అర్ధరాత్రి పూట తన దగ్గరికి పిలిపించుకుని మా పాప కి స్వస్థత చేకూర్చిన బాబా వారు …….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాపేరు రమాదేవి మేము గ్రీన్‌ పార్క్‌ కాలని చంపాపేట హైదరాబాద్‌ లొ వుంటాము.

మా చిన్నతనంలో ఎప్పటి నుండో ఒక బాబా విగ్రహం ఉండేది. అదంటే నాకు చాలా ఇష్టం ఆ విగ్రహాన్ని నేను బాగా అపురూపంగా చూసుకునేదాన్ని.

నేను చిన్న పిల్లను కాబట్టి పూజలంటూ చేసే దాన్ని కాదు. అప్పట్లో మా నాన్న కంసాలి  పనిచేసేవారు. మాది అతి సామాన్యమైన కుటుంబం.

మా దగ్గర డబ్బులు లేకపోవటాన నాకంటే 12 సంవత్సరాల వయసులో పెద్ద అయిన అతనితో నాకు పెళ్లి 1997 వ సంవత్సరంలో జరిగింది.

నా పెళ్ళి అయిన 15  రోజులలోపే మాఇంట్లో వున్న బాబా విగ్రహం ఎలా పగిలిపోయిందో తెలీదు. కానీ పగిలిపోయింది. అది అలా  పగిలిపోవటం నన్ను బాగా కలవరపరిచింది.

పెళ్ళికి ముందే అలా పగిలి పోయివుంటే నేను అసలు పెళ్లి  చేసుకునేదాన్ని కాదు. శ్రీసాయిబాబా విగ్రహం అలా ఎందుకు పగిలిపోయిందో నాకు తర్వాత కానీ అర్థం  కాలేదు.

నేను పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు, మా ఆయన నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకొని మమ్మల్ని ఉదరించాడు.

నా భర్త నన్ను రోజు తాగి వచ్చి కొడుతూ వుండేవాడు. నేను అన్నీ భరిస్తూ వచ్చాను. మా ఆయనకి అదోరకమైన శాడిజం ఉంది.

ఎవరితోటి నేను మాట్లాడ కూడదు. మా ఆడపడుచులతో మాట్లాడినా,  మా తోటి కోడళ్లతో మాట్లాడినా కూడా మాట్లాడనిచ్చేవాడుకాదు.

నేను ఎవరితో మాట్లాడినా నా వీపు చిట్లిపోయేది. మా ఇంటి  పక్కవాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. బాబా అన్ని చూస్తూనే వున్నాడు, కానీ ఆబాబా నాకన్ని పరీక్షలే పెడుతూ వచ్చాడు.

మా ఇంటికి మా వాళ్లు ఎవరు రాకూడదు, మా అమ్మ తమ్ముడు కూడా ఎవరూ రాకూడదు, నాతోటి మాట్లాడకూడదు. కొద్దిరోజుల అనంతరం నేను నెల తప్పాను.

నాకు ఇష్టం లేదు అంటూ మా ఆయన  అభార్షన్ చేయించాడు. ఆతర్వాత నేను మళ్ళీ నెల తప్పాను, రోజు ఎదో రకంగా గొడవపడి ఆ గర్భం  తీసేయించాలని, ఉండకూడదు అని చాల విశ్వ ప్రయత్నాలు చేసాడు.

చివరకి నాకు ఎనిమిదవ నెల వచ్చే  దాకా నేను ఆ గర్భాన్ని కాపాడుకున్నాను.

నన్ను ఏదో రకంగా కొట్టి హింసించడమే అతని ప్రథమ కర్తవ్యం  కాబట్టి నన్ను ఇనుపరాడ్డుతో కొట్టాడు, అంతే నాకు నెప్పులు వచ్చి చనిపోయిన బాబు పుట్టాడు.

నేను బాగా ఏడ్చాను, బాబాని తలుచుకొని, చెప్పుకొని మరీ మరీ ఏడ్చాను. మగపిల్లవాడు పుట్టి చని “పోయిందే నయం  అయ్యింది, లేకపోతే వాడు నాకు పోటీవచ్చే వాడు అన్నాడు.

ఆయన అసభ్యంగా. ఇన్ని మాటలు కూడా చాలా  సహనంతో భరించాను. నా రాత ఎలా ఉంటే అలా అవుతుంది. బాబాకి తెలీదా అని సరి పెట్టుకున్నాను.

మరొక రెండు సంవత్సరాలకి నాకు పాప పుట్టింది, అతికష్టం మీద కాపాడుకుంటే పుట్టింది. మా పాప. శృతికి ఆరు సంవత్సరాల వయసువున్నప్పుడు, అమ్మవారుపోసి, చెవిపోటు వచ్చింది. రెండు రోజుల పాటు ఏమి  తినకుండా ఏకధాటిగా ఏడుస్తూనే వుంది.

డాక్టర్‌ దగ్గరికి పోదాం అంటే వద్దు అనేవాడు, మరో మూడు రోజులు  అలాగే గడిచింది… ఐదవరోజు అర్ధరాత్రి నుండి ఏడుపు మరింతగా పెరిగిపోయింది,

మా ఆయన్ని లేపాను,  పాప చాలా ఎక్కువగా ఏడుస్తోంది ఏమవుతుందోనని నాకు భయంగా వుంది డాక్టర్‌ దగ్గరకి వెడదాము అన్నాను.

అర్ధరాత్రి పూట డాక్టర్లేదు ఏంలేడు పడుకో. అని అంటూ నన్ను కసిరాడు. “ఎప్పుడు బాబా బాబా అంటావుగ పో! ఆ బాబా దగ్గరకే అన్నాడు.

అతను తాగిన మైకంలో తెలియక అన్నా నాకు మాత్రం నా కర్తవ్యాన్ని భోదించినట్లు  అయింది. అంతే వెంటనే పాపతో బైటికి వచ్చి ఆటో ఎక్కాను.

దిల్ షుక్ నగర్! బాబా గుడి ముందు ఆటో ఆగింది, అప్పుడే ఉదయం కాకడా హారతిమొదలైంది. గుడిలోకి వెళ్లి నిలబడ్డాను.

హారతి జరుగుతున్నంత సేపూ కూడా పాప పెద్దగా ఏడుస్తూనే వుంది. హారతి అయ్యింది, పాప ఏడుపు ఆగిపోయింది.

నెమ్మదిగానా చంక దిగి బాబా ముందుకి వెళ్లి బాబా పాదాలపైన తలపెట్టింది. అంతే జ్వరము, చెవిపోటు, అమ్మవారు, అన్నీ చేత్తోటి  తీసేసినట్లుగా మాయం అయిపోయాయి.

అంతే, ఇంకా నేను. బాబాను గట్టిగా పట్టుకున్నాను. నాకు అప్పుడే  తెలిసింది బాబా మహత్యం.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles