Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా గారి విగ్రహము తయారి వెనుక కథ లీల ఈ రోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాన్ని శ్రీయిమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన “షిరిడీలో సిరులు” అనే పుస్తకము నుండి గ్రహింపబడినది.
ఒకసారి ఇటలి నుంచి ఒక చక్కటి పాలరాయి బొంబాయి ఓడరేవుకొచ్చింది. అది యెలా వహ్చిందోయెందుకొచ్చిందో యెవరికీ తెలీదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ రాకపోయేసరికి, రేవుఅథికారులు దానిని వేలం వేశారు. వేలంలో స్వంతం చేసుకున్నవ్యక్తి, కొన్నాళ్ళ తరవాత మరి యేప్రేరణతోనో దానిని షిరిడీ సంస్థానానికి సమర్పించాడు. ఆ రాతి నాణ్యతను గుర్తించిన సంస్థానంవారుదానితో బాబా శిల్పం చెక్కిచాలని నిర్ణయించి, బొంబాయికి చెందిన బాలాజి వసంత్ తాలిం అనే ప్రఖ్యాతశిల్పికి ఆ బాథ్యతను అప్పగించారు.
అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫొటోలు కూడా చాలా కొద్ది. అవి కూడావేరు వేరు వయస్సులకు చెందినవి. అందువలన ఎంత శ్రమించినా నమూనా మూర్తి సంతృప్తిగా రాలేదు.చివరి ప్రయత్నంగా అతడు సాయినే ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కంపించి, “నన్నుమళ్ళీ, మళ్ళీ, చూడాలంటే సాథ్యం కాదు. జాగ్రత్తగా చూడు” అని తన ముఖాన్ని వివిథ కోణాలలోచూపించారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ (కలలోనే) ఆయన రూపాన్ని అన్ని వైపులనుండి పరికించాడు. ఆ స్వప్న సాక్షాత్కార బలంతో తెల్లవారగానే ప్లస్టర్ ఆఫ్ పారిస్తో చక్కని నమూనామూర్తిని తయారు చేసి, దానినిబట్టి ఐదు అడుగుల ఐదు అంగుళాల యెత్తు పాలరాతి విగ్రహంఅపురూపంగా మలచాడు. అంటే సాయి తనంతటతానుగా తన ప్రతిరూపాన్ని తయారుచేయించుకున్నారు. అది జీవకళ తొణికిసలాడుతూ వుండే సజీవ ప్రతిమ. భక్తులకు అది సాయిప్రతిరూపం కాదు. సాయియే! ఈనాడు అంబరాన్ని చుంబించే భవంతులతో, లెక్కకు మిక్కిలి వాణిజ్యసముదాయాలతో వజ్రాల ద్వీపంలా వెల్గొందుతున్న షిరిడీలో, రాజ భవనంవంటి సమాథి మందిరంలోసిమ్హా సనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ వుంటుంది
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- స్వామి శరణానంద్ నుండి దక్షిణ స్వీకరించి అతనికి ‘సన్యాసం’, ‘సద్గతి’ ప్రసాదించారు బాబా
- ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి…..సాయి@366 జూన్ 10…Audio
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
- గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట (ఏకనాథ భాగవతమును – శ్యామా)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments