Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
సాయి మహాభక్త బాలకృష్ణ రామచంద్ర ఖైర్కర్, ఒక గ్రామీణ బ్రాహ్మణుడు, అతను చితలే గ్రామం నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న ఖైరీ గ్రామవాసి.
జులై 27, 1936 న శ్రీ సాయి బాబాతో ఉన్న తన అనుభవాల గురించి శ్రీ బి.వి.నారసింహ స్వామిజీ గారికి ఆయన ఇలా వివరించారు:
35 సంవత్సరాల క్రితం నేను సాయిబాబా గురించి మొదట విన్నప్పుడు, అతను ఒక పిచ్చి వ్యక్తి అని విన్నాను. కానీ కొంతకాలం తర్వాత ప్రతి ఒక్కరూ అతనిని గురించి గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పా కులకర్ణి వంటి షిరిడి బ్రాహ్మణులలో కొందరితో నాకు పరిచయం ఉండటం వలన ఒకసారి నేను సాయి బాబా దర్శనం కోసం వెళ్ళాను.
నేను వంశపారంపర్యంగా గ్రామ అధికారిగా పనిచేస్తు ఉండేవాడిని. 1916వ సంవత్సరంలో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామ అధికారుల వ్యవస్తను రద్దు చేసింది. పూర్వ రోజులలో చితలే, జల్గావ్, రాంపూర్, నాత్పట్లాచా, వాడి, పిప్పల్వాడి మీదుగా ఉన్న మార్గాన్ని షిర్డీ సందర్శించడానికి ప్రజలు ఉపయోగించేవారు. ఈ రహదారి ఇప్పుడు ఉపయోగంలో లేదు.
నేను బాబా నూనెకు బదులుగా నీటిని ఉపయోగించి దీపాలు వెలిగించిన లీల చూసాను. దండెపూర్ కి చెందిన దేశ్పాండే మాస్టర్ తరచుగా బాబా మాటలు వింటుండేవారు. కాని బాబా చెప్పినదాని గురించి నాకు ఏమీ తెలియదు.
ఒకసారి 1908లో, నేను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ద్వారకామాయి మసీదు నేలపై పడి ఉన్న ఒక నాణెం చూశాను. నేను దానిని తీసి బాబాకు చేతికి అందించి “ఇది మీ నాణెం, దీనిని సురక్షితంగా ఉంచండి” అని చెప్పాను.
కానీ బాబా నాకు ఆ నాణెం తిరిగి ఇచ్చి, “సరేలే, ఈ నాణెన్ని ఇంటికి తీసుకువెళ్లి, మీ పూజ గదిలో మీరు పూజించే ప్రతిమలతో పాటు ఉంచు, మీరు శ్రేయస్సు పొందుతారు” అని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారం, నేను ఆ నాణెం తీసుకొనివెళ్లి ఆరాధించాసాగాను.
మూడు సంవత్సరాలలో, అనగా 1911 కల్ల, నాకు ఎంతో శ్రేయస్సు కలిగింది. నేను ఆ నాణేన్ని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత, కులకర్ణి గా చాలా ఆదాయం పొందగలిగాను, మరియు నా భార్యకు బంగారు గాజులను కూడా చేయించాగాలిగాను. అంతకుముందు నా పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.
తరువాత నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందువలన నా పారాయణ గ్రంధాన్ని ఒక స్నేహితుడికి పంపించాను. ఆ గ్రంధంలో బాబా ఇచ్చిన నాణెం ఉన్న సంగతి నాకు అసలు గుర్తు లేదు. కొన్ని రోజులు తర్వాత నాణెం పోగొట్టుకునట్లు గుర్తించాను.
1911 తర్వాత, నా చెడు రోజుల ప్రారంభమైనవి. ముందుగ నాణెం కోల్పోయిన ఆరునెలల్లో నేను నా భార్యను కోల్పోయాను. 1916లో నేను నా గ్రామాధికారి పదవి కోల్పోయాను. 1917-18లో నేను నా తల్లిని కోల్పోయాను. నేను ఇప్పుడు నా ఆహారం కోసం యాచించడం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం రామనవమికి షిర్డీ వెళ్తూ ఉంటాను.
Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/balakrishna_ramachandra_khairikar.html
(Devotees’ Experiences of Sri Sai Baba Part I, II and III by Sri.B.V.Narasimha Swamiji)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ రామచంద్ర మాదయే బువా
- బాలకృష్ణ ఉపాసని శాస్త్రి
- రామచంద్ర వి.. పాథంకర్
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments