Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఓం సాయి రామ్..
హైదరాబాదులోని మియాపూర్ కి చెందిన శ్రీమతి అర్చన గారు రెండు అనుభవాలు ఇదివరకు చదివాము. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంపించారు. అవి మీకోసం క్రింద ఇస్తున్నాను. ఆమె మాటలలోనే చదవండి. ఈ లీల చదివితే బాబా ఎలా మనల్ని కనిపెట్టుకొని ఉంటారో మనకు అర్థం అవుతుంది. అర్చన గారికు వారి కుటుంబ సభ్యులకు బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
అనుభవం 1
2014 లో ఓక శుక్రవారం హైదరాబాద్ నుంచి గుంటూరు బస్ లో నేను మా బాబు వెళ్తున్నాం. ట్రావెల్స్ వాళ్లు మాకు తెలిసిన వాళ్లు అవటం వాళ్ళ లాస్ట్ మినిట్ లో చెప్పిన టికెట్ ఇస్తారు. మా బాబు కోసం ఎపుడు నేను ఫ్రంట్ లొనే 2 సీట్లు తీసుకుంటాను. కానీ ఆ రోజు ఎంతో చివరి వరుస లో దొరికాయి. ఆ ట్రావెల్స్ బస్ లో ఫ్రంట్ సీట్ దగ్గర పెద్ద బాబా బొమ్మ ఉంటుంది. నేను బస్ ఎక్కగానే ఆ ఫోటో కి దండం పెట్టుకుంటాను. అలాగే ఆ రోజు కూడా బాబా కి దండం పెట్టుకున్నాను.
బస్ ఎక్కిన తరువాత కూడా కండక్టర్ ని బాబుతో వెనక సీట్ అయితే ప్రాబ్లం గా ఉంటుంది, దయచేసి ఫ్రంట్ సీట్స్ చూడండి మేము అక్కడికి వెళ్తాము అని అడిగాను. కాని అతను క్షమించండి అలా మార్చడం కుదరదు అన్నాడు. ట్రావెల్స్ వాళ్లతో మాట్లాడి బస్ బాయలు దేరి వరకు ట్రై చేశా, కానీ కుదురు లేదు.
సరిగ్గా రామోజీ ఫిలిం సిటీ దాటగానే బస్ కి ఆక్సిడెంట్ అయ్యింది. మా బస్ ముందు వెళ్ళే బస్ ని గుద్దుకుంది. ముందు కూర్చున్న వాళ్ళ కి చాలా రక్తం వచ్చే విధంగా గాయలు అయ్యాయి. నాకు చాలా భయం వేసింది.
మా బాబు ఒకటే ఏడుపు. మా పక్క వారికీ కూడా బాగా రక్తం వస్తుంది. నాకు మా 3 ఇయర్స్ బాబు కి మాత్రం చిన్న దెబ్బలు తగిలాయి. నేను మా వారికీ ఫోన్ చేశాను. వెంటనే అయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. ఈ జన్మ మాకు బాబా ఇచ్చిందే.
అనుభవం 2
ఇంకొ సరి మా పాపాకి 3 నెలల వయస్సు అప్పుడు మా బాబు కోసం పాలు పొయ్యి మీద పెట్టాను. అంతలో పాపాని బాత్ రూమ్ కి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. పొయ్యి మీద పాల విషయం మరచిపొయి ఆమె కి స్నానం చేయించాను.
ఒక అరగంట తరువాత వంట గదికి వెళ్లి లైట్ వేసాను. ఆశ్చర్యం పాలు పొయ్యి మీద పడి పొయ్యి అరి పోయింది కానీ గ్యాస్ లీక్ కాలేదు అదే ఆయ్యుంతే లైట్ వేయగానే ఏమి అయ్యేదో తలుచుకుంటే భయం వేస్తుంది.
పొయ్యి ఆరిపోయి అరగంట అయిన గ్యాస్ లీక్ కాకా పోవటం బాబా దయ
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి కరుణ
- సర్వ శక్తి సంపన్నుడు సాయి
- శ్రీ సాయి అమృత ధార – నమ్ము నమ్మకపో….
- నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1
- సాయి భక్తుడు రామకృష్ణ అనుభవాలు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి సంరక్షణ”
Sreenivas
May 20, 2017 at 9:10 amNice Experience Sai……Sai Baba…Sai Baba…Sai Baba
Maruthi
May 20, 2017 at 10:10 amBaba…Sai Baba…Sai Baba