నా కోరిక ప్రకారం బాబా వారి వెన్నముద్ద ప్రసాదాన్ని గురువుగారు నాకు ప్రసాదించారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

గురువుగారి దయ వలన మేము కాలిఫోర్నియా,అమెరికా లో జీవిస్తున్నాము.

గత 3-4 వారాలుగా నేను చక్కెర తినకూడదని,శిరిడి వచ్చి బాబా,గురువుగారి ప్రసాద రూపంగా స్వీకరించాలని ఆశించాను.

నేరుగా ముంబాయి లో దిగి శిరిడీ కి తెల్లవారుఝామున 5 గంటలకు చేరాను.

అప్పుడే అమ్మగారు మందిరానికి వెళ్ళారని తెలిసింది.బాబా ధూళీ దర్శనం చేసుకొని గురువుగారి సమాధి వద్ద ప్రదక్షణాలు చేయడం ప్రారంభించాను.

నా ప్లాన్ ప్రకారం నేను శిరిడీలో ఆరోజు సాయంత్రం బయలుదేరవలసి ఉంది.నా కోరికల్లా ఏదైన తీపి ప్రసాదం అందాలని ప్రదక్షణాలు చేసుకుంటూ గురువుగారిని మనస్సులో ఆయన బాబా వెన్నముద్దగాని లేదా గురువుగారి ఇంటి నుండి తీపి పదార్ధం కాని ప్రసాదంగా అందాలని ఆశించాను.

ఎక్కువ మంది గురుబంధువులు లేకపోవడం వల్ల మందిరం నుండి వెన్న వచ్చే ప్రశక్తి లేదనుకున్నాను.

తరువాత గురువుగారి సమాధి వద్ద ప్రార్థించి,గురుచరణ్ దగ్గర అమ్మగారికి నమస్కరించి ఛౌల్ట్రీకి ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్ లో కాఫీ షుగర్ లేకుండా ఆర్డర్ చేసి త్రాగుతున్నాను.

ఇంతలో గురువుగారి ఇంటివద్ద ఉండే తాత వెన్న(బాబా మందిర ప్రసాదం)వేలిపై తీసుకొని వేరే గురుబంధువు కి ఇస్తున్నారు.

చూసి పరుగున వెళ్లి నేను కొంత తీసుకున్నాను.ఆశ్చర్యంతో తాతని ఆ వెన్నముద్ద తనకెక్కడిది అని అడిగాను.ఆయన వేరే సాయి బంధువు మందిరం నుండి తీసుకువచ్చాడని చెప్పడం నన్ను ఆనందంతో చిందులు వేసేలా చేసింది.

ఇది ఎంతో చిన్న అనుభవంగా వున్నా గురువుగారి సమాధివద్ద అడిగిన మరుక్షణం నాకు అంతగా తెలియని బాబా భక్తుల ద్వారా నా చిన్న కోరికను తీర్చడం మరొకసారి ఆయన వెన్నంటి ఉండి చూస్తున్నారని ఋజువు చేసింది.

In love with Baba & Babuji

KIRAN,USA.,Indian Member Till Dec 3rd.

Cell:8019862321

Date:27th,October 2011

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles