శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – రెండవ బాగం….

26వ తేది సాయంత్రం, అతను బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్ళాడు. అప్పట్లో మందిరం అంత పెద్దది కాదు.  సమాధి మందిరంలో సాయిబాబా సమాధి మాత్రమే ఉండేది. అప్పటికి ఇంకా సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించలేదు.

అతను తన కళ్ళు మూసుకొని సమాధి ఎదుట ఒక స్తంభానికి సమీపంలో నిలబడ్డాడు. కళ్ళనుండి ఆనందాశ్రువులు జాలువారుతుండగా, తన చుట్టూ వున్న పరిసరాలను మరచి తన్మయత్వంలో మునిగిపోయాడు. కొంతమంది భక్తులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించారు కాని అతను స్పందించలేదు. సుమారు 9 గంటలకు అతను బాహ్యస్మృతిలోకి వచ్చాడు.  అతను వదలలేక వదలలేక మందిరం వదలి ఇంటికి  బయలుదేరాడు.

అతనికి ధనవంతులు లేదా పేదవారు అనే వ్యత్యాసం ఏమాత్రం లేదు. అతనికి అందరూ సమానమే. అతను షిర్డీ నుండి వెళ్తూ తెలిసిన వారందరికీ వీడ్కోలు చెప్పాడు. అలా వీడ్కోలు చెప్తున్నప్పుడు అతనితోపాటు అందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అతను సుమారు 11 గంటలకు ఇంటికి చేరుకుని భోజనం చేసి పడుకున్నాడు.

సుమారు 2 గంటల సమయంలో అతను లేచి తన కుమారులను నిద్రలేపి, తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. వాళ్ళు పొరుగువారికి సమాచారం అందించి, తరువాత డాక్టర్ ని పిలిపించారు. డాక్టర్ వచ్చి పరీక్షించి, కలరా వ్యాధిగా నిర్ధారించి ఔషధం ఇచ్చారు. ఉదయానికల్లా అతను చాలా బలహీనంగా తయారయ్యాడు.

మధ్యాహ్నానికి అతడు స్పృహ లేకుండా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. మధ్య మధ్యలో అతడు కళ్ళు తెరిచి, ఎదురుగా గోడపై ఉన్న బాబా ఫోటోను చూస్తున్నాడు. అతని దృష్టి అంతా కేవలం బాబా మీదనే ఉన్నది.

సుమారు 4.30 ప్రాంతంలో అతను కళ్ళు తెరిచి తన దగ్గర నిలబడి ఉన్న వ్యక్తికేసి చూసాడు. ఆ వ్యక్తి అతడి దగ్గరకు వెళ్ళి ఏమి కావాలని అడిగినప్పుడు, అతను గోడపై ఉన్న సాయిబాబా ఫోటో తనకివ్వమని సైగ చేసాడు. బాబా ఫోటోను తన దగ్గరకు తీసుకు రాగానే, అతడు తన చేతులు చాచి, బాబా ఫోటోను తన హృదయంపై ఉంచమని కనుసైగలతోనే సూచించాడు. అలా అతను బాబా ఫోటోను గట్టిగా కౌగిలించుకొని, చిరునవ్వుతో “బాబా, సాయిబాబా, బాబా” అని బాబా నామాన్ని స్మరిస్తూ తన చివరి శ్వాసను విడిచాడు.

మిస్టర్ అయ్యర్ హఠాన్మరణం గురించి విన్న ప్రజలు దిగ్భ్రాంతిచెందారు. క్రితం రోజు రాత్రి వరకు ఆరోగ్యంగా వున్న మిస్టర్ అయ్యర్, ఇప్పుడు తమ మధ్య లేనందుకు ఎంతో విచారించారు. అతనిపై గల ప్రేమతో, దూరాన్ని సైతం లెక్కచెయ్యకుండా, షిర్డీ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు కాలినడకన అక్కడికి వచ్చారు.

ఆ సమయంలో లక్నోలో ఉన్న అతని భార్యకు అతని మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా తెలియజేసారు. ఆమె తన భర్తను చివరిసారిగా చూడాలన్న కోరికతో వెంటనే తన పిల్లలతో కలిసి నాలుగు రోజుల తరువాత లక్ష్మివాడికి  చేరుకున్నది. అయ్యర్ భార్య లక్ష్మివాడికి వచ్చినట్లు తెలుసుకొని, శిరిడీ ప్రజలలో చాలామంది అయ్యర్ గురించి ఆమెతో మాట్లాడుతూ ఆమెను ఓదార్చారు. అదే రోజు రాత్రి అయ్యర్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వి.పి.అయ్యర్ మరణించిన తరువాత కూడా అతని భార్యాపిల్లల యోగక్షేమాలు బాబా చూసారు. వారు అందరు చక్కగా విద్యాభ్యాసం చేసి జీవితంలో స్థిరపడ్డారు. అందరికి వివాహాలు జరిగి పిల్లలు కలిగారు. వారంతా సాయిబాబా భక్తులే.

షిర్డీ ప్రజలు సంస్థాన్ వారిని సంప్రదించి మిస్టర్ అయ్యర్ కు ఒక సమాధి నిర్మించమని కోరారు. దానికి వారు అంగీకరించారు. అతని అస్థికలను ఖననం చేసి సమాధి నిర్మించి, దానిపై అయ్యర్ పేరు, జనన-మరణ వివరాలను పొందుపరిచారు.

బాబా తన భక్తుని యొక్క ప్రార్థన మన్నించి, అతని కోరికను నెరవేర్చి, తన ప్రియమైన భక్తుని ఎప్పటికీ శాశ్వతంగా తమ చెంతనే ఉంచుకున్నారు. వి.పి.అయ్యర్ గారి సమాధి నానావాలి సమాధికి వెనుక లెండి గార్డెన్ లో ఉంది.

Address

Smt. Hirabai lyer
C/o Dr. S. N. lyer. 13, Palm Court,
152, M. Karve Marg,
Mumbai-400 020

(Source: First hand account given by Smt.Hirabai Iyer Wife of Late Shri.V.P.Iyer and published by Shri Sai Leela Magazine, February 1976)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – రెండవ బాగం….

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles