గురువుగారు అనుగ్రహించిన బాబా.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

సద్గురు ప్రేమామృత తరంగాలు.

పూజ్యులు గురువుగారి పాదపద్మములకు సాష్టాంగనమస్కారములు సమర్పిస్తూ వారు ప్రసాదించిన దివ్య అనుభవమును గురుబంధువులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

గురువుగారి పార్థివ శరీరాన్ని శిరిడీ పొలిమేరలకు తీసుకొని వచ్చినప్పుడు వారికి స్వాగతమిచ్చేందుకు సాయియానా నుండి సాయినామసంకీర్తన చేసుకొంటూ వెళ్ళిన గురుబంధువులతో నేను ఉన్నాను.

పొలిమేరల నుండి గురువుగారిని తీసుకొని కొంత దూరం వచ్చిన తర్వాత నేను ఏడుస్తూ నాయనా – “నాకు ఆరోగ్యము బాగలేకపోయినా తమ దర్శనానికి  శిరిడీ తీసుకొని వచ్చారు అని ఏడుస్తూ కొద్ది దూరం పోయిన తర్వాత దారిలో బాబా ” విగ్రహం వుంటుంది తీసుకో “ అన్న గురువుగారి మాటలు చెవుల దగ్గర వినపడ్డాయి.

నేను సాయిబాబా నామసంకీర్తన చేసుకొంటూ దారిలో చూస్తూ వస్తున్నాను.కొద్ది దూరం పోయిన తర్వాత దారిలో నాకు వినపడిన మాటల ప్రకారం “ బాబా ” విగ్రహం కనపడింది.విగ్రహం చేతికి తీసుకుందామని వంగి తీసుకోబోతుండగా ఇప్పుడు వద్దు.అక్కడే వుండనివ్వు ఒక గంట తర్వాత వచ్చి తెచ్చుకో” అన్న గురూజీ మాటలు వినపడ్డాయి.”

సాయియానాకి గురువుగారి పార్ధివశరీరాన్ని తీసుకొని వచ్చిన తరువాత ఒక గంట తరువాత నేను జరిగిన విషయమంతా మా వారితో చెప్పాను.

నేను,మా వారు సాయియానా నుండి,నేను బాబా విగ్రహము ఎక్కడ  చూసానో అక్కడికి పోయి చూడగా బాబా విగ్రహము అలాగే ఉండినది.“బాబా”ని  తీసుకొని  సంతోషంగా సాయి యానాకి వచ్చేశాము.

గురూజీ సమాధి మహోత్సవ కార్యక్రమములు అయిపోయిన తరువాత గురూజీ అనుగ్రహించిన బాబాని ఊరికి తీసుకొని పోయి పూజించుకుంటున్నాను.

నాకు ఏదన్నా బాధవచ్చినప్పుడు బాబా విగ్రహం ముందర చెప్పుకొంటుoటే నాకు అక్కడ బాబా కనపడటం లేదు.గురువుగారి ముఖం మీద అమ్మగారు గుడ్డకప్పుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది.మా కుటుంబాన్ని ఎన్నో సమస్యల నుండి గురువుగారు కాపాడినారు.ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నారు.

పిలిస్తే పలికేదైవంగా గురూజీ ఇప్పటికీ ఎప్పటికీ పలుకుతూనే వుంటారు.

వారు చూపించిన ఆప్యాయత,ప్రేమ,కరుణ జీవితాంతం మరచిపోలేము.

మా కుటుంబాన్నే కాక ఎన్నో వేల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుతూనే వున్నారు.వారు ఎక్కడికి పోలేదు వారిని ప్రేమించే వారి చుట్టూ తిరుగుతూవారి యొక్క యోగక్షేమాలు చూస్తూనే వున్నారని అనుభవమైనది.

మీ పాదరేణువు..

సి.హెచ్. సాయికుమారి,

తెనాలి, సెల్: 9390091218

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles