Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: బ్రహ్మాజీ
నివాసం: విజయవాడ
నా పేరు బ్రహ్మాజీ. మా ఊరు తాడంకి గ్రామం. విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
నేను ముందుగా శిరిడీ రావడానికి గల కారణం 2010 వ సంవత్సరం మే నెలలో మా నాన్నగారికి యాక్షిడెంట్ అయింది. తరువాత ఆయన ఆరోగ్యం బాగలేదు.
డెంగ్యూ, ఊపిరితిత్తులకు నీరు వచ్చాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అందరి దేవుళ్ళకి మొక్కు కున్నాను.
అదే సమయంలో బాబాకి మొక్కుకున్నాను. బాబా మా నాన్న ఆరోగ్యం బాగయితే మా నాన్నని తీసుకుని శిరిడీ వస్తాను అని.
అలాగే కొన్ని రోజులకి మా నాన్నగారి ఆరోగ్యం పరవాలేదు. అదే సమయం లో సాయి భక్తుడు అయిన కిశోర్ బాబు గారు ట్రైన్ టికెట్స్ పంపారు.
ఈ విధoగా 2011 లో ఫిబ్రవరిలో మేము శిరిడీకి బయలు దేరాము. శిరిడీ బుధవారం ఉదయం చేరుకున్నాము.
సమాధి మందిరానికి దర్శనానికి వెళ్ళాము. బాబా దర్శనం చేసుకున్నాము, కానీ బాబా సమాధి టచ్ చేయలేదు అని నా మనసులో బాధగా ఉంది. అలాగే మా నాన్న గారి ఆరోగ్యం బాగవ్వాలి అని కోరుకున్నాను.
దర్శనం అయిన తరువాత రూముకి వచ్చాము. అప్పుడు రూములో కిశోర్ బాబు గారు, బ్రహ్మజీ మీ నాన్న గారికి ఆరోగ్యం బాగవ్వాలని కోరుకున్నావు. నీ గురించి ఏమి కోరుకోలేదు.
మీ నాన్నగారు ఏమో మా అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి అమ్మాయితో పెళ్లి జరగాలి. నేను చూడాలి అని,
మీ అమ్మ గారు నా భర్త ఆరోగ్యం బాగవ్వాలి అని కోరుకున్నారు అని అన్నారు. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది.
మేము మనసులో కోరిన కోరికలు తనకెలా తెలిసాయి అని అనుకున్నాను. అయన ఒక్కసారిగా బాబాను అడిగాను, బాబా చెప్పారు అని అన్నారు.
సాయంత్రం సాయిపథం దగ్గరకు తీసుకుని వెళ్లారు. (ముందుగా ఒక మాట ఇంతకు ముందు అనేక సార్లు శరత్ బాబూజీ గారి ( గురువుగారు ) ఫోటో కిశోర్ బాబు గారి దగ్గర చూసాను.
శిరిడీలో బాబా దగ్గర ఉంటారు అని అనుకునేవారు. గొప్ప గురువు గారు అని చెప్పుకునే వారు. కిశోర్ బాబు గారు.
శిరిడీ టికెట్స్ పంపినారు. శరత్ బాబూజీ దగ్గరకు తీసుకుని వెళ్లారు. మా నాన్న గారి ఆరోగ్యం బాగు అవుతుంది అని అనుకున్నాను.)
కానీ సాయిపథం లోపలికి తీసుకొని వెళ్లి, కొన్ని రోజుల క్రితం శరత్ బాబూజీ గారు సమాధిలోకి వెళ్లారు, అని చెప్పారు కిషోర్ బాబు గారు. సమాధి చూపించారు.
నాకు చాలా బాధ కలిగింది. నేను దురదృష్టవంతుడిని అని అనుకున్నాను. రాత్రికి “ద్వారకామాయి” లో కూర్చుందాం అని చెప్పి కిశోర్ బాబు గారు మేము రూమ్ లో నుంచి బయలు దేరాం.
దారిలో బిస్కెట్ ప్యాకెట్ , వాటర్ బాటిల్ తీసుకున్నాను. దారిలో “బాయజాబాయి” ఇల్లు చూసి అక్కడ నుండి బయలుదేరాము.
ఇంకా రెండు నిమిషాలలో ద్వారకామాయికి చేరుకుంటాము అని కిశోర్ బాబు గారు అన్నారు. టైం పన్నెండు అవుతుంది. గురువారం ద్వారకామాయిలో అడుగుపెడుతున్నారు మీరు అని బాబా చెప్పారు అన్నారు.
నాకు చాలా ఆనందం కలిగింది. ద్వారకామాయిలో ఒక గంట సమయం గడిపాము. నా పక్కన కూర్చున్న వ్యక్తి నాకు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చి ఇది ఎవరికి పెట్టవద్దు మీరే తినండి అని అన్నారు.
నేను కిశోర్ బాబు గారిని అడిగాను. బాబా మా నాన్నకి ఆరోగ్యం బాగు చేయండని చెప్పు అన్నాను. అప్పుడు కిశోర్ బాబు గారి కళ్ళలో నుండి నీరు కారుతున్నాయి.
నేను బాబాను అడిగాను. బాబా నాకు చెప్పిన సమాధానం “రూపాయి బురదలో పడితే వదిలేస్తామా! దానిని కడుక్కుంటాం అన్నారు బాబా” అని మాతో కిశోర్ బాబు గారు చెప్పారు.
మీకు ఎలాంటి బాధ కలిగిన సాయిబాబా నామం చెప్పుకోండి మంచి జరుగుతుంది అని చెప్పారు.
కిశోర్ బాబు గారు హైదరాబాద్ రైలు ఎక్కి కరీంనగర్ వెళ్లారు, మేము విజయవాడ రైలు ఎక్కి ఇంటికి చేరుకున్నాము.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
Latest Miracles:
- దూరాన్ని పెంచిన అంగ వైకల్యం, నాన్నకి దగ్గర చేసిన సాయి కరుణ ……….!
- ఒక ముసలమ్మపై బాబా చూపిన కరుణ
- కరుణ కోసం తపన…. మహనీయులు – 2020… నవంబర్ 22
- బాబా నే సర్వస్వమ్ అనుకున్న ఒక అభాగ్యురాలి పై బాబా చూపిన ప్రేమ , కరుణ …!
- సర్వ శక్తి సంపన్నుడు సాయి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments