సాయి భక్త బడేబాబా రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్త బడేబాబా రెండవ బాగం….

(Source: Shri Sai Satcharitra Chapter 23 and Shri Sai Leela Magazine September-October 2008 and November-December 2008)  

బడే బాబా మొట్టమొదట 1909 లో షిర్డీలో వచ్చి అప్పటినుండి షిర్డీలో శాశ్వతంగా నివసించారు. ప్రారంభంలో, అతను చావాడీలో నివసిస్తూ ఉండేవాడు. అతను ద్వారకమాయి లో ప్రవేశించటానికి సాయి బాబా అనుమతి లభించలేదు.

బాబాతో చనువుగా ఉండే మహాల్సాపతి వంటి భక్తులు ద్వారకమాయిలో ప్రవేశించడానికి బడే బాబాను అనుమతించమని ఆయనను అభ్యర్థించారు. ఏదేమైనా, బాబా అనుమతించక అతనిని చావడిలో కూర్చుని ఖురాన్ చదవమని చెప్పారు.

బాబా తన భక్తుల కొంతమంది యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం అలాంటి వింతైన మార్గాలను అనుసరించేవారు.

కొన్ని నెలలు గడిచిన తరువాత, బాబా ద్వారకమాయిలో ప్రవేశించడానికి బడే బాబాను అనుమతించారు. తర్వాత షిర్డీలో ప్రముఖ వ్యక్తిగా అయ్యారు. దీనికి కారణం కూడా ప్రత్యేకమైనది.

అతిధి దేవోభవ

సాయి బాబా బడే బాబాను అతి గారభంగా చూసుకునేవారు. బాబా ఆయనను చాలా ప్రేమగా ‘బడేమియ’ అని పిలిచేవారు. మరియు అతన్ని అతిథిగా గౌరవించేవారు. బాబా యొక్క దర్బార్ లో, అతనికి అతిథిగా చాలా గౌరవం ఇవ్వబడేది.

అతడు మసీదులో బాబా యొక్క కుడి వైపున కూర్చునేవారు. ఉదయం అల్పాహారం నుండి మధ్యాహ్నం భోజనం వరకు బడే బాబా మసీదులో ఉండేవారు. సాయి బాబా అతనిని తమ దగ్గరి కూర్చుండబెట్టుకొని తమ చేతులతో ఆహారాన్ని వడ్డించేవారు.

భక్తులు బాబా ముందు భోజన పదార్ధాలు సమర్పించేవారు. ఆయన  ఆ భోజన పదార్ధాలు నుండి మొదట కొంత భాగాన్ని తీసుకొని  బడే బాబాకు ఇచ్చేవారు. తరువాత మిగిలిన భక్తులకు పంపిణీ చేసేవారు.

భోజనం సమయంలో, బడే బాబా మొదట ఆహారాన్ని కొంత భాగాన్ని తీసుకోకపోతే, బాబా తన భోజనం ప్రారంభించేవారు కాదు. అయితే, దురదృష్టవశాత్తూ, బడే బాబాకు బాబా ఇచ్చిన ప్రాముఖ్యత కారణంగా అతనిలో అహం వచ్చింది. అందువల్ల ఇతర భక్తులు బడే బాబా ప్రవర్తనను ఇష్టపడలేదు.

రోజు భోజనానికి ముందు, బడే బాబా వచ్చి దిగువ సభ మండపము లో కూర్చునేవారు. బాబా  ‘బడే మియా’ అని పిలవగానే, అతడు మశీదు మెట్లెక్కి బాబా యొక్క కుడి వైపున తనకోసం ఉంచిన భోజన పళ్ళెం ముందు కూర్చునేవారు.

ఒక దీపావళి పండుగ రోజు బడే బాబా యొక్క మానసిక స్థితి కొన్ని కారణాల వల్ల నిరాశకు గురయింది. అందువలన ఆయన సభ మండపానికి రాలేదు. ఆ రోజు, అనేక మంది భక్తులు రకరకాల స్వీట్ లు, ఇతర వంటకాలు తీసుకోని వచ్చారు.

ఆహారాన్ని వడ్డించిన తరువాత, బాబా బడే బాబాను పిలిచారు. కానీ, అతను ఎక్కడా కనిపించలేదు. బడే బాబా లేకపోవడంతో, బాబా తన భోజనం ప్రారంభించటానికి నిరాకరించారు. అందువలన అందరూ వేచి ఉన్నారు.

అంతిమంగా, ఒక భక్తుడు బడే బాబా ఎక్కడ ఉన్నాడో పట్టుకొని మశీద్ కు తీసుకోని వచ్చి, బాబా యొక్క కుడి వైపున అతని స్థానంలో అతనిని కూర్చుండబెట్టారు. అప్పుడు భోజనం మొదలైంది. ఆహారాన్ని అవమానించిన వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుందని విడ్డురంగా కనిపించవచ్చు. కానీ, బాబా తన భక్తులను చేరదీసే మార్గాలు ప్రత్యకమైనవి.

తరువాతి సంవత్సరాల్లో, ప్రతిరోజూ 100-125 వంటకాలు షిర్డి మరియు ఇతర ప్రాంతాల నుండి భక్తులు తీసుకువచ్చేవారు. కొన్ని రోజులు, బాబా బడేబాబా ను చపాతీలు మరియు భకారి ముక్కలు చేసి వాటిని కలపమని ఆదేశించేవారు. అలా చేసిన దానిని బాబా ప్రసాదంగా భక్తులకు ఇచ్చేవారు. అది ఎంతో మధురంగా రుచికరంగా ఉండేది. భక్తులు ఎంతో ఇష్టంగా తినేవారు.

కొన్ని సందర్భాలలో,  బాబా భక్తులను తిట్టి ‘బడే బాబా చేత ముట్టబడిన ఈ ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు? అతడు ముస్లిం కదా!’ అని అనేవారు. అప్పుడు భక్తులు ”బాబా ఈ స్థలం మరుయు ఈ ఆహారం సర్వశక్తిమంతుడైన దేవుడుకి చెందినవి” అని చెప్పేవారు. దీనికి బాబా ‘ అవును. ఈ స్థలం మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచమంతా అతనికి చెందినది. అందువల్ల, మీరు ఎప్పుడు వివిధ మతాలు మరియు కులాలను భిన్నంగా చూడరాదు” అని చెప్పేవారు.

రేపు తరువాయి బాగం….

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles