సాయి భక్త ఆనందరావు పాఖడే మొదటి బాగం…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి మహాభక్త ఆనందరావు పాఖడే గారు 1910లో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ రోజుల్లో చాలా కొద్ది మంది మహారాష్ట్రలు మాత్రమే వ్యాపారం చేసేవారు, అందులో ఇతను ఒకరు. అతను లామింగ్టన్ రోడ్డులో నివసించావారు. అతను సూక్ష్మ బుద్ధి గల గొప్ప వ్యాపారవేత్త. అతను 1914 లో విలే పార్లే, నెహ్రూ రోడ్ లో ఒక బంగాళా కొన్నారు. అప్పుడు విలే పార్లే నాలుగు గృహాలతో ఒక ఏకాంతమైన ప్రదేశం. విద్యుత్ మరియు నీటి సరఫరా కూడా లేదు. కుటుంబం ఒక లాంతరు ఉపయోగించేవారు మరియు బావి నీరు త్రాగేవారు.

అందువల్ల అతను ఆ ప్రాంతంలోని ఆస్తి యజమాని సంఘాన్ని ఏర్పాటు చేసారు. అతను అనేక సంవత్సరాలపాటు ఆ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. విలే పార్లే ఇప్పుడు ఉన్న ఆధునిక పాశ్చాత్య ప్రాంతంగా మార్చడానికి అతను శ్రద్ధగా కృషి చేశారు. అతను చేసిన ఆకృషి కారణంగా అతని గౌరవార్ధం అతని ఇంటికి సమీపంలో ఉన్న ఒక నాలుగు రోడ్ల కూడలిని  “పాఖడే చౌక్” గా పిలుస్తారు.

కాకా సాహెబ్ దీక్షిత్ కూడా అదే ప్రాంతంలో అతని పక్కింటిలో నివసించారు మరియు ఇద్దరూ మంచి స్నేహితులు. దీక్షిత్ సాయి బాబా యొక్క గొప్ప భక్తుడు, తరచూ బాబా లీలాల గురించి మాట్లాడుతుండేవారు. ఆనందరావు పాఖడే షిర్డీకి వెళ్ళడంలో దీక్షిత్ దే ముఖ్య పాత్ర.

శ్రీ సాయి సచ్చరిత్రి యొక్క 45 వ అధ్యాయంలో ఆనందరావు పాఖడే గురించి చెప్పబడింది. ఆ కధనం ఒకసారి మననం చేసుకోండి:

కాకాసాహబు సంశయము – ఆనందరావు దృశ్యము

కాకాసాహబుదీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధిచెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు.

ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలోనున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్ హోత్ర, దృమిళ, ఛమస్, మరియు కరభజన్ లు భాగవతధర్మసూత్రములను జనకమహరాజుకు చెప్పుచుండిరి.

జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడగెను. వారొక్కొక్కరు సంతృప్తి కరమైన సమాధానము లిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్ హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి.

వాని సారాంశ మేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామాతో నిట్లనియె. “నవనాథులు భక్తివిషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది? దాని నాచరించుట యెంత కష్టము? నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మ లెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చునెట్లు? కాబట్టి యట్టిదానిని మనమాచరించరాదని తెలియుచున్నది.”

కాకా సాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను. “ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు చిరాకు చెందనేల? నవనాథుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని, ఆందోళనకుగాని యవకాశ మేది?”

కాకాసాహెబు శ్యామా చెప్పిన సమాధానముతో సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.

రేపు తరువాయి బాగం…..

(Source: Shri Sai Satcharitra Chapter 45 and Baba’s Rinanubandh by Vinny Chitluri ; Photograph Courtesy: Shri.Sandeep Suresh Deore, Mumbai)

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles