Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాకు డిగీ పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగం రావటం లేదు.
ఆ సమయంలో నా మిత్రుడు “అరేయ్ ప్రమోద్ ఎందుకురా అంత బాధ పడతావు, బాబా ఉండగా ఎందుకురా అంత ఇదవుతావు.
ఇదిగో పుస్తకం చూడు “శ్రీ సాయి సచ్చరిత్ర, ఆయన జీవిత చరిత్ర పారాయణ 15 రోజులు చేయి’ అని ఒక పుస్తకం నాకు తెచ్చి ఇచ్చాడు. అది ‘ఎక్కిరాల భరద్వాజ’ గారు వ్రాసినది.
అది వాడి దగరనుండి తీసుకుని ఒక గురువారం నాడు భక్తిగా బాబాకి దండం పెట్టుకొని ఈ విధంగా ప్రార్ధించాను
“బాబా నాకు ఉద్యోగం రావాలి అదీ ఎలాగంటే నేను ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళకూడదు, నా సర్షిఫికెట్స్ ఎక్కడా చూపించకూడదు, మానేసే పరిస్థితి రాకూడదు”అని అనుకున్నాను.
పారాయణ మొదలు పెట్టాను: 15 రోజులు పూర్తి అయ్యాయి. ఆ రోజు పారాయణ ఉదయాన్నే పూర్తి చేసుకున్నాను.
అమెజాన్ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని పేపర్ లో పడితే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను,
దారిలో మా అత్తయ్య గారి అబ్బాయి కనబడి ప్రమోద్ ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడిగాడు, “నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను” అని చెప్పాను.
“ఇంటర్వ్యూనా? ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు, రా ముందు బండి ఎక్కు ఏ ఇంటర్వ్యూలు లేకుండా నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను”, అని బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు.
వాళ్ళ బాస్ కి పరిచయం చేశాడు. వీడు మావాడే ఇవాళ నుండి ఉద్యోగంలో చేరతాడు”అని చెప్పాడు. మా బావ, వాళ్ళ బాస్ ఫ్రెండ్లీ గా వుంటారు.
‘సరే అలాగే చేరి పొమ్మను’ అన్నాడాయన, అంతే నేను వెంటనే ఉద్యోగంలో చేరిపోయాను.
నేను బాబాని కోరుకున్నట్లుగా ఏ ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్స్ ఎవరూ చూడకుండా నాకు ఉద్యోగం రావాలి అనుకున్నందుకు అలాగే జరిగింది.
వాళ్ళు నాకు 6000/- రూపాయలు జీతం ఇచ్చారు. అది (వాసూ గ్రూప్ కంపెనీ)
మా వైదేహినగర్ ‘సాయిబాబా’ గుడిలో నేనే హారతి పాట పాడతాను. గురువారం తప్ప, మిగతా రోజులలో నా చేతనే హారతి పాటలు పాడించేవారు.
మా గుడిలో ప్రతీ పౌర్ణమికి ‘శీ సత్యనారాయణ స్వామీ” వ్రతాలు చేస్తారు. ఆరోజు కార్తీక పౌర్ణమి ఎప్పటిలాగే వ్రతం చేశారు.
దాదాపు 300 మంది వచ్చారు. మైకు లేదు. ఆ రోజు నన్నే మద్యాహ్న హారతి పాట పాడమన్నారు. నేను పాడటం మొదలు పెట్టాను.
ఆ హారతిలో నేను “జయదేవ జయదేవ అనే చరణం మొత్తం పాడకుండా “శిరిడి మాఝే పండరీపుర” పాడేసాను.
జనం ఎక్కువగా వున్నారని కంగారు పడ్డానో ఏమో మరి ఏం జరిగిందో నాకు తెలియదు. హారతి అంతా అయిన తర్వాత ఒక అంటీ నాకీ విషయం చెప్పింది,
‘జయదేవ పాడలేదని. నేను చాలా భాదపడ్డాను. ఎప్పుడూ ఇలా జరగలేదు, ఎప్పుడూ ఎంతో శ్రద్దగా పాడే నాకెందుకిలా అయ్యిందో అర్ధం కాలేదు.
బాబాకు హారతులు చాలా ముఖ్యం, చాలా పవర్ కూడాను, భాదతో పాటు భయంకూడా వేసింది. ఇలా నేను తప్పు పాడినందుకు నాకేమైనా అవుతుందా? అని గుడిలో ఒక పెద్ద పూజారిగారు వుంటారు, ఆయన్ని అడిగాను.
‘అయ్యగారు హారతి పాట ఇలా తప్పు పాడాను, నాకేమైనా అవుతుందా?” అని. ‘ఏం కాదులే జనం ఉండబట్టి తడబడి ఉంటావు, ఏం కాదు ఇంటికి పోరా ప్రమోద్” అన్నారు.
సరేనని ఇంటి దారి పట్టాను. నాతో పాటు సాయి (మా స్నేహితుడు) కూడా ఇంటిదాకా వచ్చాడు. దారిలో మేమిద్దరం హారతి పాట తప్పు పాడటం గురించే మాట్లాడుకుంటూ ఇల్లు చేరాము.
ఇంట్లోకి వెడుతూనే నేను కుర్చీలో కూలబడి పోయాను. సాయి “ఒరే ప్రమోద్ దాహంగా ఉందిరా” అంటూ తానే వంట గదివైపు మంచి నీళ్ళ కోసం వెళ్ళాడు.
వంట గదికి వెళ్ళాలంటే మద్యలో పూజామందిరం వుంది, పూజగది దాటుతూ మళ్ళీ అడుగువెనక్కి వేసి పూజమందిరంలోకి ఓ నిముషం తొంగి చూసి ‘ఒరేయ్ ప్రమోద్” అని పిలిచాడు.
నేను అక్కడనుండి లేవకుండానే “ఏంటిరా” అన్నాను. “ఒరేయ్ ఇలా రారా ఓసారి” అన్నాడు. సరే అని లేచి వెళ్ళాను.
“చూడు పూజా గదిలో బాబా ఫోటో వెనక్కి పెట్టి వుంది. అందుకే నువ్వు ఈ రోజు హారతి పాట అలా తప్పు పాడి ఉంటావు”, అన్నాడు.
అసలేం జరిగిందంటే ఇంట్లో మాతో పాటు మా నాన్నమ్మ కూడా వుంటుంది. ఆవిడ ప్రతి పౌర్ణమి కి దేవుడు సామాన్లు అన్నీ కడిగి దులిపి మళ్ళీ మందిరంలో పెడుతూంటుంది
ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఉదయం ఆవిడ అన్నీ తీసి పెట్టేసినట్టుంది. నేను వెంటనే ఆ బాబా ఫోటోని మామూలుగా తిప్పిపెట్టీ “బాబా తప్పు అయిపోయింది. నాయనమ్మ పెద్దది తెలియక అలా తిప్పి పెట్టి ఉంటుంది, క్షమించు అని బాబాని” వేడుకున్నాను.
అప్పుడు కాని నా మనసు కుదుటపడలేదు. ఈ విషయం తెలిసాక మద్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాల్సిన సాయి నాతో కూడా మా ఇంటికి రావటం, ఎంతో నిశితంగా చూస్తే కానీ ఆ ఫోటో విషయం తెలుసుకోవడం కష్టం,
అలాంటిది వాడికి ఆ ఫోటో మీద దృష్టి పడడం, అది తిప్పి ఉండడం, ఇది ఇలా ఉండబట్టే నువ్వు హారతి పాట ఈ రోజు తప్పు పాడివుంటావని చెప్పటం ఇదంతా బాబా లీల.
ఆ రోజు నుండి ఎప్పుడు ఇంటినుండి బయటకి వచ్చినప్పుడల్లా, బాబా ఫోటో సరిగా వుందా లేదా అని చూడటం అలవాటుగా మారిపోయింది.
The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla
Latest Miracles:
- ఆరతి పాడాలి అని కోరుకున్న ప్రతిసారి, భక్తుని కోరికను నెరవేర్చుతున్న బాబా వారు.
- భక్తునికి ఇష్టమైన దానిని ఇచ్చినట్లే ఇచ్చి, దానిలో కష్టం ఉన్నదని తెలియజేసిన బాబా వారు.
- నిజ దర్శన ప్రాప్తి … కోవా అడిగిన బాబా
- నాతో కుంటాట ఆడి నా నడుము నొప్పి ని బాగు చేసిన బాబా వారు …..!
- పెండ్లి కావటం లేదు అని భాదపడుతున్న భక్తురాలికి, కలలో కనిపించి అభయం ఇచ్చిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments