శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – మొదటి బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – మొదటి బాగం…

ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీల మనమందరం పంచుకుందాము. కుమారి మాయా సాద్వాని, పూనా వారి  ఈ  లీల  శ్రీసాయిలీలా మాసపత్రిక సెప్టెంబరు 1983వ సంవత్సరంలో ప్రచురింపబడింది.

గత ఏడు సంవత్సరాల నుండీ నేను సాయిని పూజిస్తూ ఉన్నాను. ఆయన మీద నాకెంతో భక్తి.  ఆయన నాకు ఎన్నో లీలలు చూపించారు.  అన్నిటినీ  నేను నా డైరీలో రాసుకుంటూ ఉంటాను. కాని వేటినీ కూడా ప్రచురించే ఉద్దేశ్యం మాత్రం లేదు.

కాని, క్రిందటి నెలలోనే జరిగిన ఈ లీలను మాత్రం సాయి బంధువులందరితోను నేను పంచుకోదలచుకోవడానికి కారణం, ఇది ప్రచురిస్తానని నేను బాబాకు మాట ఇవ్వడం వల్ల.  నా సద్గురువు, తండ్రి అయిన సాయికి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలని.

నేను అడ్వకేట్ ని.  పూనాలో సీనియర్ అడ్వొకేట్ డి.ఎస్.అయ్యర్ గారి వద్ద జూనియర్ గా పని చేస్తున్నాను. అయ్యర్ గారు కూడా ఎంతో దయ కలవారవడమే కాక దేవునిపై భక్తి కలవారు కూడా.

సాయిబాబా అనుగ్రహం వల్లే అటువంటి సీనియర్ వద్ద పనిచేసే అదృష్టం కలిగింది.  మేమిద్దరం కలిసి స్కూటర్ మీద కోర్టుకు వెడుతూ ఉంటాము.  నేను ఆయనతో గాని, వారి అబ్బాయి శేఖర్ తో గాని కోర్టుకు వెడుతూ ఉంటాను.

22.02.1983 మంగళవారము నాడు ఎప్పటిలాగే స్కూటర్లను (ఆయనది, వారి అబ్బాయిది) చిన్న తగాదాలను పరిష్కరించే (స్మాల్ కాజెస్) కోర్టు భవనం వద్ద నిలిపి ఉంచారు.

ఇది చెప్పే ముందుగా మీకు నేనొక విషయం చెప్పాలి.  17.02.1983 గురువారం నాడు స్వర్ గేట్ వద్ద ఉన్న సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా స్టిక్కర్లు రెండు కొన్నాను.  అయ్యర్ గారి  రెండు స్కూటర్లకి ఆ రెండు స్టిక్కర్లు అతికించాను.

మధ్యాహ్నం 2.30 కి నేను శేఖర్ తో కలిసి ఇంటికి వస్తున్నాను. అప్పటికి అయ్యర్ గారి స్కూటర్ అక్కడే ఉంది. సాయంత్రం నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికి కోర్టు భవనం ముందు ఉంచిన స్కూటర్ ఎమ్ ఎక్స్ బి 6030 దొంగిలించబడిందనే వార్త వచ్చింది. 

నేను నిర్ఘాంతపోయాను. మధ్యాహ్నం 3.30 కి కూడా తన స్కూటరు ఉంచిన చోటే చూశానని అయ్యర్ గారు చెప్పారు. చిన్నతగాదాల కోర్టుకు వెడుతున్నపుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

నేను అయ్యర్ గారితో “సర్, (నేనెప్పుడూ అయ్యర్ గారిని ఆ విధంగానే సంబోధిస్తూ ఉంటాను) మీరేమీ ఆందోళన చెందకండి. సాయిబాబా మీ స్కూటర్ ఎక్కడ ఉందో కనిపెట్టి మీకప్పగిస్తారు. నేనాయనకి చెబుతాను. కానీ మీరొక పని చేయాలి.  మీ స్కూటర్ దొరికితే నాకు మీరు కొబ్బరికాయ, పూలు కోసం రూ.2.50 ఇవ్వండి” అన్నాను.

అప్పుడు అయ్యర్ గారు “అలాగా! సాయిబాబా నా స్కూటర్ దొరికేలా చేస్తారని నిజంగానే నువ్వు నమ్ముతున్నావా?” అన్నారు.  “అవును సర్.  నాకాయన మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆయన నాకెంతో చేశారు. నాకోసం ఇది చేయలేరా?” అన్నాను.  “సరే చూద్దాం ఏం జరుగుతుందో” అన్నారు అయ్యర్ గారు.

పట్టణంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలో కంప్లయింట్ ఇచ్చాము.  సాయిబాబాని పిచ్చెత్తినట్లుగా వేడుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా విశ్వాసానికి, ఆయన శక్తికి పరీక్ష. నాకు ఆయన మీద సంపూర్ణమయిన విశ్వాసం ఉంది.

ఎప్పటిలాగే గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్ధించాను. అక్కడ పూజారిగారికి (ఆయన పేరు శ్యామ్) స్కూటర్ గురించి అంతా చెప్పాను.  అప్పుడాయన, “మంగళవారము నాడు పోయిన వస్తువు దొరకడం చాలా అరుదు. కాని శనివారం సాయంత్రానికి స్కూటర్ దొరుకుతుంది” అన్నారు. 

అపుడాయన రెండు చీటీలు తీసి ఒక దానిమీద ‘దొరుకుతుంది’, రెండవదాని మీద ‘దొరకదు’ అని రాసి సాయిబాబా ముందు వేశారు.  కొంతసేపటి తరువాత పూజారిగారు ఒక చీటీ తీశారు. ఆ చీటి నాకు ఇచ్చి అందులో ఏమని ఉందో చూడమన్నారు.  నేను బాబాని ప్రార్ధించి చీటీలో ఏముందో చూశాను.  అందులో ‘దొరుకుతుంది’ అని రాసి ఉంది.  నేను చాలా సంతోషించాను.

బాబాకి కృతజ్ఞతలు చెప్పి ఆఫీసుకు వెళ్ళి గుడిలో జరిగినదంతా అయ్యర్ గారికి చెప్పాను. అయ్యర్ గారి దగ్గరే పని చేస్తున్న మరొక జూనియర్ అడ్వొకేటు శనివారం నాడు చిన్న విందు ఏర్పాటు చేశాడు.

అయ్యర్ గారు, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు (రఘు, శేఖర్) మరొక అడ్వొకేటు, నేను, విందు ఏర్పాటు చేసిన అడ్వొకేటూ అందరం ఆ విందులో ఉన్నాము. అయ్యర్ గారి భార్య లక్ష్మీఅయ్యర్ చాలా మంచావిడ.

ఆవిడ కూడా ఎంతో భక్తిపరురాలు. స్కూటర్ పోవడం వల్ల ఆవిడలో కాస్తంత బాధ కనిపిస్తూ ఉంది. స్కూటర్ ఖరీదు రూ.10,000/- అంతకన్నా ఎక్కువే ఉండచ్చు.  స్కూటర్ పోవడం వల్ల మరొక స్కూటర్ కొందామనే ఆలోచనలో ఉన్నారు అయ్యర్ గారు.

“ఆంటీ, మీరేమీ మనసులో ఆందోళన చెందకండి.  స్కూటర్ తప్పకుండా దొరుకుతుంది. స్కూటర్ ఎలా ఉన్నది అలా దొరుకుతుంది.  కాని దానిని రిపేర్ చేయించడానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాలి. కాని దొరుకుతుందనే ఆశ నాకుంది. రేపు నేను షిరిడీ వెడుతున్నాను.  బాబాని ప్రార్ధిస్తాను. మీరేమీ గాభరా పడకండి. బాబా స్కూటర్ దొరికేలా చేస్తారు. నాకు ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది” అన్నాను. 

రేపు తరువాయి బాగం…..

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles