Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్త బడేబాబా నాల్గవ బాగం….
(Source: Shri Sai Satcharitra Chapter 23 and Shri Sai Leela Magazine September-October 2008 and November-December 2008)
గ్రామస్తులు బదేబాబాను గ్రామంలోనికి అడుగుపెట్టికుండా నిషేధించారు. అందువల్ల, అతను వెళ్ళి, నీంగావ్ లో నివసించాడు. ఈ సమస్య వలన బాబా ప్రతిరోజూ బడే బాబాను నల్లా ఏటి ఒడ్డున కలుసుకుని అతనికి రోజు తాము ఇచ్చే డబ్బులు అందజేసేవారు. బాబాను చాలా అసౌకర్యానికి గురిచేస్తున్నామని గ్రామస్తులు గ్రహించి, మళ్ళి బడే బాబాను షిర్డీకి రప్పించారు.
బడే బాబా ప్రవర్తన
పైన జరిగిన సంఘటన తరువాత, గ్రామస్తులు బాడే బాబాకు తల వంచారు. ప్రజలు అతని దగ్గరకు చేతులు కట్టుకొని రావడం తో అతని గర్వం మరింత పెరిగేలా చేసింది.
బాబా మాత్రం ఎల్లప్పుడూ బడే బాబాను గౌరవంతో చూచే వారు. అయితే, బడే బాబా తన ఆధిపత్యంతో, వ్యంగ్యత, వంచనలతో ప్రవర్తించడం ప్రారంభించాడు. అతను బాబా యొక్క ఇష్టనికి వ్యతిరేకంగా నడుచుకోనేవాడు.
బడే బాబా మాట్లాడేటప్పుడు, కనీసం బాబా ముందు మాట్లాడేటప్పుడు భాషను జాగ్రత్తగా మరియు మర్యాదగా ఉపయోగించాలని భక్తులు భావించారు. కానీ, అతని పదజాలం అహంకారంతో హద్దులు దాటింది.
ఒకసారి, బాబా యొక్క భక్తుడు శ్రీ రఘువీర్ భాస్కర్ పురందరే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ బాధవలన మొత్తం రాత్రి అతనికి విశ్రాంతి లేదు. అదే స్థితిలో అతను బాబా వద్దకు వెళ్ళారు. బాబాకు సమీపంలోని కూర్చున్న బాడే బాబా బాబాతో కఠినంగా ”పురందరే తీవ్రమైన తలనొప్పితో వచ్చి రాత్రంతా బాధపడ్డాడు. అతన్ని చూడు. అతన్ని ఇంకా చాలా అనారోగ్యవంతుడిని చేయవద్దు” అని చెప్పాడు.
ఇలాంటి మరొక సంఘటన: ఒకసారి, బాబా పురందరే వలన చాలా కలత చెందారు. అందువలన, బాబా పురందరే ప్రత్యేకంగా తీసుకువచ్చిన అందమైన సేన్టేడ్ పూల మొక్కలను నాటడానికి అనుమతించలేదు.
దీనిని గమనించిన బడే బాబా బాబాతో ”నీవు ఎందుకు పురందరేతో చాలా కోపంగా ఉన్నావు? అతను మీ కోసం రాత్రి-పగలు చస్తున్నాడు. నీ సేవలో అతను అన్నపానీయాలు మరచిపోతాడు. మీరు కూడా అతనిని ఎప్పుడు తలచుకుంటూ ఉంటారు. కానీ, అతను నీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు కలత చెందుతున్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ వింత ప్రవర్తన ఏమిటి?” అన్నారు.
ప్రతిరోజూ తన భోజనమైన తరువాత బడే బాబా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా అతనితో కొంత దూరం నడిచి వెళ్లి సాగనంపేవారు. అతనిలో గర్వం పెరిగిన తరువాత, బడే బాబా ‘అచ్చా. నేను ఇప్పుడు వెళ్తున్నాను. మీరు రాబోతున్నారా లేదా?” అని గట్టిగా అనేవాడు. బాబా ఈ మాటలలో ఎటువంటి తప్పు పట్టేవారు కాదు. కానీ నిశ్శబ్దంగా లేచి అతనిని చూసేవారు.
ప్రారంభ కాలంలో, భక్తులు ఆరతికి సన్నాహాలు చేసేటప్పుడు, బాడే బాబా లేచి క్రింద సభా మండపంలోకి వెళ్ళిపోయేవాడు. ఆయన అరతిలో పాల్గొనేవాడు కాదు.
తరువాత, కాకాసాహెబ్ దీక్షిత్ ఒప్పించారు. అప్పటినుండి అతను సభ మండపానికి వెళ్ళేవాడు కాదు గాని ఆరతికి హాజరు అయ్యేవాడు కాదు. చాలామంది హిందూ భక్తులు దీనిని ఇష్టపడలేదు.
అయినప్పటికీ, కాకసాహెబ్ తన ప్రేమగల స్వభావం తో హిందూ భక్తులను బడే బాబా యొక్క ప్రవర్తనను పట్టించుకోవద్దని ఒప్పించగలిగారు. అతను ‘సాయిబాబా బడే బాబాని తన వానిగా అంగీకరించారు. అందువలన, అతను మనలో ఒకడు. అందువలన వివక్షత యొక్క ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని చెప్పారు.’
బడే బాబా యొక్క పెరిగిన అహం ఇతర భక్తులకు ఒక విసుగుగా మారింది. వారు అతన్ని అసహ్యించుకొనేరు. అందువల్ల వారు బాడే బాబా నివసించడానికి వారి గదులను కూడా అనుమతించలేదు.
అంతిమంగా, కాకాసాహెబ్ అతని కాపాడటానికి వచ్చి తన వాడలో గదులలో ఒకదానిలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. కాబాసాహెబ్ “బాబా చేత అంగీకరించబడిన ప్రతి వారిని మనం మనలో ఒకరిగా చూడాలి” అని చెప్పేవారు.
సన్యాసులతో సమయాన్ని గడపగలిగే వారు మాత్రమే అదృష్టవంతుడు. కానీ, వారు అహంను అధిగమించడానికి ప్రయత్నించాలి.
బాబా బడే బాబాని తన ప్రియమైన వారిలో ఒకరిగా చూశాడు. అతిథులు మరియు స్నేహితులకి ఇచ్చే గౌరవాన్ని అతను పొందాడు. బడే బాబా కోసం ప్రక్కనే ఉన్న స్థానాన్ని ఎల్లప్పుడూ బాబా ఉంచారు. చాలా పెద్ద మొత్తం రోజు అతనికి దానం చేయబడింది.
బడే బాబా యొక్క ఆత్మోన్నతి కోసం అనేక అవకాశాలు బాబా ఇచ్చారు. కానీ, బాడే బాబా తన అహం కారణంగా అన్ని అవకాశాలను వృధా చేసుకున్నాడు.
డబ్బు ఇచ్చేటప్పుడు, బాబా ఎప్పుడూ హెచ్చరించారు, ” ఈ డబ్బు అల్లాహ్ కి చెందినది. తిను, వృధా చేయవద్దు”. సాయి బాబా ఇచ్చిన డబ్బు స్వీయ-ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు. ఇతరుల మెరుగ్గా ఉండటానికి దానిని వాడుకున్నవారు మెరుగయ్యారు.
అయితే, బాడే బాబా బాబా ఇచ్చిన ధనాన్ని తన కుటుంబము కోసం ఉపయోగించారు. బాబా సమాధి చెందిన రెండు నెలల తరువాత, బాడే బాబాకు ధనం లేకుండా పోయింది. దానితో అతను గ్రామానికి గ్రామానికి యాచించడం కోసం వెళ్ళవలసి వచ్చింది. చివరికి జనవరి 1926లో నాగపూర్ లో ఆయన మరణించారు.
బాబా బడే బాబా ద్వారా ఇతర భక్తులు పాఠాన్ని నేర్చుకోవాలని అతనిని ఒక బోధన మాధ్యమంగా ఉపయోగించినట్టు కనిపిస్తుంది.
అప్పటి శ్రీ సాయి లీలా మేగజైన్ యొక్క సంపాదకుడు శ్రీ కాకాసాహెబ్ మహాజని తన వ్యాసంలో – “మహారాజు బోధనలకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలిగి ఉన్నారు. అటువంటి పద్దతిలో ఫకీర్ బాబా(బడే బాబా) యొక్క షిర్డీ నివాసం మరియు అతనితో బాబా యొక్క ప్రవర్తన. ఈ ఉదాహరణ నుండి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు.” అని వ్రాసారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్త బడేబాబా మొదటి బాగం….
- సాయి భక్త బడేబాబా మూడవ బాగం….
- సాయి భక్త బడేబాబా రెండవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments