నా పిల్లలను ఆకలితో ఉంచగలనా? – మొదటి బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అత్యద్భుతమైన సాయి లీలా విలాసం గురించి తెలుసుకుందాము.

నా పిల్లలను ఆకలితో ఉంచగలనా? – మొదటి బాగం….

బొంబాయి నివాసియైన వివేక్ మజ్ గావకర్ గొప్ప సాయి భక్తుడు.  బాబా అనుగ్రహం లేకపోయినట్లయితే జీవితమే వ్యర్ధమని భావించే వ్యక్తి.  అతని జీవితమమంతా బాబా చుట్టూరా పరిభ్రమిస్తూనే ఉంటుంది. 

ఒకసారి అతని జీవితంలో చాలా దయనీయమయిన పరిస్థితి ఎదురయింది.  బాబా ఆసమయంలో అతనిని ఆపరిస్థితినుంచి ఏవిధంగా గట్టెక్కించారో చాలా అధ్భుతంగాను, ఆశ్చర్యకరంగాను ఉంటుంది.  ఇపుడు బాబా దయవల్ల అతను చాలా సంతోషంగాను, తృప్తిగాను జీవిస్తున్నాడు.

ఒకసారి అతనిని బంధువులు షిరిడీకి తీసుకునివెళ్ళమని కోరారు.  బంధువుల్లో కొంతమంది ఆడవారు, పిల్లలు ఉన్నారు.  వారి కోరిక మేరకు అతను ఒక పెద్ద వ్యాను ఏర్పాటు చేసాడు.  అందరూ కలిసి ఎటువంటి కష్టం లేకుండా షిరిడీ చేరుకున్నారు.  ఆరాత్రికి షిరిడీలోనే బస చేసి మరుసటి రోజు ఉదయాన్నే కాకడ హారతికి వెళ్ళారు.  తనివితీరా బాబా దర్శనం చేసుకున్నారు. 

ఉదయం అందరు ఫలహారాలు కానిచ్చిన తరువాత బంధువులందరూ అక్కల్ కోట కూడా చూద్దామని అక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగారు.  వివేక్ సరేనని ఒప్పుకోవడంతో అందరూ సామాన్లు సద్దుకొని తయారయ్యారు.  అపుడు సమయం ఉదయం 11 గంటలయింది.  షిరిడీ నుండి అక్కల్ కోట చాలా దూరమనే విషయం పాపం వివేక్ కి తెలీదు.

అక్కల్ కోట ఎంత దూరంలో ఉందని డ్రైవర్ ని అడిగాడు.  “ఆ, ఎంతండీ,  రెండు గంటల్లో మనము అక్కల్ కోట వెళ్ళిపోవచ్చు” అన్నాడు డ్రైవరు.  అక్కల్ కోటకి ఏమార్గంలో వెళ్ళాలో అది షిరిడీ నుండి ఎంత దూరంలో ఉందనే విషయం డ్రైవర్ కి కూడా తెలీదు. డ్రైవర్ కి తెలీదనే  విషయం ఆసమయంలో వివేక్ కి తెలీదు.  సరే 11 గంటలకి బయలుదేరితే అక్కల్ కోటకి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా చేరుకోవచ్చు, అక్కల్ కోటలో భోజనాలు చేసేయవచ్చనుకున్నారు అందరూ.

అందరూ కలిసి వానులో బయలుదేరారు.  రెండుగంటలు ప్రయాణం చేసినా ఎక్కడా అక్కల్ కోటకి చేరుకుంటున్న సూచనలు ఏమీ కనపడలేదుఅసలు వారు ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా తెలీని పరిస్థితిలోను, అయోమయంలోను పడిపోయారు.  డ్రైవర్ని అడిగితే అక్కల్ కోటకి దగ్గరలోనే ఉన్నాము ఇక కొద్దిసేపట్లోనే చేరుకుంటామని చెప్పాడు.  ఎన్నిమార్లు అడిగినా అదే సమాధానం చెప్పేవాడు.

రోడ్డుప్రక్కల  ఉన్న సూచికలను బట్టి డ్రైవర్ ఆఖరికి అక్కల్ కోట వెళ్ళడానికి షోలాపూర్ మీదుగా వెళ్ళాలని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అయింది.  ఇక ఆ దారిలో వెళ్ళసాగాడు. అడిగిన ప్రతిసారీ ఇక కాసేపట్లోనే అక్కల్ కోట చేరుకుంటామనే చెపుతున్నాడు డ్రైవరు.  ఆఖరికి వారంతా అక్కల్ కోట చేరేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది.  ఆసరికి అందరూ అలసిపోయి చాలా ఆకలితో ఉన్నారు.

అక్కల్ కోట ఎక్కడో మారుమూలనున్న చిన్న గ్రామం.  అక్కడ ఉండటానికి ఎటువంటి సౌకర్యాలు గాని, హోటళ్ళు గాని లేవు.  ముందర ఆడవాళ్ళు, పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ఏమన్నా దొరుకుతె వాళ్ళని అందులో బస చేయించి ఈలోపులో అందరికీ భోజనాలకి ఎక్కడ ఏర్పాటు ఉందో వెతకచ్చు అనుకున్నాడు వివేక్.   సంస్థానం వారి భక్తినివాస్ ఇంకా నిర్మాణదశలోనే ఉంది.

అక్కడ బసకి గాని, భోజనాలకిగాని ఇంకా ఎటువంటి ఏర్పాట్లు లేవు.  లాభం లేదు.  బాగా రాత్రివేళ కావడంతో అన్నీ మూసేసి ఉన్నాయి.  కనీసం బసచేయడానికి ఒక్క గదిగాని, ఏదన్న తిందామన్నా కనీసం ఒక్క హోటలు గాని లేవు.  ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి.  చిన్న పిల్లలందరూ ఆకలి, ఆకలి, అంటూ ఏడుస్తున్నారు.  వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

పెద్దవాళ్ళే ఆకలికి తట్టుకోలేకుండా ఉంటే పిల్లలపరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  తినడానికి కాస్తయినా ఏదన్న దొరుకుతుందేమో, చిన్న హోటలు ఏదయినా  కనిపిస్తుందేమో చూద్దామని కారుని మెయిన్ రోడ్ మీదే పోనిస్తూ ఉండమని చెప్పాడు డ్రైవర్ కి వివేక్.  కాని ప్రతిచోట రోడ్డంతా చీకటిగాను, నిర్మానుష్యంగాను ఉంది.  ఎంత ముందుకు వెళ్ళినా ఏమీ కనపడలేదు.

రేపు తరువాయి బాగం…..

తరువాయి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

source: సాయి సాగర్ మ్యాగజైన్ వాల్యూమ్ – 7  నం. 2  ఏప్రిల్ – మే, 2009.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles