Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
నా పేరు ఎల్. సుజాత. నేను తెనాలిలో మా ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్సంగానికి వెళుతుంటాను. ఒక రోజు రాత్రి పూట మాములుగానే భోజనం చేశాను. అప్పటికి కొద్దిగా కడుపునోప్పిగా ఉంది.అదే పొతుందిలే అని వూరుకున్నాను. ఇక రాత్రి అంతా నిద్రలేదు. నొప్పి ఎక్కువైంది. మాత్ర లేదు. మజ్జిగ తాగాను. కొద్దిగా నయమైంది. మరుసటి రోజుకు కూడా తగ్గలేదు.ఇక లాభం లేదు అనుకోని నేను మా నాన్న ఆసుపత్రికి వెళ్ళి చూపించుకొని వచ్చాము. కొంచం జ్వరంగా కూడా ఉంది.దాంతో వాంతులు కూడా అవుతున్నాయి. సాయంత్రం పూట ఒక మాత్ర వేసుకున్నాను. ఉదయం పూట మా అమ్మ బాబా అన్నప్రసాద వినియోగం కార్యక్రమానికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. అక్కడ మా వాళ్ళంతా ఉన్నారట. మా అక్క,బావ, పెద్దమ్మ, ఆమ్మ ఉన్నారు. సరిగమ ఆడియో మామ, నేను రాలేదెంటి అని అడిగారట. అప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగా లేదని, జ్వరంగా నిరసముగ ఉందని చెప్పింది. అప్పుడు మా మామ బాబా దగ్గర ఊదీ కొంచెం తీసి నమస్కారం పెట్టుకుని బాబాకు తాకించి మా తల్లికి ఇచ్చారు. ఊదీ కొంచెం నీళ్ళలో వేసుకొని త్రాగమన్నారు. మాత్ర వేసుకున్నాక కూడా వాంతులు ఆగలేదు. జ్వరం కొంచెం ఎక్కువగా ఉన్నది. అప్పుడు ఊదీ పొట్లం తీసి కాసిని నీళ్ళల్లో వేసుకొని తాగాను. 5 నిమిషాలలో కడుపులో తిప్పి మరోసారి వాంతి అయింది. నాకు భయం వేసింది.తగ్గాల్సింది ఇంకా ఎక్కువైంది. ప్రక్కనే ఉన్న మా నాన్న వాంతి అవగ్గానే పోనిలే కడుపులో ఉన్న చెడు అంతా పోయింది అని అన్నారు. తర్వాత అతి కష్టం మీద బ్రెడ్ తిన్నాను. అది కూడా వాంతైపోయింది. మరుసటి రోజు నుండి రోగం తగ్గేంతవరకు ఎప్పుడు వాంతి అవలేదు. తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. బాబా మామ చేతులమీదుగా ఊదీ పంపించారు. ఊదీ తీర్ధం తాగిన తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఊదీ వేసినప్పటి నుండి నా రోగం తగ్గడం ప్రారంభించింది. మా నాన్న అన్న మాట నిజమే. కడుపులో ఉన్న చెడు అంతా పోయిందిలే అని నాకు అనిపించింది. నిజంగానే చెడుని తీసేశారని, అప్పటి నుండి మరల ఎప్పుడు వాంతులు అవలేదు.జ్యరం తగ్గింది. బాబా వారి అమృతహస్తాలతో వెలిగించిన ధునిలోంచి వచ్చిన ఊదీ యొక్క మహిమను, గోప్పతనంను నేను రుచిచూసినందుకు నాకు చాలా తృప్తిగా ఉన్నది ఇది నా జీవితంలో ఎప్పటికి మరువలేను. చాలా సంతోషంగా ఉన్నది.
ఎల్ .సుజాత,
సాయిబాబా సత్సంగ కేంద్రం, గంగానమ్మ పేట,తెనాలి.
సంపాదకీయం: సద్గురులీల.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- గురువుగారి దయవలన నాకు పూర్తిగా జ్వరం తగ్గి స్కూల్ కి వెళ్లి పరీక్ష కూడా వ్రాయగలిగాను.
- బాబా పాదాల మీద పాపని వుంచగానే పాప జ్వరం మాయం అయిపొయింది.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- ” ఊదీ ” మహిమతో ఎంతటి నొప్పి అయినా మటుమాయం …………………!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments