సాయి భక్త ముక్తారాం – మూడవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్త ముక్తారాం – మూడవ బాగం….

బాబా అతనికి కఫ్ని మరియు  తన తల చుట్టూ కట్టే ఒక వస్త్రం ఇచ్చారు. అదే అతని రోజువారీ వస్త్రధారణ. తన జీవన విధానంలో, ప్రసంగం మరియు హావభావాలలో బాబాతో పోలికలు ఉండేవి. అయితే కొంతమంది బాబాను అతడు అనుకరించాలని ప్రయత్నం చేస్తున్నాడని భావించారు, అందువల్ల ముక్తారాం పట్ల వారికీ ఉండే గౌరవం క్రమంగా అతని పై అపార్థం మరియు ద్వేషముగా మారాయి. ముక్తారాం గురించి ప్రచారం చేయబడిన కొన్ని కథనాల్లో అలాగే ఈ కథలు వ్యక్తీకరణను పొందాయి.

అటువంటి ఒక కధనం మనకు ఓవి టూ ఓవి సాయి సచ్చరిత్రలో ఈ క్రింది విధంగా ఉంది.

శ్రీ సాయినాధులు సమాధి చెందిన కొన్ని రోజుల తరువాత, ఈ గృహస్తుడు అక్కడి ప్రజలతో శ్రీ సాయి బాబా తమ ద్వారకామాయి లోని తమ స్థలంలో నన్నే కూర్చోమని అజ్ఞాపించారు, నేనే వారి వారసుణ్ణి అని చెప్పి, తాత్యా పాటీల్, శ్రీ రామచంద్ర పాటీల్ మొదలగు గ్రామస్తులు ఎంతగా అలా చేయవద్దని చెప్పినప్పటికీ ఎవరి మాట వినకుండా వారిని విదిలించుకుని అతడు వెళ్లి ద్వారకామయిలో బాబా వారి యొక్క గద్దెపై కూర్చున్నాడు.

కాసేపటికి అతనికి క్రింద నుండి సూదులు గ్రుచ్చుకొని రక్తం కారసాగింది. అతనిని అతని నివాసం అయిన దీక్షిత్ వాడకి తీసుకువెళ్లారు. చివరకి 7 – 8 రోజుల్లోనే భయంకరమైన స్టితిలో అతడు శ్రీ సాయిని క్షమా బిక్ష వేడుకుని ప్రాణం విడిచారు.

ఇట్లే అధికారాన్ని చాటు కొనేవారు మరో ముగ్గురు నలుగురు గ్రహస్తులు ముక్తారాం కి జరిగినది చూచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇలా ఎవరైనా తాను ఏదో గొప్ప మహారాజు అనుకోని పెత్తనం చలాయించబోతే నా సమానంగా ప్రవర్తించాలని చూస్తావా? అని శ్రీ సాయి తగిన శాస్తి చేసేవారు.

అయినా ఈనాడు కొందరు శ్రీ సాయియే నాలో అవతరించారు అని ప్రజలను మోసపుచ్చి తమ పాదాలపై పడేలా చేసుకుంటున్నారు. సద్గురువుతో సమానంగా ఉండాలన్న సాహసం చేసిన వారి పరిస్థితి చివరికి ఏమౌతుందో అని తెలియడానికి ముక్తారాం కి జరిగిన సంఘటనే ఉదాహరణ.

ఈ విధమైన కధనం చదివన తర్వాత ముక్తారాం పై ఎవరికైన చెడు అభిప్రాయములు రావడం సహజం. ఈ కధనం ముందుగా H. V. సాఠె అధ్యక్షతన నడుపబడే దక్షిణ బిక్ష సంస్థ ద్వారా వెలువడే సాయినాధ ప్రభ అనే పత్రికలో ముద్రించబడింది.

కానీ ఈ కధనం చదివిన తరువాత ముక్తారాం వంటి గొప్ప భక్తుడు పై ఇటువంటి అపవాదు రావడం తట్టుకోలేక ఈ కధనంలోని వాస్తవికత గురించి నాటి ఒక సాయి భక్తుడు సాయినాధ ప్రభ మ్యాగజైన్ వారికీ మిత్ర అనే పెన్ నేమ్ తో ఒక లేఖ వ్రాసారు.

దాని సారాంశం: ముక్తారాం అనే భక్తుడి మరణంకు సంబంధించి ప్రచురించిన కథ వాస్తవం కాదు. … శ్రీ సాయి సమాధికి  మూడు నెలల ముందు నుండే ముక్తారమ్ జ్వరం మరియు దగ్గుతో బాధపడుతూ, అనారోగ్యముతో తన గదిలోనే ఉంటుండేవాడు.

శ్రీ సాయి సమాధి చెందిన 8-9 రోజుల తర్వాత మసీదుకు వెళ్ళాడు. కానీ 24 గంటల కంటే తక్కువ సమయంలో తన గదికి తిరిగి వచ్చాడు. అతను బాబా గద్దె మీద కూర్చో లేదు.  అతను మధ్యలో ఒక స్తంభానికి సమీపంలో ఒక గోనెపై కూర్చున్నాడు.

అప్పుడు బాబా గద్దెపై కుర్చోవలెనని ముక్తారాం ప్రణాళిక చేస్తున్నడని చాలామంది భావించారు. (పై కధనం రచించిన రచయిత అలాంటి వ్యక్తులలో ఒకరు.) ముక్తారాం త్వరలో తన గదిలోకి తిరిగివచ్చినప్పుడు, అన్ని సందేహాలు తీరిపోయాయి.

ముక్తారాం తన గదికి తిరిగి వచ్చిన తరువాత, నేను అతనిని ‘మీరు ఎందుకు మశీదుకు వెళ్లి, మళ్ళి  మీరు ఎందుకు త్వరగా తిరిగి వచ్చారు?’ అని ప్రశ్నించారు.

దానికి అతను  ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. అందువల్ల చాలా భాదపడుతూ ఉన్నాను. నేను మసీదుకు వెళ్లి కూర్చుని శ్రీ సాయిని ప్రార్థిస్తే, నేను కొంత ఉపశమనం పొందుతాను. అందువలనే వెళ్ళాను. కానీ ఎక్కువ సమయం నేను కూర్చోవడం సాధ్యపడదు ఎందుకంటే నా జబ్బు కారణంగా ఎక్కువగా కపం బయటకు ఉమ్మి వేయవలిసి వస్తుంది. అందువలన నేను తిరిగి నా గదికి వచ్చేసాను” అని చెప్పారు.

తరువాత, అక్టోబర్ నెల నుండి, అతని ఆరోగ్యం వేగంగా క్షీణించింది మరియు రెండున్నర నెలల తరువాత అతను జనవరి 1919 లో TB తో మరణించారు.

ఈ లెటర్ తోపాటు ముందు ముక్తారాం గురించి వచ్చిన కధనానికి తగిన సవరణ సాయినాధ ప్రభ పత్రికలో ఆ కాలంలోనే ఇచ్చారు.

ఆ తర్వాత సాయి లీల మ్యాగజైన్ లో కూడా ఈ లెటర్ తో పాటు క్రింది వివరణ ఇచ్చారు.

ముక్తారాం మరణ విషయంలో పై లెటర్ వ్రాసిన వ్యక్తే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే అతడు ముక్తారాం ద్వారకామాయి నుండి తన రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇతడు ప్రత్యక్షంగా అతనితో మాట్లాడారు. సచ్చరిత్రలో కధనం నిజమైతే ముక్తారాం మరణం అక్టోబర్ లో] 1918 అయ్యిండాలి, కాని ముక్తారాం జనవరి 1919 లో మరణించిన సంగతి వాస్తవం.

శ్రీ ముక్తారాం బాబా యొక్క గొప్ప భక్తుడు. అతను తన జీవితాన్ని బాబా పాదాలకు సమర్పించుకున్నాడు. చివరికి అయన తుది శ్వాస పవిత్రమైన బాబా సన్నిదిలో విడిచి బాబా లో ఐక్యమైపోయారు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles