సాయి భక్త ముక్తారాం – రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్త ముక్తారాం – రెండవ బాగం….

1)ఎప్పుడు అన్నాసాహెబ్ దభోల్కర్ (శ్రీ సాయి సచ్చరిట్ రచయిత) షిర్డీ సందర్శించిన, అతను దీక్షిత్ వాడ యొక్క పై అంతస్తులోనే ఉండేవారు. అతని పరుపు ఒక కిటికీ క్రింద ఉంచబడేది.

ఒకసారి, ఒక పాము కిటికీ రంధ్రం నుండి వచ్చి దభోల్కర్ యొక్క పరుపులో ప్రవేశించింది. పామును చంపడానికి అందరూ కర్రలు సేకరించారు. ఒక వ్యక్తి దానిని చంపబొయారు; కానీ అది తప్పించుకోని వచ్చిన దారినే వెళ్ళిపోయింది.

అప్పుడు అక్కడ ఉన్న ముక్తారమ్ మాట్లాడుతూ, “మంచియే జరిగినదని, క్రూర జంతువులను చంపవలిసిన పనిలేదని” అనెను. కానీ హేమడ్ పంత్ ఒప్పుకొనక పామును చంపుటే మంచిదనెను. అలా ఆ చర్చ చాలాసేపు జరిగెను. కాని వారి చర్చ సంపూర్తి కాకుండా ఆ రోజుకు ముగేసెను.

తదుపరి రోజు బాబా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారు – “నిన్న ఏం జరిగింది?” అని బాబా అడుగగా దభోల్కర్ జరిగినదంతా చెప్పెను. అప్పుడు బాబాఅన్ని జీవుల యందు భగవంతుడు కలడు. సకల జీవులను నడిపించువాడు అతడే.

అవి పాములుకాని, తేళ్ళు కాని మరి ఏవియైన భగవంతుని ఆజ్ఞను శిరసావహించి నడుచును. భగవంతుని ఆజ్ఞ ఐయిన తరువాతనే ఎవరికైన ఏమైనా చేయును. అతని అజ్ఞాలేనిది ఏమియు జరగదు. ఎవరును స్వతంత్రులు కారు.

ప్రపంచమంతయు అయన ఆజ్ఞపై ఆధారపడి యున్నది. అందుచే వాటికీ ఏ హాని కలుగజేయక ఓపికతో యుండవలెను. జీవులన్నింటిని ప్రేమించు చుండవలెను. దైవమొక్కడే అందరిని రక్షించువాడు” అని వారి సందేహం తిర్చిరి.

ముక్తారాం స్వభావం ఇతరుల నుండి ఎలా భిన్నమైనది అని ఈ సంఘటన వివరిస్తుంది.

2) 1915వ సంవత్సరంలో బాబా ముక్తారాం యొక్క స్వగ్రామమైన రావేర్ లోని అతని ఇంటిలో వున్న తమ పోటోను హార్దా లోని సాధుభయ్యా నాయక్ కు అందజేయమని ముక్తారాం, బాలక్ రాం లను పంపించారు. ఈ విషయం కాకసాహేబ్ దీక్షిత్ సాధుభయ్యా కు ఉత్తరం ద్వారా తెలియజేసారు.

అదే సమయంలో హర్దా నివాసి గౌరవ మేజిస్ట్రేట్ అయిన చోటుబాయి పర్లుకర్ కి కలలో బాబా కనిపించి , “నేను సాధుభయ్యా ఇంటికి వస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చి నా దర్శనం చేసుకో” అని చెప్పారు.

కాకాసాహెబ్ ఉత్తరము ద్వారా విషయం తెలుసుకొని, సాదుభయ్యా వేరే ఎవరినీ స్టేషన్ కి పంపకుండా తానే స్వయంగా వెళ్లారు. అతను రైలు కంపార్ట్మెంట్ లో బలరాం మరియు ముక్తారాం మద్య బాబా ఫోటో పెట్టుకొని కూర్చొని ఉండటం గమనించి కంపార్ట్మెంట్ లోనికి వెళ్లి ముందుగ బాబా యొక్క ఫోటో ముందు సాష్టాంగ నమష్కారం చేసి, బలరామ్ మరియు ముక్తారాం లను పలకరించి, తన ఇంటికి తీసుకువెళ్ళాడు.

అది ఫిబ్రవరి 8వ తేది దాసనవమి రోజు. చాలామంది ప్రజలు వారిని ఆహ్వానించడానికి వచ్చారు. గొప్ప అభిమానంతో, సాయంత్రం ఆరతి జరిపారు. మరుసటి రోజు గురువారం. బలరాం మరియు ముక్తారమ్ మార్గదర్శకత్వంలో ఈ ఫోటోకి రుద్రాభిషేక పూజ జరిగింది. ఆ తరువాత ఫోటో సింహాసనంపై ఉంచి, హారతి మరియు మంత్ర పుష్పాంజలి చేసారు.

పూజలు చేసిన తరువాత, ముక్తారాం జండాలు కట్టుటకు ఇంటి పైకి ఎక్కినాడు. అదే కట్టే పని పూర్తీ కాకముందే అతని చెయ్యి నొప్పి పుట్టింది. అదే సమయంలో షిర్డి మశిదులో ఉన్న బాబా తన చేతికి మాలిష్ చేయమని “పేదలకు దేవుడే దిక్కు, వారికీ అతనిని మించి ఎవరు లేరు” అన్నారు.

బాబా అలా అక్కడ చేయడంతో ఇక్కడ ముక్తారాం ఏ బాధ లేకుండా జెండా జయప్రదంగా ఎగురవేశాడు. బాబా తన భక్తుడు ఎక్కడ ఉన్న ఇలానే అదుకోనుచు ఉంటారు.

ఇక్కడ బాబా యొక్క ఫోటో సాదుభయ్యా ఇంటిలో స్తాపించబడింది మరియు అదే రాత్రి జలగావ్ లో ఉన్న సాదుభయ్యా భార్య, అలాగే అతని కజీన్ సోదరుడుకి రెండు కలలు వచ్చాయి. అతని భార్యకు కలలో మాధవరావు దేశ్పాండే ఒక కొబ్బరి, జాకెట్టు ముక్క మరియు పసుపు-కుంకుం ఇచ్చి “బాబా మీకు వీటిని పంపారు” అన్నారు.

సాదుభయ్యా కజీన్ సోదరుడు శ్రీ నారాయణ్ దాదాజీ బాబా ఎదుట నిలబడి ఉన్నట్లు కల కన్నారు. ఆ కలలో బాబా “మేము హర్దాకు వెళతాము. నీవు కూడా మాతో రా!” అని చెప్పారు. ఆ తరువాత వారిద్దరూ గోదావరి నది ఒడ్డున నిలబడి ఉన్నారు. అప్పుడు నది మాములు కంటే ఎక్కువ నీటి ప్రవాహంతో ఉంది. వారు ఎక్కడ నిలబడి ఉన్నారో అచ్చటికి  సమీపంలో రెండు గోనె సంచుల గోధుమలు ఉన్నాయి.

బాబా నారాయణరావును “ఇప్పుడు ఎలా నదిని దాటబోతున్నాం?” అని అడిగారు. కానీ, హఠాత్తుగా, 10 ఎద్దులు బరువులను మోసుకేల్తూ కనిపించాయి. మరియు బాగా నిర్మించిన రహదారి కూడా కనిపించింది. ఎద్దులు మరియు బాబా నారాయణరావు తోపాటు హార్దాలో తన ఇంటి నుండి సాధుభయ్యా (జెండా కట్టబడిన) ఇంటి వరకు  వచ్చి అకస్మాత్తుగా కనిపించకుండా మాయం అయిపోయారు.

ఆ విధంగా బాబా హర్దాలో తమ సంస్తానాన్ని స్థాపించారు మరియు ఈ ప్రయోజనం కోసం ముక్తారామ్ ను మాధ్యమంగా ఉపయోగించాడు.

రేపు తరువాయి బాగం….

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles