Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-113-బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా 2:19
నా పేరు టి. పరమేశ్వరి. నాకు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.
ఆ ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఎంతో టెన్షన్ గా వుండేది.
అయితే బాబా నాకు ఇలా సమాధానం చెప్పారు. “నీ కర్మలను ఇలా కన్నీళ్ళతో పోగుడుతున్నానని”. నేను ఎంతో సంతోషించాను.
ఇంత సులభంగా బాబా నా కర్మలను పోగోడుతున్నారని అప్పుడు బాబాని “నిరూపణ ఏమిటో నాకు ఇవ్వు బాబా” అని బీరువా వైపు చూశాను.
బీరువా మీద “కంగ్రాచ్యులేషన్స్” అని ఒక స్టిక్కర్ వుంది.
అప్పుడు నేను ఏమి సాధించానని నాకు కంగ్రాట్స్ చెప్తున్నావు? అని బాబావారిని అడిగాను.
తరువాత ఇంకొక స్టిక్కర్ వుంది. దాని మీద “థింకింగ్ ఆఫ్ యు” అని వుంది.
బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా! అని సంతోషించాను.
నువ్వు నా గురించి ఆలోచించేలా నేను చేసినందుకు నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్తున్నావా! అని ఆనందించాను. అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత ఒకరోజు కలలో బాబా నాకు ఇన్విజిలేటర్ గా వచ్చారు.
కాని మొదట నేను ఎవరో ముసలాయన అని అనుకున్నాను. కాని వెంటనే బాబా అని గుర్తించి చూసేసరికి బాబా మాయం అయి నాకు మెలకువ వచ్చేసింది.
నాకు ప్రతిసారి నేను ఎగ్జామ్స్ రాసిన దానికంటే మార్క్స్ తక్కువ రావటంకాని, నేను ఎక్స్ పెక్ట్ చేసిన దాని కంటే ఎక్కువ రావటం అనేది నా ఎడ్యుకేషన్ లైఫ్ లో లేదు.
అటువంటిది నేను ఎక్స్ పెక్ట్ చేసిన దాని కన్నా నాకు ఎన్నో మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నేను ఎంతో సంతోషించాను.
అప్పుడు నాకు బాబా చెప్పినట్లుగా “నా యందే నమ్మకముంచుము. స్థిరమైన మనస్సుతో పరీక్షకు వెళ్ళుము. నువ్వు తప్పక ఉత్తీర్ణుదగుధువు” అని బాబా చెప్పిన పలుకు గుర్తుకు వచ్చి నాకు చాలా సంతోషం వేసింది.
గురుబంధువు.
టి.పరమేశ్వరి, హైదరాబాదు.
సంపాదకీయం: సద్గురులీల (ఆగస్టు 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
- మా ఆవిడా రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అని మరాఠీ వాని రూపములో వచ్చిన ఆయన అన్నారు.
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments