Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
పూలమ్మ గారి చిన్నకుమారునకు 1984 లో జబ్బు చేసి తగ్గినది.
అప్పుడు వారి చిన్న కుమారుడు తన తల్లిగారైన పూలమ్మగారు కూడా తమతో వచ్చిన షిరిడీ వెళ్ళవలెనని అనుకొనెను.
షిరిడీ ప్రయాణము చేయలేక పూలమ్మ గారు షిరిడీ వెళ్ళుటకు సాకు చెప్పుచున్నది.
గురుపూర్ణిమ కూడ గడచి పోయినది.ఇట్లుండగా ఒకరోజురాత్రి గం7-00ల ప్రాంతమున సాధువు ఒకరు వీరి ఇంటి వాకిట నిలబడిరి.
బాబా వలె అతను తలకు గుడ్డను చుట్టుకొని,కాషాయరంగు కఫ్నీని కూడా ధరించియున్నాడు.
చంకకు జోలెను ధరించి,మరియొక ప్రక్క చేత కర్రను పట్టుకొని యుండెను.అట్లుండగనే ఇంటిలో కరెంటు పోయినది.
సాధువును లోపలకు రమ్మని ఎవరు ఆహ్వానించకనే చీకటిలోనే ఇంటిలోనికి వచ్చి చాపపై కూర్చుని పూలమ్మ వంక చూచుచు “గురుపూర్ణిమకు షిరిడికి నీవు ఎందుకు రాలేదు?ఇట్లెందుకు వచ్చుటకు జాగు చేయు చున్నావు.ఇంక ఆలస్యముచేయక వెంటనే బయలు దేరి షిరిడీ వెళ్ళుము”అని ఆ సాధువు పూలమ్మకు చెప్పిరి.
ఆ సాధువుకు కాఫీ యివ్వగా అందులో ఊది కలుపుకొని త్రాగినాడు.
పూలమ్మ గారి కుమారుడు వీరికి పదమూడు రూపాయిలు దక్షిణ యివ్వ తలచెను.
కాని ఇంటిలోని వారు కూడా ఆ సాధువుకు దక్షిణ యిస్తామన్నారు.
వారు యిచ్చిన దక్షిణ రూ. 13లు కాగానే యిక తీసుకొనలేదు.వారి అబ్బాయి యివ్వాలనుకొన్నంతయే చాలునని తీసుకోనిరి.
మిమ్మల్నందరిని షిరిడీలో కలుసుకొనగలను అని ఆ సాధువు లేచి బయటకు వచ్చెను.వారు బయటకు రాగానే ఇంటిలో కరెంటు వచ్చినది.
తాను అరండల్ పేట సాయిబాబా మందిరములో ఉందునని ఆ సాధువు చెప్పగా రిక్షాపిలచి బలవంతముగా వారిని ఒప్పించి పంపిరి.
ఆ సాధువు లోపలకు రాగా వీరి ఇంటిలోనే కరెంటు పోవుట,బయటకు రాగానే కరెంటు వచ్చుట ఒక విచిత్రము.
అటుతరువాత పూలమ్మ గారితో కలసి వారి అబ్బాయి కుటుంబము షిరిడి వెళ్లి బాబాను దర్శించి సుఖముగా వచ్చిరి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- పూలమ్మగారిని షిరిడీ వెళ్ళమని బాబా వారు చెప్పుట
- శివనేశన్ స్వామిని బాబా షిరిడి రమ్మని పిలుచుట
- running train నుంచి క్రిందపడుతున్న నన్ను బాబావారు కాపాడారు.పిలిచిన వెంటనే సమయానికి వచ్చి బాబావారు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అని నాకు స్పష్టమైంది.
- నిశ్చేష్టురాలై,భక్తి-ప్రేమలతో బాబాను చూచుచు మాతాజీ నిలుచుండిపోయెను.
- దేహమే దేవాలయం …. మహనీయులు – 2020… మార్చి 10
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబావారు పూలమ్మగారిని షిరిడి వెళ్ళమని చెప్పుట.”
sai sevika
September 28, 2017 at 7:44 pmyes.. I observed that power will be gone whenever Baba comes to his devotees home.. I observed it when my guruji sri Ammula Sambasiva rao ji was performing any Sai program with all sai devotees in their home,the power will be gone for 2 or 3 minutes , then we used to feel Baba’s presence in that sai program..
kishore Babu
September 30, 2017 at 2:33 amhttp://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి