సాయి భక్త ఆనందరావు పాఖడే రెండవ బాగం…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి బాగం……

ఆనందరావు పాఖాడే శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువు చుండెను. సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్నదృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణకాలక్షేపమునకు కొంచెమాటంకము గలుగజేసెను.

కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను. “నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధాన మిదిగో! బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. “రక్షకమైన భక్తి” వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కిచెప్పియున్నారు.” అందరు ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కొరిక ప్రకారము పాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్ప నారంభించెను.

లోతైన సముద్రములో నడుము వరకు దిగి యచ్చట నిలచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని, అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని యనుకోలేదు.

మాధవరావు కూడ అచ్చట నిలచి యుండెను. శ్యామా “ఆనందరావు! బాబా పాదములపై బడుము” అని సలహా నిచ్చెను. “నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది, కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను” అని నేనంటిని.

అది విని యతడు బాబాతో నిట్లనెను. “ఓ దేవా! నీటిలో నున్న నీ పాదములను బయటకు దీయుము.” వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసెను. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. “ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు.” 

బాబా యాజ్ఞానుసారము పాఖాడే పట్టుదోవతిని తెచ్చెను. మాథవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామా యందుల కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను. సంశయవిషయములందు చీటివేసి సంశయమును దీర్చు కొనుట కాకాసాహెబు స్వభావము. ‘పుచ్చుకొనుము’, ‘నిరాకరించుము’ అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకలవద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. ‘పుచ్చుకొనుము’ అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. కాకాసాహెబు సంశయము తీరెను. 

ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కథ ప్రబోథించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తివిశ్వాసము లుండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగా తెలిసియుండును.

నీ హృదయఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురువసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల, హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్యశరాణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.

ఒక బాబా అసలు పెయింటింగ్ ఆనందరావు పాఖడే ఇంటిలో గోడకు వేలాడదీయబడి ఉంటుంది. ఆ ఫోటోకే తన ప్రార్థనలను ఆనంద్రావు విన్నవించుకుంటూ ఉంటారు. షిర్డీలో బాబా ఉన్నప్పటి నుండి ఈ ఛాయాచిత్రం అతనితో ఉంది. కానీ బాబా స్వయంగా ఈ ఛాయాచిత్రం అతనికి ఇచ్చారా లేదా అని మాత్రం తెలియదు.

బాబా “నేను నిన్ను విమానంలో తీసుకుపోతాను” (మరణం సమయంలో) అని శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ కి హామీ ఇచ్చినట్లు ఆనందరావు పాఖడేకు కూడా బాబా హామీ ఇచ్చారు. అదేవిధంగా, శ్రీ.ఆనందరావు పాఖడే పవిత్రమైన గణేష్ చతుర్థి రోజున చాలా ప్రశాంతమైన మరణం పొందారు. దురదృష్టవశాత్తు, అతని మరణం తేదీ మరియు సంవత్సరం తెలియదు.

శ్రీ. ఆనందరావు పాఖడే కుమారుడు శ్రీ.మంగేష్ పాఖడే 80 ఏళ్ల పైగా జీవించి 2016 జులై 24వ తేదీన గతించారు. ముంబైలోని విలే పార్లే ఇంటిలో ప్రస్తుతం శ్రీ ఆనందరావు పాఖడే మనవడు శ్రీ మనోజ్ పాఖడే తన కుటుంబంతో నివసిస్తున్నారు.

Late Shri.Mangesh Pakhade and Grand Son Shri.Manoj Pakhade

సాయి భక్తుల ప్రయోజనం కోసం శ్రీ ఆనందరావు పాఖడే మనవడు శ్రీ మనోజ్ పాఖడే యొక్క సంప్రదింపు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

Shri.Manoj Pakhade
Grandson of Late Shri.Anandrao Pakhade
Pakhade House, Nehru Road,
Opposite Municipal Office,
Vile Parle East,
Mumbai-400 057,
Maharashtra, India
Contact Numbers: +91 22 2615 0698 / +91 22 2614 7916

(Source: Shri Sai Satcharitra Chapter 45 and Baba’s Rinanubandh by Vinny Chitluri ; Photograph Courtesy: Shri.Sandeep Suresh Deore, Mumbai)

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles