Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి లీలలు – సమాధి పూర్వం జరిగినా, సమాధి అనంతరం జరిగినా ఒకటిగానే ఉంటాయి. ఏదో ఒక ఉదాత్త లక్షణాన్ని అలవరచుకోమంటాయి భక్తులను.
శ్రీ ఏ. వీరయ్య గారు హైదరాబాదులో నివసించే సాయి భక్తుడు. పబ్లిక్ సెక్టారులో ఆఫీసరు హోదాలో పని చేస్తున్నాడు.
రష్యాకు ఇంజినీర్లను ఆయన 10 మార్చి కల్లా పంపవలసి ఉన్నది. అందుకొరకు ఢిల్లీలోని వారితో మాట్లాడుతూనే ఉన్నాడు.
సాయి భక్తుడు కనుక సాయిని ప్రార్ధించి ఢిల్లీ బయలుదేరాడు. ఆయన ఢిల్లీకి వెళ్లటం మొదిసారి. గెస్టు హౌస్ లో వసతి దొరికింది. ఇదంతా సాయి కరుణే అనుకున్నాడు 25 ఫిబ్రవరిన.
రష్యా ఎంబసీకి వెళ్ళాడు. పనులన్నీ చక చక జరిగాయి. రెండవ తేది మార్చినాడు వచ్చి, ఆ ఇంజినీర్ల వీసాలు తీసుకు వెళ్లండి అని చెప్పారు.
ఈలోగా తన తండ్రి గారికి పిండ ప్రదానం చేద్దామనే తలంపు వచ్చింది.
భాష రాకున్నా బస్సు ఎక్కి హరిద్వార్ చేరాడు. ఎవరో ఒక పురోహితుడు వెతుక్కుంటూ వచ్చినట్టుగా వచ్చాడు.
ఆ పురోహితుడే పిండ ప్రదానం ఏర్పాట్లు అతి చవకగానూ, చక్కగానూ చేశాడు. అన్ని పనులు తన చాకచక్యంతోనే జరిగాయని భావించి సాయిని విస్మరించాడు.
నామ స్మరణ చేయలేదు, ఊది ధరించలేదు. ఇదంతా అహంభావం. సాయిని చిన్న చూపు చూడటం కాదు.
ఏది ఏమైనా అహం భావం ఆయనలో పొరవలె కప్పింది. 2వ తారీకున ఎంబసీకి వెళ్ళాడు.
ఆఫీసరు ఇతనిని కలిసేందుకు కూడ అనుమతించ లేదు. తన పని పూర్తి అవ్వటానికి ఇంకా ఎంతో కాలం పట్టేట్టు కనిపించింది.
చివరకు బసకు చేరగానే సాయినాధుడు మనసులో మెదిలాడు. తాను సాయిని మరవటం గతంలో తన గొప్పదనాన్ని చిత్రించుకోవటం ఎంత తప్పో తెలిసి వచ్చింది.
సాయిని స్మరిస్తూ మరునాడు ఎంబసీకి వెళ్ళాడు. ఆ రోజూ అదే తంతు. కాని, నిన్నటికి ఇప్పటికి తేడా ఉన్నది.
నిన్న ‘తాను’ భయపడ్డాడు. నేడు సాయి రక్ష తనకున్నదని గ్రహించాడు. రేపు రమ్మన్నారు మరల.
ఆ రోజు కూడ అదే తంతు కావచ్చు. వీసాలతో 5వ తేదీన హైదరాబాదులో ఉండాలి.
ఆ రోజు ఆఫీసు మూసే ముందు ఎవరో కలసి అతని సమస్యను తెలుసుకొని కొన్ని క్షణాలలోనే అతని పని పూర్తి చేసి పెట్టాడు.
ముందుగా అనుకున్నట్టు గానే వీసాలతో 5వ తేదీని హైదరాబాదు చేరాడు.
మాయ మనలను ఏమార్చకుండునట్లు సాయిని మనం మనసార ప్రార్ధిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సాయీ రమణీయం….. సాయి@366 మార్చి 3….Audio
- రాలిన నక్షత్రం!…..సాయి@366 మార్చి 19….Audio
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
- ఒకరు భక్తులైతే చాలు …..సాయి@366 మార్చి 20….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments