Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-114-సాయి కి మ్రొక్కు 4:50
నా పేరు జి. సత్యం. నేను నెల్లూరులోని బాలాజీ నగర్ లో వుంటున్నాను.
బాబా, గురువుగారు నాకు ప్రసాదించిన అనుభవాలన్నీ ‘సద్గురులీల’ ప్రతిక ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
డిశెంబరు 2007 వ సంవత్సరములో ఒక గురువారం రోజున ఉదయం నేను మినీ బైపాస్ రోడ్డులో గల సాయిబాబా మందిరానికి వెళ్ళాను.
బాబా విగ్రహం వద్దకు వెళ్ళి వంగి నమస్కారం చేసుకొంటుండగా నాకు ఒక్కసారిగా వాంతులు రావడం జరిగింది. నేను బలవంతంగా నోటికి చేయి అడ్డుపెట్టుకొని గబగబా బయటకు వచ్చి వాంతి చేసుకున్నాను.
నా నోటి నుండి సుమారుగా 1.5 లీ రక్తం వాంతుల రూపంలో బయటకి వచ్చింది.
నాకు అంతకుముందు అలా జరగలేదు. అదే మొదటిసారి జరగడం, నాకు చాలా భయం వేసింది.
నేను చాలా నీరసపడిపోయాను. మందిరంలోని వైద్యశాల ఆవరణలో ఉన్న బెంచిమీద పడుకోనేశాను.
కొంచెం సేపయిన తరువాత మన గురుబంధువు రమణయ్య గారు వచ్చి పరిస్థితి తెలుసుకొని గబగబా నన్ను రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు తీసుకుని వెళ్ళారు. నాకేమి గుర్తులేదు చాలా నీరసంగా ఉంది.
అక్కడి డాక్టర్లు నన్ను పరీక్షింఛి ఇంకొకసారి ఇలాగే రక్తవాంతులు అయితే చాలా ప్రమాదకరం , ఇతను బతకడం కష్టమని చెప్పి నన్ను నారాయణ జనరల్ హాస్పిటల్ కు వెళ్ళి చూపించుకొమన్నారు .
మేము నారాయణ హాస్పిటల్ కీ వెళ్ళాము. మూడు రోజులు అక్కడే వున్నాను.. ఈ మూడు రోజులలో నాకు ఒక్కసారి కుడా వాంతులు కాలేదు.డాక్టర్లు పరీక్షింఛి ఇంక డిస్ చార్జ్ చేస్తారనంగా మళ్ళీ రక్తం వాంతులు అయ్యాయి.
వాళ్ళు కూడా ఇక్కడ లాభం లేదని చెన్నైకి తీసుకుని వెళ్ళమన్నారు. చెన్నైలో .15 రోజులు త్రిట్ మెంట్ తీసుకున్నాను. బాబావారితో ఎలాగైనా నా జబ్బు తగ్గించాలని గట్టిగా వేడుకున్నాను.
పదిహేనురోజుల తర్వాత చెన్నై డాక్టర్లు నన్ను డిస్ చార్జ్ చేసి నెల్లూరుకు పంపిస్తూ మసాలా వస్తువులు , కూల్ డ్రింక్స్ అస్సలు తెసుకోవద్దని జాగ్రత్తలు చెప్పి పంపించారు.
ఆరోజు నుండి ఈ రోజు వరకు నాకు మళ్ళీ ఆవిధంగా వాంతులు కాలేదు.
మరోకమాట ఏమిటంటే నేను అప్పట్నుంఛి ఇప్పటి వరకు ఎక్కువగా మసాల వస్తువులు కూల్ డ్రింక్స్ త్రాగుతున్నాను. నాకు ఏమికాలేదు.
ఎందుకంటే నేను పూర్తిగా బాబానే నమ్ముకొని ఉన్నాను. నాకు ఏమికాదనే ధైర్యం వచ్చింది.
ఆలానే నాకు ఇంతవరకు ఏమికాలేదు. ఇదంతా నాకు బాబా, ప్రసాదించిన ప్రాణభిక్ష, అప్పటినుండి నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ, బాబా సేవ చేసుకుంటున్నాను.
నాకు చాలా సమస్యలుండేవి ఇవన్ని అసలు ఎలా తీరుతాయనే భయం కూడా ఒక్కోసారి కలిగేది. ఎం చేయాలి? ఎలా చేయాలి ? అని నాలోనే నేను మధనపడిపోయేవాడ్ని.
ఒక్కసారి బాబాతో, గురువుగారితో చెప్పుకొన్నాక నా సమస్యలు తీరకపోయినా ఇంతకు మందులాగా ఆధైర్యపడకుండా, ఖచ్చితంగా నా సమస్యలను బాబానే తీరుస్తారనే ధైర్యం వచ్చింది.
మా ఆవిడకు అప్పుడప్పుడు రాత్రిళ్ళు నిద్రలో పీడకలలు వచ్చేవి.సరిగా నిద్రపట్టేదికాదు.
చాలా భయం వేసేది. అప్పుడు నేను బాబాను ప్రార్దించి బాబా ఊదీని తీసుకుని నా భార్య నోసటరాశాను.
అప్పటి నుండి పీడకలలన్ని చెదిరిపోయి చక్కగా బాబా గురువుగార్లు మాకు స్వప్న దర్శనం ద్వారా అప్పుడప్పుడూ మంచి అనుభవాలను ప్రసాదిస్తున్నారు.
నేను అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నెల్లూరులోని సాయిబాబా మందిరానికి, శిరిడికి, గురువుగారి దగ్గరకు వెళ్తున్నాను.
ఈ విధంగా బాబా నన్ను కరుణించి ఆయన చెంతకు చేర్చుకున్నందుకు నేను జీవితాంతం బాబా, గురూజీల సేవచేసే భాగ్యం లభించాలని కోరుకుంటూ…బాబాకు గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
మీ గురుబందువు,
జి సత్యం
నెల్లూరు.
సంపాదకీయం: సద్గురులీల (ఆగస్టు 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కువైట్ కి చెందిన సాయి గీత గారికి ఈరోజు(07th November 2016) బాబా ఇచ్చిన అనుభవము
- గురువుగారి దయవలన నాకు పూర్తిగా జ్వరం తగ్గి స్కూల్ కి వెళ్లి పరీక్ష కూడా వ్రాయగలిగాను.
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- అర్ధరాత్రి పూట తన దగ్గరికి పిలిపించుకుని మా పాప కి స్వస్థత చేకూర్చిన బాబా వారు …….!
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి కి మ్రొక్కు – లేదిక మనకే చిక్కు!—Audio”
సాయి suresh
May 21, 2016 at 5:17 pmమంచి అనుభవం
జై సాయి రామ్