Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
ఎవరి పంతాలు వారు నెగ్గించుకునేప్రయత్నంలో , సదవగాహనకు తావెక్కడుంటుంది , అహంకారంతప్ప.
**
నదులు ఎన్నున్నా , పవిత్రమైన గంగానదితో అవి ఎన్నటికి పోటీపడలేవు ..
స్థాయినిమరచి నేను గురువునంటూ , ఎంత లోకం వెంటపడిన, వాడు సద్గురువుతో సమానంగా ఎన్నటికి ఎదగలేడు ….
పూర్వం ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంభాలు ఎక్కువగా ఉండేవి ..
కుటుంభ బాధ్యతంతా ఆ ఇంటి యజమానిదే , కాలానుగుణంగా పెళ్ళిళ్ళై ఇంటి సభ్యులు పెరుగుతున్నా , సంక్రమించిన ఆస్థులవలన , వారివారి వృత్తుల ఆదాయవనరులు అంతా ఇంటి పెద్ద పెత్తనంలో గడిపోతూండేవి.
ప్రస్తుతకాలం అలాంటి కుటుంబాలు చెప్పుకొనేందుకు గత చరిత్రలుగా నిలిచిపోయాయితప్ప , వెతికి చూస్తామన్నా కలిసి ఉమ్మడిగా ఉన్నవారు ఎక్కడా కనిపించరు ..
ఒకవేళ అలాంటి కుటుంభం అంటూ ఒకటి కంటబడితే అదో అద్భుత విషయంగా వార్తకెక్కే రోజులివి ..
అలాంటి కుటుంబాలలో కూడా వ్యక్తిగతంగా ఎవరి భావాలు వారికున్న తీరికగా కూర్చుని , సావధానంగా భావాలను వ్యక్తీకరించుకొంటూ ఒక అభిప్రాయాన్ని వొచ్చేవారు తప్ప వీధి పోరాటాలకు దిగేవారుకాదు ..
ఎవరి పంతం వారి నెగ్గించుకొనే ప్రయత్నంలో ఆ ఉమ్మడికుటుంబాలే చీలిపోయాయి వాటాలపేరుతో ఆస్తులుకూడా క్షీణించిపోయాయి ..
ఆస్తులు పోయినా , ఆర్ధికంగాచితికిపోయి అష్టకష్టాలు పడేవాడుకూడా , మళ్లీ కోలుకొని పూర్వవైభవాన్ని పొందిన వాళ్లు లోకంలో ఎందరో కంటబడుతుంటారు.
వ్యవస్థలో మాటతప్పినా , నీచంగా ప్రవర్తించి గౌరవ,మన్ననలు పోగొట్టుకొన్నా , తిరిగి ఆ మచ్చను సరిదిద్దుకొనేందుకు ఎన్ని అగచాట్లుపడినా , లోకాన్ని మెప్పించి పునర్వైభవాన్ని పొందడానికి , విశ్వామిత్రునిలా ఘోర తపస్సుచేసినా సాధ్యంకాకపోవొచ్చు ..
ఆద్యాత్మిక మార్గంకూడా ఉమ్మడికుటుంభాలలాంటివే …
కుటుంబానికి ఒక పెద్దలాగా , ఆద్యాత్మిక మార్గంలో మనిషి సాధనాభిరుచిబట్టి అనేక విధానాలు , ఎందరో సద్గురులు ప్రకటమౌతుంటారు.
ఒక తత్వాన్ని ఆశ్రయిస్తె , ఆ తత్వాన్ని ప్రబోధించిన సద్గురువే యజమానిగా గౌరవించినపుడు , ఉమ్మడిగా అనుసరించే , భక్తుల మనోభావాలు కూడా ఒకే మార్గాన్ని ఆదరించి సత్ఫలితాన్ని పొందగలరు ..
ఎదిగి , ఎదగని అవగాహనతో , ఎవరికి వారే పెద్దలమంటూ , ఎవరిపంధాలో వారు వ్యవహరిస్తే , అది ఆశ్రయించిన సద్గురువును , ఆదరిస్తున్న తత్వాన్నికూడా నిరాదరణకు గురిచేసినవారుకాగలరని పెద్దలమాట ..
శ్రీ గురుభ్యోనమః
**
Latest Miracles:
- అబ్దుల్లా తన శిష్యుడు కాదు. బాబా శిష్యుడు. ఎవరి శిష్యులు వారి దగ్గరే ఉండాలి.
- సొంత ఇంటి కోర్కెను తీర్చిన బాబా వారు.
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- భర్త చనిపోయి కష్టములొ ఉన్న భక్తురాలికి, పని నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పించిన బాబా వారు…..
- సరిగ్గా నెలకే!…..సాయి@366 నవంబర్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments