నానా సాహిబ్ నిమోన్ కర్ (శంకర్ రావ్ రఘునాధ్ దేశ్ పాండే)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మహరాజ్ సాయిబాబా కి నానా సాహిబ్ నిమోన్ కర్  కీ నడుమ ఊహకందని ఋణానుబంధం వుందనిపిస్తుంది. నానా సాహిబ్ ఒక్క క్షణం అయినా సరే బాబాను వదలి వుండాలన్న ఊహని కూడా భరించగలిగేవాడుకాదు.

అందువలన షిరిడీనే తన నివాసంగా భావించుకుంటూ ద్వారకామాయి లో వుంటూ రాత్రి బాబా నిద్రకుపక్రమించిన తర్వాత తన ఇంటికి వేళ్ళేవాడు.

గ్రామస్ఠులు ఆయననెంతగానో ప్రేమించేవారు, వారిలాగే బాబా కూడా ఆయనను ’కాకా’ అని పిలిచేవారు. బాబా కాకాని ఎంతగానో గౌరవించేవారు, ప్రేమించేవారు అంతకు మించి నమ్మేవారు. ప్రతిరోజూ వసూలయ్యే దక్షిణ మొత్తాన్ని బాబా నానా సాహిబ్ కిచ్చేవారు,ఫలాలూ, ప్రసాదాలూ, ధునిమాయి కి కట్టెలు ఆ మొత్తం లోనుండి కొనమని బాబా నానాను తరచుగా ఆదేశిస్తూ వుండేవారు. బాబా అదేశాలను తు.చ.తప్పకుండా పాటించడమే కాకుండా నానా సాహిబ్ ఏ రోజుకారోజు ఖర్చుల వివారాలను అతి ఖచ్చితంగా వ్రాసి వుంచేవారు. ఒక్కమాటలో చెప్పాలంటె నానా సాహిబ్ నిమోన్ కర్ బాబా కి నమ్మకస్తుడైన లేఖకుడు (ఎక్కౌంటెంట్).

నిమోన్ కర్ కి భాగవతం మూలగ్రంధం చదవాలనే తీవ్రమైన కోరిక వుండేది. కానీ ఆయనకి సంస్కృత భాష రాదు. తమ ప్రేమనూ,కృపనూ పొందిన తన భక్తులకు భౌతికమైన, ఆద్యాత్మికమైన ప్రయోజనాలను సద్గురువులందజేస్తూవుంటారు.  “కాకా! నీవు ’పోతీ’ (పవిత్రగ్రంధాలను అలా పిలుస్తారు) ఎందుకు చదవడం లేదు” అని బాబా ఒకరోజు నిమోన్ కర్ ని అడిగారు. “నాకు సంస్కృతం రాదు”అని నిమోన్కర్ జవాబిచ్చాడు. “ఫరవాలేదు, మశీదు మాయి నీకు సంస్కృతం నేర్పుతుందిలే, నెమ్మదిగా నేర్చుకుందువు, ఈరోజు నుండే చదవడం ప్రారంభించు” అన్న బాబా ఆదేశానుసారం నానా నిమోన్ కర్ సంస్కృతం లో వున్న భాగవతం మరియు వ్యాఖ్యానమూ ఒక్క పదమయినా అర్దం కాకున్నా బాబా వాక్కుమీద విశ్వాసంతో ప్రతిరోజూ చదవడం ప్ర్రారంబిన నానా నిమోన్ కర్, క్రమంగా చదివినది అర్దం చేసుకోగలగడమే కాకుండా భక్తులకు విశదపరచి, సందేహాలను తీర్చగలిగిన స్థాయికి ఎదగగలిగాడు. సమయం గడిచేకొద్దీ సంస్కృతం భాషలో నిష్ణాతులూ, పండితులూ అయిన దీక్షిత్, జోగ్ వంటివారికి  కలిగిన సందేహాలను కూడా నివృత్తి చేయగలిగిన ప్రావీణ్యాన్ని సద్గురు కృపవలన సాధించ గలిగాడు.  “కాకా! మనం ఇతరులకు విషయాలను విశదపరచాల్సిన అవసరం ఏముంది? అందువలన మనకు గర్వం పెరగదూ?” అన్న బాబా ఆదేశంతో నిమొన్కర్ విశదపరచడం, భోదపరచడం నిలిపివేశాడు. అప్పుడు బాబా నిమోన్కర్ ని గీతనీ, జ్ఞానేశ్వరినీ చదవమని ఆదేశించారు.

బాబా నిమోన్ కర్ ని ఎంతగా ప్రేమించేవారంటే తన కుమారుడ్ని చూడడానికి వెళ్లడానికి కూడా అంగీకరించలేదు. ఇది బాబా మహసమాధికి కొద్దిగా ముందు జరిగింది. “నన్ను పూడ్చి నువ్వు వెళ్లు” అన్నారు బాబా. బాబా భౌతికదేహం విడిచినపుడు నిమోన్ కర్ బాబా దగ్గరే వున్నారు. చివరి క్షణాల్లో బాబా నోటిలో నీరు పోసి అంతిమ క్రియలలో ముఖ్యమైన క్రియను నిర్వహించిన భాగ్యశాలి.

నానా సాహిబ్ ధనవంతుడు, ఆయన గ్రామం నిమోన్ లో ఆయనకి ఒక వాడా వుండేది. ఆయనది ఉమ్మడి కుటుంబం, అందరూ ఆ వాడాలోనే వుండేవారు. ఆయన రైతు, చాలా ఎకరాల భూమి వుండేది. ఒకసారి భయంకరమైన కరువు ఏర్పడింది. నిల్వలోవుంచిన ధాన్యపుగింజలతో రోజులు గడిచాయి. వర్షాలు పడకపోగా నేల పగుళ్ళు పడడం ప్రారంబించింది. గొడ్దుపొయిన తన భూముల్ని చూసి విపరీతమైన నిరాశకు గురయిన నిమోన్ కర్ భారమైన హృదయంతో తన భూముల్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే బాబా అనుమతి లేకుండా నిమోన్ కర్  ఏ నిర్ణయమూ అమలుపరిచేవాడు కాదు. బాబా ఆదేశాలకోసం వెంటనే షిరిడికి వెళ్లాడు. ద్వారకామాయి లోనికి అడుగుపెడుతున్నంతలోనే బాబా “నీ లక్ష్మి ని అమ్ముకుందామనుకుంటున్నావా, పో వెంటనే పో” అని ఘర్జించారు. ఏనాడూ బాబా ఆదేశాలను అధిగమిమించని నిమోన్ కర్ తిరుగు ముఖం పట్టాడు. తిరుగు ప్రయాణంలో గ్రామాల గుండా వెడుతూ బీటలు వారిన భూముల్ని చూసి గుండె చెరువయిందాయనకు.

తన గ్రామానికి 12 మైళ్ల దూరంలో వున్న నన్నగ్గావ్ లోని కాలవలన్ని నీటితో నిండి వుండడం చూసిన నిమోన్ కర్ గుండె కుదుటపడింది. నిమోన్ చేరుకున్న నిమోన్ కర్ తన గ్రామం లోని భూములన్నీ నీటితో నిండి వుండడం తో ఆశ్చర్యపోయాడు. “నువ్వు షిరిడి కి వెళ్లిన వెంటనే వచ్చిన వరద వెల్లువ కారణం గా మొత్తం భూములన్నీ జలమయమయ్యాయి. బావులు యిక ఎండిపోవు”అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

నిమోన్ కర్ చిన్న చెల్లెలి వివాహం నిశ్చయమై ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత బాబాను ఆహ్వానించడానికి షిరిడి వెళ్లాడు. బాబా తప్పకుండా వస్తానని మాటిచ్చారు. నిమోన్ కర్ బాబా కోసం పెద్ద సింహాసనం,రుచికరమైన పిండివంటలు సిధ్దంగా వుంచాడు. బంధుమితృల రాకపొకల హడావిడి లో నిమోన్ కర్ బాబా గురించి మరచిపోయాడు. అలాంటి సమయంలో ఒక ఫకీరు బిక్ష నిమిత్తం వచ్చాడు. ఎవరో చూసి బయట ఒక స్తంబం దగ్గర కూర్చుండబెట్టి భోజనం పెట్టారు. ఎక్కడయితే ఆ ఫకీరు కూర్చున్నాడో అక్కడ నిమోన్ కర్ తనచెప్పులను ఉంచాడు.

కొన్నాళ్లతర్వాత నిమోన్ కర్ షిరిడి వెళ్లి బాబా వివాహానికి రాలేదన్ననిరాశతో బాబాని దర్శించుకున్నాడు. “నేను వివాహాని కి వచ్చాను. నాకు బయట వున్న స్థంభం దగ్గర భోజనం పెట్టారు” అని బాబా చెప్పడం తో నిర్ఘాంతపోయిన నిమోన్ కర్ కన్నీరుమున్నీరయి బాబా పాదాలమీద పడి క్షమాపణలు వేడుకున్నాడు.

నానా సాహిబ్ నిమోన్ కర్ కి, బాబా ఋషులు ధరించేటటువంటి కఱ్ఱ పాదుకలు (ఖడావ్) 1898 లో ప్రసాదించారు. నానా సాహిబ్ తన గృహంలో పూజాదికాలు జరిపేవారు. ఇప్పటికీ నిమోన్ కర్ 4వ తరం వారసులు పూజాదికాలనాచరిస్తూ వున్నారు.

నందకుమార్ రేవన్నాధ్ దేశ్ పాండే 4వ తరం వారసుని గా అదే గృహంలో వుంటూ సేవ చేసుకుంటున్నారు. షిరిడికి 35 కిలోమీటర్ల దూరంలో వున్న ’గురుపాదుకాస్థాన్’ ని భక్తులు దర్శించుకోవచ్చు.

నందకుమార్ గారి ఫోన్ నంబరు: +919922060733. ప్రతి సాయంకాలం ’సాయినాధ స్థవన మంజరి’ పఠిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్న నందకుమార్ కుటుంబీకులు చరితార్దులు.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles