నాటకాలకూ ఒక హద్దు ఉంటుంది మితిమీరితే , అది జన్మకు అమావాస్య చీకటినే మిగులుస్తుంది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

నాటకాలకూ ఒక హద్దునుంటుంది మితిమీరితే , అది జన్మకు అమావాస్య చీకటినే మిగులుస్తుంది.
****

“కడుపులో లేనిది కక్కితే వొస్తుందా “అని ఒక సామెత ..

కొన్నిచోట్ల అవసరాన్నిబట్టి లేని ఆప్యాయతల్ని వొలకపోయాల్సివొస్తుంది ..

కొన్ని సందర్భాలలో అనుకొన్న పని సాధించుకోవాలంటే మనసు చంపుకొని , లేని వినయాన్ని ప్రదర్శించాల్సివొస్తుంది ..

ఆఖరకు ఇంట్లొ ఇల్లాలును లేదా కుటుంబసభ్యులనుకూడా , నెరవేర్చలేని కోరికలను , నెరవేస్తానని ఒక్కో సమయంలో సముదాయించడానికి భూటకపు మాటలుచెప్పి తప్పించుకోవలసివొస్తుంది ..

ఏదైనా ఒకపనిపెట్టుకొని ఒక అధికారిని కలిసినప్పుడు , నువ్వే ఇంద్రుడు , చంద్రుడువంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు ..

ఆ పని పూర్తయితే , ఎవరికి ఎవరో , కనీసం ఆతర్వాత ఒక క్షణం కూడా తలుచుకొనే సందర్భాలు ఉండవు ..

“చావు , పుట్టుకలు నిజం , ఆ మద్య జరిగె జీవితమంతా ఒక నాటకమే అన్నాడు వేదాంతధోరణిలో అన్నమయ్య ..

నిర్మొహమాటంగా జీవించాలనుకొంటే ప్రతి అడుగులో అవరోధాలు తప్పవు ,అని ప్రతి నిమిషం జీవితంలో నటించటం మొదలుపెడితె , అది లోకం దృష్టిలోనే అపనమ్మకాన్ని కూడగట్టుగొంటుంది ..

సుదీర్ఘ వైవాహిక జీవితంలొ , కొన్ని సందర్భాలలో ఇల్లాలును నమ్మించవొచ్చుకానీ , ప్రతి నిమిషం నమ్మించాలని ప్రయత్నం చేస్తే , భార్య దృష్టిలోకూడా వాడు పనికిరాని పూచికపుల్లకన్నా హీనంగా చూడబడతాడు ..

భగవద్గీతను బోధించిన కృష్ణపరమాత్ముడే లోకహితంకోసం యుద్దంలో ధర్మరాజుచేత అబద్దం పలికించాల్సి వొచ్చింది ..

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ..కొందరి నయవంచనను , లొకహితంకోసం తెలివిగా ప్రవర్తించి , బట్టబయలు చెయ్యాల్సి ఒస్తుంది ..

అమ్మకు పురిటినొప్పులగూర్చి వర్ణించినట్టు , గురు సన్నిదిలో కూడా కడుపులో లేనిది కక్కినట్టు , యాంత్రికపు భక్తి , అతివినయాలు ప్రదర్శిస్తే , అది కలిగిన విలువైన జన్మనే మోసంచేయగలదని పెద్దలమాట …

శ్రీ గురు చరణార్పణమస్తు
**

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles