రామచంద్ర వి.. పాథంకర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

రామచంద్ర వి. పాథంకర్, పదవి విరమణ చేసిన అలీబాగ్ యొక్క గుమస్తా. ఇతడు కూడా చోల్కర్ (సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం) లా దాసగణు యొక్క కీర్తనలు, ప్రవచనాలకు హాజరైనాడు. కానీ ఆయనకు బాబా పట్ల విశ్వాసం కలగలేదు. బాబా ఒక ముస్లిం అని అతను అనుకున్నాడు.

1910లో అతడు భాధలలో ఉన్నాడు. అతని నెలసరి ఆదాయం కేవలం రూ .30 / –  మాత్రమే. అది అతని కుటుంబ ఖర్చులకు సరిపోయేదికదు. దాదర్ లోని బాలకృష్ణ బువా మఠంలో ఉన్న అక్కల్కోట్ స్వామి యొక్క ఛాయాచిత్రం అతనిని ఆకర్షించింది. అతను మఠంను తరచూ సందర్శిస్తూ స్వామి సామర్ధను భక్తితో ఆరాధిస్తుండేవాడు.

ఒక రోజు అతని స్నేహితుడైన ఘనశ్యాం గుప్తా అతనితోపాటు షిర్డీకి రమ్మని అడిగాడు. పర్యటనకి అవసరమైన ఖర్చులన్నింటిని అతడు భరిస్తానని కూడా ఆయన పాథంకర్ కి హామీ ఇచ్చాడు. పాథంకర్  మొట్టమొదట అయిష్టంగానే ఉన్నాడు, తరువాత అతను బాబాకు దక్షిణ ఇవ్వననే ఒప్పందంపై.ఘనశ్యాం తోపాటు వస్తానని ఒప్పుకున్నాడు. ఒకవేళ ఇచ్చినా ఒక రూపాయి కంటే ఎక్కువ ఇవ్వను అన్నాడు పాథంకర్. ఘనశ్యాం అందుకు అంగీకరించి, వారిద్దరూ కలిసి షిర్డీకి వెళ్ళారు.

ఆ రోజులలో షిర్డీలో కేవలం ఒక హోటల్ ఉంది. దురదృష్టవశాత్తు, పాథంకర్ భోజన సమయంలో పప్పులో కొన్ని పురుగులను చూసాడు. అతను బిగ్గరగా అరవటం ప్రారంభించాడు. “నేను ఈ పురుగులను తినాలని ఇంత దూరం ప్రయాణం చేసి షిర్డీకి వచ్చానా?” అని అన్నాడు.

తరువాత ఇద్దరు స్నేహితులు బాబా దర్శనం కోసం వెళ్లారు. బాబా పాథంకర్ ను చూస్తూనే కోపంతో మండిపడి అతనిని దూరంగా తరిమేసారు. పాథంకర్ నిరాశపడి బాబా సమ్మతి లేకుండానే షిర్డీ విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇతర భక్తులు అతనిని ఓదార్చి, అలా చేయవద్దని చెప్పారు.

తరువాత స్నేహితులు ఇద్దరూ మళ్ళీ బాబా దర్శనం కోసం వెళ్లారు. బాబా శాంతించి పాథంకర్ ని చూస్తూ  “పురుగులను తినడానికి ప్రజలు ఇక్కడకు వస్తారా?” అని అడిగారు.

ఈ ప్రశ్న వింటూనే పాథంకర్ బాబా పాదాల మీద పడిపోయాడు. బాబా సర్వ వ్యాపి అయి ఉన్నారని అతను గ్రహించాడు. అప్పుడు బాబా అతనికి అక్కల్కోట్ స్వామిగా దర్శనం ఇచ్చారు. అతడు బాలకృష్ణ బువా మఠంలో అతడు ఆరాధించే సరిగ్గా అదే రూపంలో బాబా దర్శనం ఇచ్చారు.

పాథంకర్ మనస్సు నిండ ఆనందంతో ఉప్పొంగింది. బాబా, స్వామి సమర్థ  వేరు కాదు, వారిద్దరి మద్య భేదం లేదని అతనికి అర్ధమయ్యింది. అతను బాబాకి ఒక రూపాయి దక్షిణ ఇచ్చాడు. అయితే, బాబా మళ్ళీ దక్షిణ అడిగారు. అతను ఆనందముగా మరొక రూపాయి ఇచ్చాడు.

అప్పుడు, బాబా అతనికి షిర్డీ నుండి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మంచి జీతంతో అతనికి మరొక ఉద్యోగం వచ్చింది. దానితో అతను సౌకర్యవంతంగా జీవించగలిగాడు. బాబా అతని నుండి రెండు రూపాయలు దక్షిణ తీసుకొని అతనికి వందరెట్లు తిరిగి ఇచ్చారు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు మా

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “రామచంద్ర వి.. పాథంకర్

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles