సర్వ శక్తి సంపన్నుడు సాయి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: భాస్కర్. టి

నివాసం: శిరిడీ

అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !!

మేము (భాస్కర్ మరియు కిషోర్ బాబు గారు) సద్గురులీల డాట్ కామ్ (sadguruleela.com & www.saibabatemples.org ) ఓపెన్ చేయదలచాము.

మేము ఆ రెండు వెబ్ సైట్ లను డిసెంబర్ 30వ తేది ఓపెన్ చేయదలచాము.

మా దగ్గర పనికిరాని డేటా కార్డు ఒకటి ఉన్నది. మేము దానిని రిపేరు చేయించటానికి B.S.N.L Office  కి బయలుదేరే ముందు మాకు ఒక ఆలోచన స్పురణకు వచ్చింది.

“సాయి బాబా… సాయి బాబా” అని నామజపం చేసి టెస్ట్ చేయదలచాము.

దానిలో 3G సిమ్ ఇన్సర్ట్ చేయాలి.

మేము రీఛార్జ్ చేయించడానికి దగ్గరలో ఉన్న రెండుమూడు షాప్కి వెళ్ళాము.

వారి దగ్గర రీఛార్జ్ బాలన్స్ లేక చేయలేదు.

అప్పుడు ఏమి చేయాలో మాకు అర్ధం కాలేదు.

బాబా అనుకుంటే ఏదైనా చేయకలుగుతారు అని నా ఫ్రెండ్ కిషోర్ బాబు గారు ( బాబా కి మంచి సేవకుడు )  చెప్పారు.

ఇంతలో అనుకోకుండా నా మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది.

మేము రీఛార్జ్ చేయకుండానే రీఛార్జ్ ఛార్జ్ చేసినట్లు మెసేజ్ వచ్చింది.

బాబా లీల అద్భుతము..ఇదే మన బాబా కె సాధ్యం అని చాల ఆనందపడ్డాము.

100 రూ బ్యాలెన్స్ వచ్చింది.

సిమ్ డేటా కార్డులో పెట్టి పై రెండు సైట్లు ఓపెన్ చేశాము.

ఇక్కడ అద్బుతమైన బాబా లీల ఏమంటే పనికిరాని డేటా కార్డు పనిచేయడం కాకుండా, అందులో బ్యాలెన్స్ వచ్చింది.

ఆ రెండు సైట్లు ఓపెన్ అయిన తరువాత నెట్ డిస్-కనెక్ట్ అయ్యింది.

మరియు బ్యాలెన్స్ -9.99 లోకి వెళ్ళింది. వేరే వాళ్ళు ఎవరైనా పొరపాటున నా అకౌంట్ లో అమౌంట్ వేసి ఉంటే నాకు మెసేజ్ వచ్చి ఉండేది.

అట్లా మెసేజ్ కూడా రాలేదు.

బాబా అనుగ్రహముంటే సాద్యము కానిది కూడా సాద్యమవుతుందని నిదర్శనమైంది.

   ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

*** సాయి సూక్తి:

నా వద్దకు వచ్చే వారందరు ముందు వారి ప్రాపంచిక అవసరాలకోసమే వస్తారు. ఒకసారి కోరికలు తీరి తృప్తి చెందాక, అప్పుడు నా పై దృష్టి సారిస్తారు”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles