Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్త బడేబాబా మూడవ బాగం….
(Source: Shri Sai Satcharitra Chapter 23 and Shri Sai Leela Magazine September-October 2008 and November-December 2008)
దేవుడు అంతట కలడు
బాబా వంటి యోగుల దృష్టిలో, ఈ ప్రపంచములో దేని యందు భేద బావం ఉండదు. వారు అంతటిని ఒకటిగా చూస్తారు. వారి ప్రతి చర్య సందేశాన్ని ఇస్తుంది. మనం వాటిని అర్థం చేసుకోని అనుసరించాలి.
ఒకసారి, బాబా తన భోజనం చేస్తున్నారు. ఒక మట్టి కుండలో మజ్జిగ ఉంది. అకస్మాత్తుగా ఒక కుక్క మసీదులో ప్రవేశించి దానిని రుచి చూసింది. సమీపంలో కూర్చుని ఉన్న బడే బాబా ఒక పిల్లవాడితో ఆ మజ్జిగను బయట పారవేయమని చెప్పారు.
బాబా ఏమి జరిగింది అని ప్రశ్నించారు. బాడే బాబా వివరించిన తరువాత, బాబా “ఆ మజ్జిగలో ఏ దోషం లేదు అది మంచిదే. దానిని ఇంటికి తీసుకువెళ్ళి, దానితో మజ్జిగ పులుసు చేసి తీసుకురమ్మని” అన్నారు. బడే బాబా మజ్జిగ పులుసుని సిద్ధం చేసి, దానిని తీసుకువచ్చారు గాని దానిని తాకనైన తాకలేదు. కానీ బాబా అది పూర్తిగా హృదయపూర్వకంగా త్రాగరు.
యోగులు మరియు సాయి బాబా వంటి సద్గురువులు వారి భక్తుల మనస్సులలో నుండి సంకల్ప మరియు వికల్ప (ఆలోచనలు) నిర్మూలిస్తారు. పై సంఘటన ద్వారా బడే బాబా యొక్క మనస్సు నుండి అటువంటి ఆలోచనలను అరికట్టడానికి బాబా యొక్క ప్రయత్నం. అతను బాబాతో ఎన్నో రోజులుగా ఉంటున్నాడు. అయినప్పటికీ, అతను బాబా సందేశాన్ని గ్రహించలేకపోయాడు.
బాబా తన భక్తులను తెచ్చిన ప్రసాదల నుండి కనీసం కొంత భాగాన్నైన ప్రేమతో తీసుకొనేవారు. ఆయన మాంసాహార వంటకాలను కూడా తినేవారు. ఆయన దృష్టిలో అంత పరబ్రహ్మ స్వరూపమే.
ఆయన మతాల మరియు కులాల మధ్య భేదం చూపలేదు. ఇతరులను తాకడం ద్వారా అపవిత్రం అయిపోతాము వంటి వాటికి విలువ ఇచ్చేవారు కాదు. అదే సమయంలో, ఆయన భక్తులు తమ తమ మతాలకు కట్టుబడి ఉండాలని చెప్పేవారు.
మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రంగా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు ఒక్కడే! సందర్భానుసారం గా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవాడు.
అన్ని మతాలు ఆ భగవంతుడిని చేరడానికే పుట్టాయి. సర్వ మానవ సమానత్వాన్ని ఉద్భోదించే శ్రీ సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చేప్పేవారు.
శ్రీ సాయికి భక్తుడైన బడే బాబా ఒక హిందువును ముస్లిం గా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించారు. అప్పుడు శ్రీ సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి ” నీ తండ్రిని మార్చుకున్నావట్రా ! ” అని అరిచారు. మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా వారి అభిప్రాయం.
బాబా ఇస్లాం యొక్క కొన్ని తీవ్రమైన ఆచారాలతో ఏకీభవించలేదు మరియు వారిని అనుసరించడానికి నిరాకరించారు. ఒకసారి, ఆయన తన ముస్లిం భక్తులతో షిర్డీ పట్టణ సరిహద్దు వెలుపల వెళ్లి తన ఖుత్బా ప్రార్ధనను చేయమని చెప్పారు. ఆయన స్వయంగా ప్రార్థనలో పాల్గొనలేదు. ఇంకో సందర్భంలో మసీదులో నమజ్ చేయమని ఆయన వారికి అనుమతి ఇచ్చారు. కానీ తాను పాల్గొనలేదు.
గరిష్ట మొత్తాన్ని పొందే గౌరవం
ప్రతిరోజూ, భక్తులు బాబా కు ఇచ్చే దక్షిణ రూ .400 నుండి రూ .500 ఉండేది. ఆ మొత్తాన్నిబాబా భక్తులకు పంచేసేవారు. సాయంత్రానికల్లా ఆయన జేబులు ఖాలీగా ఉండేవి. ఆయన లెక్కపెట్టకుండా జేబులో చేయిపెట్టి చేతికోచ్చినంత ఇచ్చి వేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది.
ఇలా నిత్యం దాదా కేల్కర్, బడే బాబా, సుందర్బాయి, లక్ష్మిబాయి, తాత్యా పాటిల్ భాగోజీ మొదలైన భక్తులకు ప్రతిరోజూ బాబా కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. అయితే, గరిష్ట మొత్తాన్ని పొందే గౌరవం (రూ. 30 నుండి రూ. 55) బడే బాబాకు దక్కింది. (పవిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ప్రకారం బడే బాబా కి 50 రూపాయలు ముట్టేది).
‘బాబా నుండి అంత పెద్ద మొత్తం బడే బాబా లాంటి ఫకీర్ పొంది ఏమి చేసుకుంటాడు’ అనే ప్రశ్న షిర్డీ నివాసితుల మనసుల్లో మొదలైంది. అందువల్ల వారు గ్రామానికి ప్రధాన ప్రవేశద్వారం నిర్మాణం కోసం బడే బాబాను డబ్బులు ఇమ్మని అభ్యర్థించారు. అయితే, బడే బాబా వారి అభ్యర్థనను అంగీకరించలేదు.
అందువల్ల, గ్రామస్తులు అతనిని గ్రామంలోనికి అడుగుపెట్టికుండా నిషేధించారు. అందువల్ల, అతను వెళ్ళి, నీంగావ్ లో నివసించాడు. ఈ సమస్య వలన బాబా ప్రతిరోజూ బడే బాబాను నల్లా ఏటి ఒడ్డున కలుసుకుని అతనికి రోజు తాము ఇచ్చే డబ్బులు అందజేసేవారు. బాబాను చాలా అసౌకర్యానికి గురిచేస్తున్నామని గ్రామస్తులు గ్రహించి, మళ్ళి బడే బాబాను షిర్డీకి రప్పించారు.
రేపు తరువాయి బాగం…..
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్త బడేబాబా రెండవ బాగం….
- సాయి భక్త బడేబాబా మొదటి బాగం….
- సాయి భక్త బడేబాబా నాల్గవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – మూడవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments