ఒకసారి శరణు వేడిన చాలును!…..సాయి@366 మే 6….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs.Jeevani


నల్ల మస్తాన్‌ గారు గుంటూరుకు వచ్చిన తొలి దినాలలో ఒక రోజున ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా వాన కురవసాగింది.

విశేషమేమిటంటే ధ్యానం చేస్తున్న మస్తాన్‌ గారి ఇంటిపై  ఒక వర్షపుచుక్క కూడ పకపోవటం. ఇంతలో పిడుగు పడి ఒక మేక పిల్ల, ఒక మనిషి మరణించారు.

వర్షం తగ్గింది. మస్తాన్‌ గారు సమాధి నుండి లేవగానే మరణించిన మేకపిల్ల కనిపించింది.

ఆయన దానివద్ద కూర్చొని, భగవధ్యానం చేసి, దాని చుట్టూ ముమ్మారు తిరిగి ”ఉఠో” అన్నారు. ఆ మేకపిల్ల లేచి మస్తాన్‌ గారి పాదాల సందునుండి దూరి వెళ్ళిపోయింది.

ఈ వార్త ఊరంతా వ్యాపించగా పిడుగుపాటుతో మరణించిన వ్యక్తి తల్లి వచ్చి, మస్తాన్‌ గారి పాదాలను పట్టుకుని వల, వల దుఃఖించింది. కరుణా సముద్రుడు ఆ తల్లి దుఃఖం చూడలేకపోయాడు.

శవం వద్దకు పోయి దైవ ధ్యానం చేసి, శరీరాన్ని తాకాడు. వెంటనే విగత జీవికి ప్రాణం వచ్చింది. లేచి కూర్చున్నాడు. సంగతి గ్రహించి మస్తాన్‌ గారి పాదాలపై పడ్డాడు.

మహనీయుల కరుణకు పాత్రమైన ఏ జీవి అయినా అదృష్టవంతులే, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు.

షిరిడీలోని ద్వారకామాయిలో కొలువై ఉన్న సాయి ఇందుకు భిన్నుడు కాదు.

అది 1917వ సంవత్సరం. వైశాఖ మాసం (మే నెల). ఎండలు మండిపోతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

ఒక పిచ్చి కుక్కచే కరవబడిన ఒక చిన్ని కుక్క, పెద్ద, పెద్ద కుక్కలను తరుముతోంది షిరిడీలో.

ఆ గ్రామస్తులు కర్రలతో ఆ చిన్ని కుక్క వెంటబడ్డారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే నానుడి జంతువులకు కూడా వర్తిస్తుంది. అది ద్వారకామాయిలోనికి పరుగు తీసింది.

గ్రామస్తులందరు అది బయటకు వస్తే చంపటానికని బయట నిలబడి ‘‘బాబా! ఆ కుక్క పిచ్చిది. వెలుపలకు తరమండి, దానిని చంపెదము” అనగా,

సాయి బాబా ”పిచ్చివారలారా! దూరంగా పొండు. దిక్కులేని ఈ చిన్న జీవిని చంపదలచినారా.” అన్నాడు. ఆ జీవి రక్షణ పొందింది. అంతియే కాదు దాని పిచ్చి కూడా మటుమాయమైంది.

సాయినాథుని పాదధూళితో పరమ పావనమైన ద్వారకామాయిని శరణు వేడిన వారికి ఆపదలు ఆమడ దూరం పోతాయి.

సాయి రక్షణ పొందిన చాలు – భీతికి తావు ఉండదు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles