Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి యిలా చెప్పారు. ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి, తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నాకేసి చూచి మీది సటనా గ్రామం గదా?’ అన్నారు! వారిని గురించి అడిగితే, రేపు రా చెబుతాను’ అన్నారు.
ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ మహరాజ్ కావచ్చని చెప్పి, మరురోజు ఆయనను చూడాలని ఆమె గూడ వచ్చింది. మరురోజు నేను, మా అమ్మ ఎంత వెదకినా ఆయన కన్పించలేదు.
మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నా కెదురై, ‘ఇలా ఎప్పుడూ చేయకు. ఎవరిని పిలిస్తే వారే రావాలి’ అని చెప్పి పూర్వం నుండి మా యింట పూజించ బడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ మహరాజ్ గారికి యిచ్చామనీ ఆయన మనవడి నుండి అవి మా తాతాగారికి లభించాయనీ చెప్పారు!
అంటే ఆ సాధువు వయస్సెంత? ‘ఈయనెవరు?’ అనుకోగానే ఆయన హిందీలో. “ఒక చెట్టున్నది. యిద్దరు దానిపైకెక్కారు. ఒకరు క్రిందకూ, ఒకరు పైకీ వెళ్ళారు! అని, నాలు అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సం||లు వున్నటున్నది స్తూలకాయుడు కౌపీనం మాత్రమే ధరించారు. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీఉద్ధవ మహరాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై, అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని విన్నాను.
చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు(ఉపాసని బాబా) ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి, అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర, జీర్ణశక్తి లోపించి, ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు యిల్లు విడచి వెళ్ళిపోయాడు.
నేను 1911వ సంవత్సరం లో అతనిని వెతకడానికి రైలులో వెళుతుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు భట్ కన్పించి, నేను వెళ్ళే పనిని గురించి విని, బాబాను తప్పక దర్శించమని చెప్పి, నన్నొక టాంగాలో తానే శిరిడీకి పంపాడు.
నేను మశీదులోకి వెళ్ళగానే, ధుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన, ‘ఖండోబా వద్దకు వెళ్ళు’ అని ఆదేశించారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెపుతున్నారని తలచి అందరు దేవుళ్ళూ తమలోనే ఉన్నారని, మీ దర్శనంతోనే నాకు తృప్తి కలిగిందని చెప్పాను.
కాని బాబా మళ్ళి , ‘ఖండోబా వద్దకు వెళ్ళు’ అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి, ఖంబోబా ఆలయంలో ఒకసాధువున్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే! అతడు, తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు.
నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదాకేల్కర్ కు ఇచ్చి మశిడుకి తిరిగి వచ్చాను. నేను మరల మశీదుకు చేరాక, సాయి అందరినీ దక్షిణ అడుగుతూ, నావైపు గూడా చేయి చాపి “దక్షిణ కుక్షిణ ఇస్తావా? అని అడిగారు. నా దగ్గర డబ్బు లేక, నమస్కారమే దక్షిణగా సమర్పించాను.
బాబా హిందీలో, “ఒక చెటున్నది. ఇద్దరు దానిపైకెక్కారు. ఒకరు క్రిందకూ, ఒకరు పైకీ వెళ్ళారు!’ అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తోచ్చాడు. ఈ యిద్దరికీ పోలికలున్నాయి. కాని శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా శిరిడీలోనే వున్నారు.
రెండవ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు చార్జీలకు సరిపోయే డబ్బులే ఉన్నాయని దక్షిణ ఇవ్వలేక పోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో నున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించినా మొత్తానికి దానిని వారికీ సమర్పించాను. వారు దానిని తీసుకోని పక్కనే ఉన్న ఒక పకీరుకు ఇచ్చారు.
తరువాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ “దీనివలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే!” అన్నారు. నేను వారికీ ఇచ్చింది బహుస్వల్పమని చెప్పి ఇంటికి బయలుదేరాను.
కోపర్ గావ్ మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడు నాతూ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను బాబాకు సమర్పించిన గడియారం గురించి మాట్లాడుతూ ఉండగా, అదే సమయంలో నాతూ సోదరుడు 60 రూపాయల విలువ చేసే బంగారు జేబు గడియారాన్ని నాకు కానుకగా పంపించారు. అప్పడు నాకు “దీనివలన నీవు పోగొట్టుకునేదేమీ ఉండదులే!” అని బాబా అన్న మాటలకూ అర్థం భోదపడింది. బాబా మాటలు ఏవి వ్యర్ధం కావు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాలకృష్ణ రామచంద్ర ఖైర్కర్
- About Upasani Baba—ఉపాసని బాబా–Audio
- నెల్లూరు వి.ఆర్.కాలేజీలో తెలుగు భాషా పండితుడిగా పనిచేసిన శ్రీ.డి.పిచ్చయ్య శాస్త్రి గారి ధర్మ పత్నికి బాబా దర్శనమిచ్చుట…Audio
- పూలమ్మగారిని షిరిడీ వెళ్ళమని బాబా వారు చెప్పుట
- బాబావారు పూలమ్మగారిని షిరిడి వెళ్ళమని చెప్పుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాలకృష్ణ ఉపాసని శాస్త్రి”
Sreenivas
May 18, 2017 at 5:56 amSai Baba…Sai Baba…Sai Baba