మతాలకన్నా మానవత్వం గొప్పదని చాటిచెప్పేందుకు ప్రకటమైనదే సాయి అవతారం ..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఓం సర్వమత సమ్మతాయనమః “

మతాలు , ఆ మతాలలో ఆచార , సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చుకానీ , మతాలను ఆదరించి , అనుసరించేది , తెలివిగల జన్మ అని గొప్పలుచెప్పుకొనే మనుషులేతప్ప , మరేయితర జీవరాశికి ఒక మతం , జాతి , కులాలు అని తమకు నిర్ధేశించిన గీటుదాటి ప్రవర్తించిన సంఘటన , అనాదినుండి చరిత్రలో ఎక్కడా కనబడదు ..

పుట్టగానే మొదట మనిషి ఏడ్చేది ఆకలితోనే ..

సృష్టి ఆవిర్భావంలో , తొలుత మనిషి , మృగాలు కూడా జీవన విధానం ఇల్లూ , వాకిలి అన్న అవగాహనలేని రోజుల్లో ఆకలికి వేటాడం తొనే అన్వేషణ మొదలయి ఉండొచ్చు ..

అప్పటినుండి , ఇప్పటివరకూ , ఎప్పటికి కూడా మనిషిలోతప్ప మిగతా జీవుల జీవనశైలి ఎన్నటికి మార్పురాదు..

కూడూ , గుడ్డా , నీడ ఇవి మనిషికి ప్రదానంగా ఉండవలసినఅవసరాలు .. అంతకుమించి , పాటుపడేవన్నీ అదనపు సౌకర్యాలను అనుభవించడం కోసమే ..

కాలానుగుణంగా , మనిషికి అవగాహన ఎదిగేకొద్దీ , తన చుట్టూ ఉన్న ప్రకృతికి మూలం , అజ్ఞాతంగా ఉండి ఆడిస్తోందని గ్రహించి ఉండవొచ్చు ..

సృష్టికి మూలమేదో అన్వేషించే ప్రయత్నం మొదలయి ఉండవొచ్చు ..

ఏదో మూలాంగా మొత్తానికి అతీతమైన శక్తి ఒకటుందని , థానిని ఆరాధించే ప్రక్రియ ప్రారంభమైఉండొచ్చు ..

సంసారం అన్నపదం ఒకటే అయినా ఒక సంసారంలో ఉన్నపద్ధతులు ప్రక్కసంసారంలో లేనట్టు , మనిషి ఆరాధనాపద్ధతుల్లో , మతాలు పుట్టుకొని ఉండివుండవొచ్చు , ఒక పార్టీలోని వారే మరొ పార్టీని స్థాపించే నేటి రాజకీయ వ్యవస్థలా ..

ఏ మతాన్ని ఎవరు ఆశ్రయించిన మతాలలోని సారం , తననుతాను తెలుసుకుని , నియమానుసారం మనిషి తన జన్మను సార్ధపరుచుకొనేందుకే అవి అందించబడ్డాయి.

మతాల మీద అవగాహనకొరవడి , ఆంతర్యాలను పక్కనబెట్టి , నా మతమే గొప్పదని మతమౌఢ్యాలు మొదలైనప్పుడు అవే మతానికి , మతానికి మద్య అడ్డుగోడలై నిలుస్తాయి .

రెచ్చిపోతున్న మత మౌడ్యాన్ని అరికట్టి , మతాలకన్నా మానవత్వం గొప్పదని , చాటిచెప్పేందుకు ప్రకటమైనదే సాయి అవతారం ..

ఆ మసీదుపైనే హిందూ చిహ్నంగా కాషాయం జండాను కట్టారు ..

రామ జన్మ ఉత్సవాలు జరిగాయి , మత సామరస్యాన్ని చాటుకొంటూ అదే మసీదులో ముస్లీములు ఛందనోత్సవాన్ని ఆయన సమక్షంలోనే నిర్విహించుకొన్నారు ..

ఎవరి ఆచారాలకు అడ్డుకట్ట వేయలేదాయన ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించక , అందరూ ఒకరినొకరు గౌరవించుకొని , మానవత్వాన్ని చాటుకోడమే ఆయన లోకానికి అందించిన తత్వంలోని సారాంశం అని నా ప్రఘాఢమైన భావన ..

అందుకు బిన్నంగా ప్రచారాలు మొదలయితే , ఆయన ప్రబోధించిన ఏకత్వం మరల భిన్నత్వానికి దారితీయకతప్పదని పెద్దలమాట ..

శ్రీ సాయి గురుభ్యోనమః
*** 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles