నా పిల్లలను ఉపవాసం ఉండనిస్తానా? వారు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకుంటానా?—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-33-Upavasam-by-Lakshmi-Prasanna 4:35

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నేను రమణి కోడూరు మీకు తెలుసుగా ఇంతకు ముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను.

“నా పిల్లలను ఉపవాసం ఉండనిస్తానా? వారు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకుంటానా?” అన్న బాబా మాటలు అక్షర సత్యాలని నిరూపించే లీల ఒకటి నా జీవితంలో జరిగింది. 

ఆ అనుభవాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను.

2006 మే 2న హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో వున్నా బాబా టెంపుల్ ఎదురుగా వున్నా భావన వివాహ వేదికలో కొత్తగా జాబ్ లో చేరాను.

ప్రతి రోజూ ఎంతోమంది బాబాను దర్శించి బాబా అన్న ప్రసాదం తిని వెళ్తున్నారు. కానీ నేను ఎంత అనుకున్న గుడిలో భోజనం చేయాలంటే 30 నిముషాలు వెయిట్ చేసి మధ్యాహ్న హారతి తర్వాత పెడతారు.

ఆ టైం కి ప్రసాదంకి వెళదామంటే అదే టైంకి ఎవరో ఒకరు పెళ్లి సంబంధాల కోసం వచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోయాక చూస్తే భోజనం టైం దాటిపోయేది.


అయ్యో బాబా నీ ప్రసాదం నాకు ప్రాప్తం లేదా? లేక ఇంకా నీ అనుగ్రహానికి సమయం రాలేదా? అని బాబాను ప్రశ్నించేదాన్ని. కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆరోజు బాబా గుడిలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకోదలచినవారు 250 రూపాయలు కట్టి టికెట్ బుక్ చేసుకోమన్నారు .
సత్య నారాయణ స్వామి వ్రతం చేస్తే అనగా మొక్కు తీర్చుకుంటే సగం చిక్కులు పోతాయి అని బాబా ఇదివరకు ఇచ్చిన సూచనా గుర్తొచ్చింది.
సరే నేను ఆ వ్రతం చేసుకొని పౌర్ణమి కాబట్టి ఉపవాసం వుండాలనుకున్నాను. పూజ, పుణ్యం కలిసొస్తాయని వ్రతానికి సిధ్ధాపడ్డాను.

ఆ రోజు రాణే వచ్చింది, వ్రతం చేశామందరం. వ్రతం పూర్తయినాక ప్రత్యేకమైన షడ్రసోపేతమైన బాబా ప్రసాదం వ్రతం చేసుకున్న వారికీ కేటాయించారు. 
అది విని నేను సందేహంలో పడ్డాను. నేను ఎప్పుడూ ఉపవాసాలు చెయ్యలేను. చేసేవాళ్ళని చూస్తే నాక్కూడా చేయాలనిపించింది కాని చేయలేకపోయేదాన్ని. 
కానీ కార్తీక పౌర్ణమి నాడు ఖఛ్చితంగా ఉపవాసం ఉండాలని తీర్మానించుకున్నాను.
కానీ ఇంతవరకు ఎదురు చుసిన బాబా ప్రసాదం ఆ రోజు ప్రాప్తించింది. తిని మాట మీద నిలబడలేదని బాబా నన్ను కోప్పడతారేమో,
తినక పొతే ప్రసాదాన్ని తిరస్కరించినందుకు బాబా నన్ను విడిచిపెట్టేస్తారేమో అని భయం అని నాలో నేను ఆలోచిస్తున్నాను.
అప్పుడు మా అబ్బాయి ఒక మాట అన్నాడు. అమ్మ ప్రసాదం కోసం ఇన్నాళ్లు ఎదురు చూసావు ఇప్పుడు చూడు స్వీట్ హాట్ తో పంచ భక్ష్య పరమాన్నాలు పెడుతున్నాడు బాబా. బాబా అనుగ్రహాన్ని అందుకో! అన్నాడు.
అంతే బాబాయే మా  అబ్బాయి రూపంలో చెప్తున్నారని మరేమీ ఆలోచించుకోకుండా తినేసాను.

తర్వాత బాబాను “ఏమిటి బాబా నన్నెందుకు ఉపవాసం ఉండనివ్వలేదు? ఎదురు చూస్తున్న ప్రసాదం ఆ రోజే ఇవ్వాలా?” అని ప్రశ్నించాను. 
వెంటనే బాబా “ఏమి తినకుండా పస్తులున్న రోజులన్నీ ఉపవాసాలాని లెక్క వేసుకో!” అన్నారు .

అప్పుడు గుర్తు వచ్చింది. శివ రాత్రికి మీరు ఉపవాసం చేయరా? అని ఒకప్పుడు ఒకావిడ నన్ను అడిగితే, మేము పస్తున్న రోజులన్నీ ఉపవాసాల క్రిందే లెక్క అన్నాను. 
అదే మాటను బాబా ఖరారు చేసారు.
అప్పటి నుండి ఇప్పటిదాకా మాకు పస్తులుండే అవసరం రాలేదు.

సాయి బంధువులారా మనందరమూ సాయి భక్తి అనే పేగుతో కలపబడి వున్నాము. మనకు అమ్మ సాయి నాధుడే. సాయికి మనమెపుడూ చిన్న పిల్లలమే. పిల్లలు ఆకలితో ఉంటే అమ్మ ఊరుకుంటుందా?
మన మాతృ సాయి కి భక్తితో తృప్తి ప్రణామాలు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles