నన్ను శరణుజొచ్చు వారిని రక్షించుటయే నా కర్తవ్యం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-32-Rakshinchuta-by-Lakshmi-Prasanna 2:09

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

“షరాన్ మజా అల్లా ఆని వయ గెల దఖావా దఖావా ఐసా కోని”

నన్ను ఆశ్రయించు వారిని, శరణుజొచ్చు వారిని రక్షించుటయే నా కర్తవ్యం

(సాయిబాబా యొక్క 11 వాగ్ధనములలో ఒకటి)

బొంబాయిలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక సంస్థలో పనిచేసే క్యాషియర్ ఒక ప్రణాళికతో పెద్ద మొత్తంలో డబ్బును అపహరించాడు. అతను ఆ ప్రణాళిక ప్రకారం షిరిడికి వెళ్లి బాబా ఆశ్రయం కోరుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే అతను సరిగ్గా అలానే చేశాడు.

అతని అరెస్టు కోసం ఒక వారెంట్ దాఖలు చేసారు. సంస్థ మేనేజర్ వారెంట్ అమలు చేయించి న్యాయ విచారణ కోసం అపరాధిని తీసుకోని రావలసినదిగా కోరారు. మేనేజర్ బాబా భక్తుడు. అతను సమీపంలోని అన్ని స్థలాలలోను శ్రద్ధగా శోధించాడు, అయితే దోషిని గుర్తించలేకపోయాడు. నిరాశకు గురైన అతడు దోషిని వెతికే పని విడిచిపెట్టే ముందు షిర్డీ వెళ్ళి బాబా ముందు ఆ సమస్యను పెట్టాలని అనుకున్నాడు.

అందువలన అతను షిర్డీ వెళ్లి  బాబా దర్శనం కోసం  ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ బాబా పాదాలను కడిగి పూజిస్తున్న క్యాషియర్ ని ఆశ్చర్యకరంగా చూశాడు. మేనేజర్ ని చూసిన క్యాషియర్ తన తెలివితేటలు కట్టిపెట్టి బాబా ముందు సాష్టాంగపడి తనని రక్షించమని వేడుకున్నాడు.

మేనేజర్ తో కలిసి బొంబాయికి వెళ్ళమని బాబా సలహా ఇచ్చారు. మరియు నేరాన్ని అంగీకరిస్తూ, చేసిన తప్పుకు క్షమాపణలు కోరమని కూడా బాబా చెప్పారు. క్యాషియర్ బాబా చెప్పినట్లుగా చేసాడు. అందువలన క్యాషియర్ నేర విచారణ నుండి రక్షించబడ్డాడు. సంస్థ ఆ వ్యవహారాన్ని సమర్ధవంతంగా పరిష్కరించినందుకు మేనేజరుకు ధన్యవాదాలు తెలియజేసింది.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles