Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్త బడేబాబా మొదటి బాగం….
(Source: Shri Sai Satcharitra Chapter 23 and Shri Sai Leela Magazine September-October 2008 and November-December 2008)
ముందుగా మనం సాయి సచ్చరిత్రలో బడేబాబా గురించి ఉన్న ఒక కధనాన్ని చదువుదాం. మనకు తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి చదవమని ప్రియ సాయి బంధువులను వేడుకొంటున్నాను. సాయి కధలు అమృతం కన్నా మధురమైనవి ఎన్ని సార్లు చదివినాను తనివితీరదు కదా!
ఒకప్పుడెవరో ఒక కృశించిన ముసలి మేకను మసీదుకు తెచ్చిరి. అది దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తి వ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పెను.
ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివైపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప, సాయిబాబా పీల్చి యితరుల కిచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి యెడమ ప్రక్కన కూర్చుండ బెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు.
దక్షిణ రూపముగా వసూలయిన పైకము నుంచి ఆయనకు దిన మొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడేబాబా పోవునపుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేల యని బడేబాబా నిరాకరించెను.
అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించు కొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను, కాని వాడలో నుండి త్వరగా రాలేదు.
తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను.
అతడు స్వచ్ఛమైన బాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని యందరాశ్చర్యపడుచుండిరి.
అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కత్తిని పైకెత్తి బాబా యాజ్ఞకై యెదురు చూచుచుండెను. బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.” అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ‘ఆగు’ మనెను. “ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవై మేకను చంపెదవా?” యనెను.
బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియె. “నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మా కింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము.”
బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ‘తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.
ఇప్పుడు బాడే బాబా గురించి మరింత సమాచారం శ్రీ సాయి బాబా సంస్థాన్ ద్వారా ప్రచురించబడే సాయి లీలా మ్యాగజైన్ నుండి మీకు తెలియజేస్తున్నాను
శ్రీ సాయి బాబా ద్వారకమాయిలో అనేక భక్తులకు ఆశ్రయం ఇచ్చారు. శ్రీ సాయి బాబా యొక్క దర్బార్ లో అలా ఆశ్రయం పొందిన భక్తులలో బాడే బాబా ఒక ముఖ్యమైన వ్యక్తి.
బాబా ”నీవు ఒకటి ఇచ్చినట్లయితే నేను నీకు వంద ఇస్తాను!’‘ అని చెప్పేవారు. అయితే, దేవుని బహుమతులు ప్రత్యేకమైనవి. అయితే వారి దీవెనలు పొందడానికి భక్తులు అర్హులు మరియు ధర్మపరులుగా ఉండాలి. బడే బాబా జీవితాన్ని గమనించినట్లైతే బాబా అతనిని ఎంతగానో అనుగ్రహించారు, కానీ బాడే బాబాకి బాబా వారి అనుగ్రహాన్ని స్వీకరించేందుకు తగిన ఆధ్యాత్మిక బలం లేదు.
బడే బాబాను మాలేగావ్ కు చెందిన ‘ఫకీర్ పీర్ మహ్మద్’ అని కూడా పిలుస్తారు. వృత్తి ద్వారా అతను ఫకీర్. అందువలన, అతను ఫకీర్ బాబా అనే పేరుతో కూడా పిలువబడ్డారు.
రేపు తరవాయి బాగం…
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్త బడేబాబా రెండవ బాగం….
- సాయి భక్త బడేబాబా నాల్గవ బాగం….
- సాయి భక్త బడేబాబా మూడవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- సాయి భక్త సగుణమేరు నాయక్ – మొదటి బాగం…..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments