Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీమతి సాయిలీలమ్మగారు కలకత్తాలో యుండగా నడుము నొప్పితో బాధపడుచున్నది.ట్యూమరు ఉన్నదని, అది ముందు,ముందు క్యాన్సర్ గా మారవచ్చునని ,కనుక గర్భసంచి తీసివేయవలెనని డాక్టర్లు చెప్పిరి.పెద్దాపరేషన్ చేసారు.
ఆ పరిస్థితిలో యివ్వకూడని మందు నర్సు ఇవ్వటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు లీలమ్మగారు.బంధువులు అందోళన చెందుతున్నారు.
ఇప్పుడు బాబా తన చమత్కారం చూపారు.
తెల్లని దుస్తులు ధరించి బాబా లీలమ్మగారి వద్దకు వచ్చి,ఆప్యాయముగా “అదేమిటి వీళ్ళు నీకు విభూతి పెట్టలేదా?అని ప్రశ్నించారు.
అపస్మారకం నుండి తేరుకున్న లీలమ్మగారు ఆ స్థితి లో “బాబా! మీరెందుకు కష్టపడతారు అనుచు తన కుమార్తె లలితను అమ్మగారు పిలవగా ఆమె వచ్చి విభూతి పెట్టినది.
అప్పుడు బాబా అంతర్థానమైనారు.అంతే ఆమె ఆరోగ్యం మెరుగుపడసాగింది.
ఆమెను పరీక్షించుచున్న డాక్టర్లు ఆమె ఆరోగ్యము మెరుగుపడటం చూచి విస్మయం చెందారు.
లీలమ్మగారి భర్త స్నేహితునకు బాబా స్వప్నంలో కనిపించి ఆమె ఆరోగ్యము బాగవుతుందని ధైర్యముగా యుండమని చెప్పమన్నారు.
ఇరువది ఒకటవ రోజు మాతాజీని ఆసుపత్రి నుండి ఇంటికి పంపినారు.ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
ఇంటివద్దయున్న పనిమనిషి మామూలు పనులు చేస్తుంది కాని పిల్లల పని,తన పని ఎవరు చూచుకుంటారని మాతాజీ ఆలోచన చేయసాగింది.
ఇంటిపట్టునే యుండి శ్రద్ధగా ఇవన్నీ చూచుకునేందుకు ఎవరన్నా తెలుగు వచ్చిన యువకుడు దొరికితే బాగుండుననుకొని శ్రీ సాయినాథుని హృదయపూర్వకముగా వేడుకున్నది.
లీలమ్మ గారు అలా అనుకున్న తరువాత ఇంటికి వచ్చిన మూడవ రోజున ఒక కుర్రవాడు వారి ఇంటి తలుపు తట్టాడు.
రామారావు గారు వెళ్లి తలుపు తీస్తే ఆ కుర్రవాడు తెలుగు లో మాట్లాడుతు,ఇంట్లో పని వుంటే చేస్తానన్నాడు.
ఆ పిల్లవాడిని అమ్మగారి దగ్గరకు తీసుకొని వచ్చి పనిచేస్తానంటున్నాడు మాట్లాడు అని చెప్పి పరిచయము చేసారు రామారావుగారు.
ఆ కుఱ్ఱవాడు 16సంవత్సరముల వయస్సు వానిగా యున్నాడు.లీలమ్మగారు చూచింది.
కుర్రవాడు బాగానే యున్నాడు కాని బట్టలు బాగాలేవు .బాబా మోర ఆలకించాడన్నమాట.కలకత్తాలో తెలుగువాడు దొరకటమేమిటానుకుంటూ,నీ పేరేమిటి బాబూ అని అడిగితే ,నాకు పేరు లేదు.ఏపేరైనాసరే,మూర్తి అని పిలవండమ్మా.
నా అమ్మ,నాన్నా చిన్నప్పుడే పోయారు.ఎవరు లేరు అని అన్నాడు ఆ కుర్రవాడు.బీరువాలో చిక్కగుడ్డ యుంటే దానిని కూతురు చేత తెప్పించి గుడ్డ అతనికి చాలదేమో అనుకుంటూ అమ్మగారే కుట్టింది.ఆ కుర్రవాడు స్నానం చేసి వచ్చి ఆ చొక్కా వేసుకుంటే సరిపోయినట్లు అనిపించింది అమ్మగార్కి.
ఇంట్లో పనంతా చూచుకుంటున్నాడు. పిల్లలిద్దరికి అన్ని సమయానికి చూస్తున్నాడు.అంతకు ముందున్న పనిమనిషిని మాన్పించాడు.ఆ పని చేస్తున్నాడు అమ్మకు మందులివ్వడం దగ్గర నుండి అన్నీ తానే చూస్తున్నాడు.
పనిమనిషిని ఎందుకు వద్దన్నావని అమ్మఅడిగితే ఎందుకమ్మా నేను నీ దగ్గరేవున్నాగా!నీకు ఆపరేషన్ చేసినప్పుడు చాలా రక్తం పోయిందిగా?అప్పుడు నీ పక్కనే వున్నాగా.ఆ పనిమనిషికి ఇచ్చే 21 రూపాయలు నీ ఆరోగ్యానికి పండ్ల కొరకు వాడొచ్చుగా” అని అన్నాడు.
స్నానానికి అన్ని సిద్ధం చేసేవాడు.స్నానం చేసేటప్పుడు మగపిల్లలు రాకూడదు”అని అమ్మగారంటే చిన్నపిల్లవానిగా కనిపించాడు.
ఇట్లు అనేక చమత్కారాలు చేస్తున్న మాతాజీ గుర్తించలేకపోయింది మాయచేత.
పిల్లవాడి మాటలు సాయిసచ్చరిత్రలో పోలివున్నవని తెలుసున్నా కూడా బాబాని గుర్తించలేకపోయింది.భోజనం చేసేటప్పుడు దగ్గరుండి తినిపించే వాడు.
ఆరు నెలలు తరువాత డాక్టర్లు చూచి అంతాబాగుంది ఇంకా ఒక్క నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు.
ఇంటికి వచ్చేటప్పటికి కుర్రవాడు ఇంట్లోలేడు.అమ్మగారు వాడేమైనాడోనని బాధపడింది.
మూడు రోజుల తరువాత వచ్చాడు.ఏమైనావురా? అని అంటే నన్ను పోలీసులు పట్టుకెళ్ళి జైళ్లో పెట్టారు.నీవు మహ్మదీయుడవన్నారు.కాదు హిందువన్నారు.అప్పుడు వెంటనే నిక్కరు విప్పి చూపిస్తే వదిలేసారు అని చెప్పాడు.
నెల గడిచింది.మరలా డాక్టర్లు దగ్గరకు మాతాజీ సాయిలీలమ్మగారు వెళితే అంతా బాగుంది.మీరు మామూలుగా పనులు చేసుకోవచ్చన్నారు.ఆమె ఇంటికి వచ్చేటప్పటికి ఆ కుర్రవాడులేడు.తిరిగి ఇక రానేలేదు.ఎక్కడి నుంచి వచ్చాడు. ఇంట్లో ఎప్పుడుం డేవాడు.ఎక్కడికెళ్ళాడు?ఆమెకు అర్థం కాలేదు.అతను వున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ సచ్చరిత్రలోని బాబా మాటలేనని గుర్తుకు వస్తున్నాయి.
బాబా!మీరా ఇలా పని పిల్లవాడిగా వుండి కాపాడినది అని బాధపడ్డది.గుర్తించలేకపోయినందుకు చింతించింది.
ఇలా ఆమెకు బాబా ఎప్పుడూ నిదర్శనమిస్తూనే యున్నారు.మాతాజీ లీలమ్మ గారు చిన్నప్పటి నుండి బాబా భక్తులే.
మొదట విజయవాడలో వుండేవారు.1954 లో షిరిడీ లో శ్రీ ప్రత్తినారాయణరావు గారిచే తెలుగు అనువాదము చేసిన సచ్చరిత్ర ఆవిష్కరణ సమయములో మొదటకాపీ వీరికి ఇవ్వబడినది.
వారు ఎవరిని పలకరించినా బాబా అనే సంబోధిస్తారు.
చాలా సంవత్సరాలనుండి వీరితో రచయిత గోపాలరావుకు పరిచయమే.రచయిత 93 లో వ్రాసిన శ్రీ సాయిబాబా జీవిత చరిత్రకు సాయి లీలమ్మగారు ఆశీస్సులు యిచ్చిరి.వీరు రచయిత ఇంటికి కూడా వచ్చిరి.
ప్రస్తుతము మాతాజీ సాయిలీలమ్మగారు సికింద్రాబాదులోని ఓల్డు అల్వాల్ లో మంజీరానగర్ హౌసింగ్ కాలనీలో ప్లాట్ నెం 52,ఫాదర్ బాలయ్యనగర్ లో వున్నారు.
ప్రస్తుత అంకిత భక్తులలో వీరు ప్రధములుగా తలచవచ్చు.ఆమెకు బాబాతో అనుభవములు ఎన్నో.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా
- నిశ్చేష్టురాలై,భక్తి-ప్రేమలతో బాబాను చూచుచు మాతాజీ నిలుచుండిపోయెను.
- సిమ్లాలో మాతాజీ కృష్ణప్రియ యింటికి బాబా వచ్చుట
- మాతాజీ క్రిష్ణ ప్రియాను సద్గురువు చేసిన జగద్గురువు
- భక్తురాలిని క్షణకాలంలో ఆరోగ్యవంతురాలిగా చేసిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా.”
kishore Babu
September 30, 2017 at 2:33 amhttp://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి