Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీ సాయిభక్త అనుభవ సంహిత:
నా జీవితంలో మూడు సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను.
మొదటసారి 1912వ సంవత్సరం గురుపూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దాభోల్కర్ తో పాటు నేను,నా భార్య వెళ్ళాము.
మా మామగారు తన కుమార్తెను,అల్లుడిని శిరిడీ తీసుకువస్తానని మ్రొక్కుకున్నారట.
మ్రొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను.
అంతేగాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు.
మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబా తో అనుబంధము లేదు కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక,పారమార్థిక సంపద మెండుగా ఉంది.
మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్(భగత్)విఠలుని పరమ భక్తుడు.తరచు పండరి యాత్రలకు వెళ్ళేవాడు.
ఆయన ప్రతి ఆషాఢ,కార్తీక మాసాలలో పండరి యాత్రకు తీసుకు వెళ్ళిన బట్టలు,నడుముకు కట్టుకునే కాషాయం దట్టి ,పూజాసామగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి.నేను వారి కాషాయ దట్టీని పండరి తీసుకెళ్ళి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని.
మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా! నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు.
నేను వారి ముద్దుల మనవడినైనప్పటికి వారి జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు.
రాత్రిళ్ళు “హరికథ” చదివేవాడు.వేకువఝూమున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమ పదించారు.
ఆయన నిర్యాణం చెందేముందు “నా అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి.ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టెపై కూర్చొని వేచి ఉన్నారు.వారు నాకు ఘటిక కాలం (24 నిముషాలు)మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సహాయమిచ్చారు!” అని పలికి తన కొడుకులు,కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తరువాత ఒకరిని పిలిచారు.
శోకిస్తున్న మా నాన్న గారిని దగ్గరికి పిలచి,విచారించవద్దని ధైర్యంగా ఉండమని చెప్పారు.వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో గాక గంగా,భగీరథి మొదలైన తీర్థాలతో పిలిచి,వీడ్కోలు పలికారు.
నన్ను దగ్గరికి పిలిచి,నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు.వారు పలికిన మాటలు వారివి కావు.తుకారాం,రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు.
ఈ విధముగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు కన్ను మూసారు.వారు తప్పక వైకుంఠానికే వెళ్లి ఉంటారు. ఈ సంఘటన 1899 లో జరిగింది.
మా నాన్న ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు.వారు పండరీపురం దర్శించారు.
కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరు తమ జీవితా కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు.వారు 1911లో మరణించారు.
వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు,దక్షిణం వైపు చూపిస్తూ “నన్ను తీసుకెళ్ళడానికి వారు వచ్చి ఉన్నారు!” అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు.
ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్ధిక భావాలతో నిండిపోయింది.కానీ నేను విద్యనూ అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం,ఈ భక్తి భావాలన్నింటిని తుడిచి వేయడమే గాక వ్యతిరేక భావాలను జనింపజేసింది.
1911 జూన్ లో వివాహ సమయప్పుడు,వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగెను.ఒంటిపూట భోజనం,రాత్రిళ్ళు ద్రవాహారం తీసుకుంటూ వచ్చాను.
అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తిబీజాలు మొలకెత్తసాగాయి.
కాని ఆధ్యాత్మికతపట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్ధత మాత్రం కొనసాగుతోంది.మా మామగారిని,ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకుంటుండేవాడిని.
ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు.నేను నమస్కరించాను.నా అంతరంగం ఎరిగిన బాబా “ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు!(త్యాలా పాయా పడాయలా నేట్ లగాతో)” అని అన్నారు.
అ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు.బాబా కృపవల్ల నాకు ఎంతో మేలుజరిగి బాబాపట్ల నమ్మకం పెరగసాగింది.
నా వ్యాధి మూలంగా నేను అందరివలె అన్ని వేళ్ళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించిపోతున్నానని,వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించగా ,నేను త్వరలోనే స్వస్థత పొందుతానని “అల్లా అచ్ఛా కరేగా”అన్నారు.
నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను.
త్వరలోనే వ్యాధినయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాను.బాబా మాటలు నిజమయ్యాయి.
నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు అంటే 5.6.1913న నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది.
అదే సంవత్సరం బస్సేన్ లోనున్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ ఛైర్మన్ గా నేను నియమించబడ్డాను.
1915 గురుపూర్ణిమకుబాబాను రెండవసారి దర్శించాను.ఈసారి కూడా మా మామగారితో ,నా భార్యతో కలిసి వెళ్ళాను.ఈసారి శిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలేమి కలుగలేదు.
కానీ 1915 ఫిబ్రవరిలోజరిగిన సంఘటన చెప్పుకోతగింది.నా ఎరుకలో లేకుండా నిగూఢరీతిలో బాబా నన్నెలా కాపాడుతున్నారో నాకు తెలిసింది.ఆ సంఘటన వివరిస్తాను.
ఫిబ్రవరి నెలలో ఒకరోజు అర్నాలలో ఉన్న మా ఇంటిలో పడుకొని ఉన్నాను.అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను.మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ(ఈడ్పు)వచ్చి పడిపోయాను.
నా భార్య,ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారితీస్తుందో ఏమోనని భయపడుతున్నారు.
ఆ సమయంలో నాకొక దృశ్యం కనపడింది.యమదూతలవలె కన్పించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి.వారు డాలు,బల్లాలు పట్టుకొని ఉన్నారు.వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు.నాలో నేను “ఏమిటిదంతా?ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు?” అని అనుకోసాగాను.కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమి తెలియడంలేదు.అంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది.ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నింటిని ఒక ప్రక్కకు ఈడ్చివేసింది.ఆ నల్లని ఆకారాలు ,ఆ వెలుగుకు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి.ఆ హస్తం క్రిందగా తెల్లటి కఫ్నీ కొంతభాగం కన్పించింది.అంతేగాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది.తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను.
క్రిందపడటం మూలంగా నాకెలాంటి గాయాలు కాలేదు.నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి.
నా చుట్టూ చేరి ఉన్నకుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు.
నాకు మాత్రం అప్పుడు బాబాపై(1915లో)అంతటి నమ్మకం కలగలేదు.
1927లో నారాయణ మహారాజ్ మహిమ చవిచూసిన తరువాతే బాబాపై దృఢనమ్మకమేర్పడింది.ఆ రోజు నన్ను రక్షించిన అమృతహస్తం సాయిబాబాదే అని గుర్తించాను.
1918 అక్టోబర్ లో బాబా మహాసమాధి చెందడానికి వారం,పది రోజులముందు మేము శిరిడీ వెళ్లి బాబాను దర్శించాము.
నా ఇద్దరు పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళాను.
దురదృష్టవశాత్తు శిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ళ విరేచనాలతో బాధపడసాగారు.
మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడంగానీలేదా ద్రవాహారం ఇవ్వడంగానీ చేస్తారు.కాని ఈ విషయం బాబాకు చెబితే “వాళ్లకి శిరా (గోధుమనూకను నేతిలో ఉడికించి) తినిపించండి” అన్నారు.పిల్లలు శిరా తిన్నారు.వారం రోజుల్లో వాళ్లకి ఆరోగ్యం చేకూరింది.
మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు నిషిద్ధమైన ఆహారాన్నితీసుకున్నారు.బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలుగలేదు.
1918 లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు.అలా ఎన్నోసార్లు అడిగారు.నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను.వారు నన్నెప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు.అటువంటి ప్రదేశాలలో అప్పుచెయడం నాకు ఇష్టముండదు.నా జేబు లోని డబ్బులన్నీ అయిపోక మునుపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు.
మరొక విశేషమేమంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు.
దక్షిణగా అడిగే 25,15,10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థముందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు.బాబా ఒక్కొక్కసారి “వాడా కెళ్ళి కూర్చో!” అని ఆదేశించేవారు.నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని,మేము ఉంటున్న బూటీవాడాకు వెళ్లి మా మామగారి వద్ద కూర్చునేవాడిని.
కానీ,చాలాకాలం తరువాత బాబా మాటలకు అర్థం ‘వాడా లో జరిగే పురాణ పఠనంలో కూర్చో’ అని తెలుసుకున్నాను.
మానవతత్వం-దైవత్వం కలగలసిన స్వరూపమే శ్రీ సాయిబాబా! దైవత్వము,దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం.
సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది.
1926 ఆగష్టులో నా కుమారుల్లో ఒకనికి తీవ్ర అనారోగ్యం కలిగి ,దీర్ఘకాలం కొనసాగింది.ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేసారు.
పిల్లవాడికొచ్చిన వ్యాధిని ఎవ్వరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు.ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు.ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయంచేయలేకపోయింది.
1927 అక్టోబరు నాటికి డాక్టర్లు వాడికిక నయంకాదని తేల్చివేసారు.వాడిపై మేమందరం ఆసలు వదులుకున్నాము.
అప్పుడు మా వదిన పిల్లవాడిని ఖేడ్ గాం పేట్ లో నున్న నారాయణ్ మహరాజ్ దగ్గరకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది.ఆమె సలహామేరకు పిల్లవాడిని మహరాజ్ దగ్గరకు వాడిని తీసుకెళ్లాము.
మహరాజ్ వాడిని ఆశీర్వదిస్తూ “అతడికి నయం అవుతుంది. ఈ తీర్థం తీసుకోండి!” అన్నారు.అదొక గొప్పమలుపు! అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు.ఆరు నెలలకు ప్రమాదం తప్పిపోయింది.
ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు.
నారాయణ్ మహరాజ్ నోటి నుండి వెలువడిన అమృతతుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను.
నారాయణ్ మహరాజ్,శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను,సామాన్య మానవమాత్రులుగా పరిగణించడం సరికాదని నాకర్థమైంది.
సామాన్యులకందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు,టెన్నిసన్ తన ‘మెమోరియమ్’అనే కవితలు చెప్పినట్లు దైవత్వము-మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు.
1930 లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమయ్యింది.
తుంగరేశ్వర్ ఆలయంలో నాగాబువా అను సాధువు నివసిస్తూ ఉండేవాడు.అతను గంజాయి పీల్చేవాడు.అతను 1930 లో తుంగరేశ్వర్ లో మరణించాడు.
ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను.రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది.అది ఎక్కువయి గొంతులోనికి పోయి పొరపోయినట్లై మెలుకవ వచ్చింది.లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. “నీవు పొగత్రాగావా?” అని నేను నా భార్యనడిగాను.
ఆమె విస్తుపోయి “మీరు ఏం మాట్లాడుతున్నారు?”అని కోపంగా అడిగింది.
కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోకి ఎలా వచ్చిందో నాకర్థం కాలేదు.చిత్రముగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు.
మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను.తుంగరేశ్వర్ ఆలయానికి అప్పుడు ఛైర్మెన్ గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి,నాగాబువా గత రాత్రి 2గంటల ప్రాంతంలో మరణించాడని,అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు.
నాగాబువా దేహం విడిచి వెళ్ళే ముందు నా గదికి వచ్చివెళ్ళాడని అప్పుడు అర్థమైంది.
నా గదిలో వచ్చే పొగవాసన,నాగాబువా త్రాగే గంజాయి పొగవాసన గా నేను గుర్తించానుకూడా!
1915 లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు,వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా? ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను.
బాబా నా గతజన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్ కు వివరించారు.కాని నేను వాటిని స్పష్టముగా వినలేకపోయాను.
ఆ వివరాలేవో నిమోన్కర్ ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- సాయిబాబా నామమే నన్ను కాపాడింది.
- 22 సార్లు చెక్ బౌన్స్ కేసులైతే నన్ను ఒకసారి కూడా కోర్టు బోను ఎక్కకుండా, నాకు సమస్యలేమీ రాకుండా బాబాగారు నన్ను కాపాడారు.
- సాయి కి మ్రొక్కు – లేదిక మనకే చిక్కు!—Audio
- సాక్షాత్తు బాబాయే నన్ను ఆరకంగా ఆశీర్వదించాడనిపించింది.
- రక్షమాం శరణు తండ్రి, నన్ను రుణబాధనుండి విముక్తి చేయమని మాత్రమే ప్రా ర్దించినాను–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మ్రొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెబితే వారి వెంట వెళ్ళాను.”
kishore Babu
September 30, 2017 at 2:16 amhttp://saileelas.com/m/sounds/view/10Chapter7-mp3
శ్రీ సాయి గురు చరిత్ర….ఏడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి