను షిర్డీ నుండి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతినిచ్చారు. అసంతృప్తిగా అతను ప్రధాన రహదారికి వెళ్ళాడు, అక్కడ కోపరగావ్ వెళ్ళడానికి టాంగా లేదు. ఇంతలో రహత నుండి టాంగాలో ఒక గుజరాతీ వ్యక్తి ప్రయాణిస్తూ ఉన్నాడు. అతడు సామంత్ ని తనతోపాటు రమ్మని కోరాడు. సామంత్ అతని పక్కన కూర్చున్న తరువాత టాంగా కోపరగావ్ వెళ్తూ ఉంది.

ఆ గుజరాతీ వ్యక్తీ సామంత్ ని “మీరు బాబా దర్శనం చేసుకొని వస్తున్నారా? మీరు ఒక రూపాయి ఇస్తే అయన మరో రూపాయిని అడుగుతారు” అని అన్నాడు.  ఆ మాటలు విని సామంత్ దిగ్బ్రాంతి చెందాడు. ఇతనికి ఇవన్నీ ఎలా తెలుసు అని  ఆశ్చర్యపోయాడు!

కోపరగావ్ చేరుకున్న తరువాత గుజరాతీ వ్యక్తి టాంగా వాణికి ఇవ్వవలిసిన వారిద్దరి ఛార్జీలను చెల్లించాడు, ఇంకా అతను దాదర్ కి రెండు టిక్కెట్లు కూడా కొనుగోలు చేశాడు. వారు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేసి దాదర్ లో దిగారు. గుజరాతీ వ్యక్తీ సామంత్ కి హృదయపూర్వకంగా భోజనం పెట్టాడు. సామంత్ అతని దయగుణానికి కలవరపడ్డాడు.

అతడు గుజరాతీ వ్యక్తీ పేరు మరియు చిరునామా అడిగాడు. అతడు  ‘గణు మర్వాడి, ప్లాట్ నెంబర్ 1, బుందేర్ మసీదు వెనుక’ అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సామంత్ అతనిని కలుసుకోని డబ్బును తిరిగి ఇద్దామని అతను చిరునామా వెతుక్కుంటూ వెళ్ళాడు. సామంత్ అక్కడ అంత వెతికాడు కానీ గణు మర్వాడి పేరుతొ అక్కడ ఎవరు నివసించుటలేదు. మొత్తం ప్రాంతమంతా ముస్లింలు నివసిస్తున్నారు.

అప్పుడు సామంత్ బాబా మాటల గురించి తీవ్రంగా ఆలోచించాడు. అతను గతంలో త్రయంబకేశ్వరం సమీపంలోని అరణ్యంలో తాను దారి తప్పిపోయిన సంఘటనను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ సమయంలో కొందరు దోపిడీదారులు అతనిని ఒక గుహకు తీసుకోని వెళ్లి బంధించి చంపేస్తామని బెదిరించారు. రక్షణ కోసం అతను గణపతిని తీవ్రంగా ప్రార్ధించాడు. వెంటనే “జై మల్హరి” అని ఒక పెద్ద అరుపు వినపడింది. ఆ శబ్దానికి దొంగలు భయపడి అతనిని విడిచిపెట్టారు.

మరొక సందర్భంలో అతను అదే అడవిలో తాను వెళ్ళవలసిన దారి తప్పిపోయి మళ్ళీ అతను గణపతిని ప్రార్ధించాడు. హఠాత్తుగా నల్ల కుష్ఠురోగంతో బాధపడుతున్న వ్యక్తి అతని ముందు నిలబడి “నా పేరు గణు మహర్, నీవు వెళ్ళవలసిన మార్గం తప్పిపోయావు, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, కానీ మీరు వెనుకకు తిరిగి చూడకూడదు. నీకు అంగీకరమా?” అని అడిగాడు.

అందుకు సామంత్ అంగీకరించాడు. తరువాత వారు ముందుకు నడవడం ప్రారంభించారు. గణు మహర్ అతని వెనుక ఉండి, అతనితో మాట్లాడుతూ మార్గం నిర్దేశం చేస్తూ ఉన్నారు. వారు ప్రధాన రహదారి చేరుకోగానే గణు మహర్  నిశ్శబ్దంగా ఉన్నారు. సామంత్ తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు.

గతంలో జరిగిన ఆ సంఘటనల గురించి ఆలోచిస్తూ, తనను పట్టుకున్న దొంగల బారి నుండి తనని విముక్తుడిన చేసినది, అరణ్యంలో దారి చూపించిన గణు మహార్ రూపంలో మరియు షిర్డీ నుండి వచ్చేటప్పుడు తనకి సహాయపడిన గుజరాతీ వ్యక్తీ గణు మార్వాడి రూపంలో తనకు తోడ్పడినది బాబాయే అని గ్రహించాడు. అప్పటినుండి సామంత్ బాబాను గణపతి రూపంగా పూజించటం మొదలుపెట్టాడు.

  • చిదంబరరావు గాడ్డిల్ అనే గణపతి భక్తుడు శిరిడీ దర్శించినప్పటి నుండి యింటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు శిరిడీ వచ్చినపుడు ఆయన నవ్వి. “ఈ ముసలాడు చాలా టక్కరి ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు” అన్నారు.
  • ఒకసారి బాంద్రా నుండి ఒకామె వచ్చి సాయికి నమస్కరించి, సాయి యెదుట కూర్చోగానే, ఆమెను 7 సంuలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, “అమ్మా! నీ చిన్నతనమునుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు” అన్నారు. ఆమెకేమీ అర్థంకాలేదు. బాబా నవ్వుతూ, “నీవెవరిని పూజిస్తావు” అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి “నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి” అన్నారు.  విఘ్నేశ్వరుడు భోజనప్రియుడు ఆ గణపతియే తామని బాబా సూచించారు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయినాధుడే శ్రీగణేశుడు

Maruthi

Sai Baba..Sai Baba…Sai Baba…Sai Baba

వరదా భాస్కరాచార్యులు

సాయి శరణం

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles