Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
కొంతమంది సాయి భక్తులు వారి మొత్తం జీవితము భక్తితో బాబాకు సమర్పించుకున్నారు. అటువంటి వారిలో ముక్తారమ్ ఒకరు. అతను మొదట ఖందేశ్ కు చెందినవాడు. అతని ఇల్లు రావెర్ నుండి సుమారు ఒకటిన్నర మైళ్ళు ఉండేది.
అతను మొదట 1910-11వ సంవత్సరంలో షిర్డీకి వచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత, అతను తన సొంత భూమిని, అతని ఇల్లు, తల్లి, భార్య మరియు పిల్లలు (సర్వ-సంగ్-ప్యాలియాగ్) అందరిని విడిచిపెట్టి, శాశ్వతంగా బాబా సన్నిదిలో గడపాలని షిర్డీకి వచ్చేసారు. బాబా అతనికి ముక్తారం అనే పేరు పెట్టారు.
ఆ సమయంలో, షిర్డీలో మరొక సాయి భక్తుడు పూర్తీ విరక్తి మార్గంలో నడిచేవాడు. అతని పేరు బలరామ్ అలియాస్ బాలక్రం మన్కర్. బలరాం సహచర్యంలో ముక్తారాం తన సమయాన్ని గడిపేవారు.
బాబా ఈ ఇద్దరి ఆధ్యాత్మిక (ఆధ్యాత్మిక) పురోగతికి మార్గదర్శకత్వం చేస్తూ, కేవలం షిర్డీలో ఈ ఇద్దరుని కూర్చుని ఉంచకుండా వివిధ ప్రాంతాలకు పంపుతుండేవారు. కానీ షిర్డీ వారి ప్రయాణానికి ప్రధాన కేంద్రంగా ఉండేది.
ఎప్పటికప్పుడు వారు షిర్డీకి తిరిగి వస్తూ ఉండేవారు. అలా వారిని షిర్డీకి తిరిగి రప్పించడంలో, తాము వారికి ఆత్మాత్మిక మార్గదర్శకత్వం ఇవ్వడం మరియు వారు ఆత్మ వికాసం (స్వీయ-అభివృద్ధి) సాధించాలనేది బాబా వారి ఉద్దేశ్యం.
1914-15 నుండి, ముక్తారమ్ శాశ్వతంగా తన నివాసాన్ని షిర్డీకి తరలించారు. అతను సమయం అంతా బాబా చెంతనే గడిపేవాడు. అతను మసీదులో ధూని దగ్గర కూర్చునేవాడు.
ఉదయానే ద్వారకమాయి చేరుకొని మధ్యాహ్నం ఆరతి వరకూ అక్కడే గడిపేవాడు. అతను బాబాతో కలిసి తన అల్పాహారం మరియు భోజనం తీసుకొనేవాడు. బాబా అతనికి ఇచ్చిన ఆహారంతోనే అతను జీవనం సాగించేవాడు.
భోజనానంతరం బాబా ఆదేశానుసారం దీక్షిత్ వాడకు ప్రక్కన ఉన్న ఒక చిన్న రేకుల షెడ్ కు వెళ్ళేవాడు. అక్కడ అతను ఒక ధూని ఏర్పాటు చేశాడు. బాబా యొక్క సూచనల ప్రకారం, బాబా అతనిని బయటకు రావాలని చెప్పేంతవరకు అతను ఈ ధూనికి సమీపంలోనే కూర్చొని ఉండేవాడు.
వేసవికాలం వేడిలో కూడా, అతను ఆ చిన్న షెడ్ లో ధూని వద్ద గంటలు పాటు కూర్చుని ఉండేవాడు. అది చూసి అతని చుట్టూ ఉన్న ప్రజలు ఆయన ఆ వేడిని ఎలా తట్టుకోగలుగుతున్నాడో అని ఆశ్చర్యపడేవారు.
దానికి కారణం నిశ్చలమైన భక్తి నుండి అతను పొందిన ఆధ్యాత్మిక శక్తి. ముక్తారమ్ తన అంతరంగ మరియు బహ్యరంగ శక్తులను ఆధ్యాత్మిక మార్గములో మళ్ళించారు. జీవితంలో అతని ఏకైక లక్ష్యం సద్గురు చూపించిన విధంగా జీవించడమే.
రేపు తరువాయి బాగం….
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్త ముక్తారాం – మూడవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – రెండవ బాగం….
- సాయి భక్త ఆనందరావు పాఖడే మొదటి బాగం…..
- సాయి భక్త సగుణమేరు నాయక్ – మొదటి బాగం…..
- సాయి భక్త బడేబాబా మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments