Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
తర్ఖడ్ అనుభవాలలో మరొకటి.
ప్రియమైన సాయిభక్త పాఠకులారా!యింతవరకు నేను చెప్పిన అనుభవాలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను.
సాధారణ జీవిత చక్రం ఎలా ఉంటుందంటే మొదట మనం సంసార జీవితానికి అల్లుకోవాలి,తరువాత మనకి తీపి,చేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి.వాటిని అనుభవించాక మనం చివరికి మనశ్శాoతి కోసం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతాము.
కాని,ఈ చక్రం మా నాన్నగారి విషయంలో తిరగబడింది.ఆయన మొదట చాలా దివ్యానుభూతులని పొంది తరువాత సంక్లిష్టమైన సంసార జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది.
ఒక విషయం మాత్రం తేటతెల్లం,ఎందుకంటే సాయిబాబా సహచర్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేర్పును పొందే అవకాశం వచ్చింది.
నేనుకూడా నమ్మేదేమిటంటే భక్తిమార్గం ఎటువంటిదంటే దానిని ఒకసారి సాధన మొదలుపెట్టాక సాధకుడు జీవితములో ఎటువంటి భయాన్నయినా ఎదుర్కొనేందుకు చక్కగా సన్నద్ధమౌతాడు.
ఇప్పటికి మా నాన్నగారు షిరిడీ కి చాలా సార్లు వెళ్ళారు.ఆయన ఖాతాలో ఎన్నో దివ్యానుభూతులను జమ చేసుకొని తగినంతలో ధనవంతుడయ్యారు.
యిప్పుడు కొన్ని తిరకాసు క్షణాలనుఎదుర్కొనేసమయం వచ్చింది.
అప్పుడవి శీతాకాలపు రోజులు పగటి సమయం యెక్కువ,రాత్రివేళ సమయం తక్కువగా ఉండేది.
అటువంటి ఒకరోజున బాబా మా నాన్నగారిని తమతో కూడా రమ్మన్నారు.అది ఊహించని ఆహ్వానం.కారణం బాబా అటువంటి సమయంలో ద్వారకామాయిని విడిచి ఎప్పుడూ వెళ్లరు.
ఆయన “లెండీబాగ్” వైపు నడుచుకుంటూ అక్కడినుంచి యింతకుముందు అద్యాయములో వివరించినటువంటి వాగు వడ్డు వద్దకు వచ్చారు.అప్పటికి పూర్తిగా చీకటి పడింది.చంద్రుడు ఆకాశంలోకి పైకి వచ్చాడు.
అప్పుడు బాబా మా నాన్నగారితో తాను ఆయనికి ఒక విచిత్రం చూపించబోతున్నానని ఆ కారణం చేతనే ఆ చోటుకి తీసుకుని వచ్చానని చెప్పారు.
ఏమయినప్పటికి బాబా తనపై వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు.
అప్పుడు వారు కింద కూర్చున్నారు.బాబా మెత్తగా ఉన్న మట్టిని తమ చేతితో తొలగించడం మొదలుపెట్టారు.
ఆయన మా నాన్నగారితో మట్టిలోకి చూడమని చెప్పి యేమయినా కనబడుతోందా అని అడిగారు.మా నాన్నగారు చూసి లేదని చెప్పారు.
బాబా తిరిగి మరలా అదే పని చేశారు.మా నాన్నగారు రెండవసారి తనకు మట్టిమాత్రమే కనబడుతోందని చెప్పారు.
అప్పుడు బాబా మూడవసారి తిరిగి అదేపని చేసి,మా నాన్నగారి తల వెనుక తమ చేతితో కొట్టి ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు.మా నాన్నగారు ఆ ప్రదేశంలో చూడగా అక్కడ మెరుస్తున్న లోహాన్ని చూసారు.వెన్నెల వెలుగులో అది యింకా మెరుస్తూ కనబడింది.
బాబా మా నాన్నగారిని ఏమయినా కనబడుతోందా అని అడిగారు.ఒక లోహపు వస్తువు మెరుస్తూ కనబడుతోందని మా నాన్నగారు చెప్పారు.అప్పుడు బాబా “భావూ,ఆ లోహం బంగారు తప్ప మరేమీ కాదు.నీకు యెంత కావలిస్తే అంత తీసుకో అన్నారు.మా నాన్నగారు బాబాతో ఇది నాకు వద్దు.మీ ఆశీర్వాదంతో మా కన్నీ వున్నాయి.మీ నుంచి ఇటువంటి భౌతిక సంబంధమైనవాటిని తిరిగి పొందుదామనే ఉద్దేశ్యంతో నేను షిరిడీకి రాను అన్నారు”.
అప్పుడు బాబా ఆయనతో “భావూ,యిది లక్ష్మీదేవి,ఆమెకు నువ్వంటే ఇష్టం కలిగింది.ఒక్కసారి కనక నువ్వు ఆమిచ్చిన వరాన్ని తిరస్కరిస్తే ఇక యెప్పుడు ఆమె నీ వద్దకు రాదు,కనీసం ఈ జన్మలోనయినా,అందుచేత మరలా ఆలోచించుకో” అని ముందు జాగ్రత్త చెప్పారు.
అప్పుడు మా నాన్నగారు ఆయనతో “బాబా!మీరు నన్ను పరీక్షకు గురి చేస్తున్నారు.నేను ఈ మాయకి యెరను కాబోను.
ఒకసారి నా మీద మీ అశీర్వాదములున్నంత వరకూ ఈ మాయ లేకుండా నేను ప్రశాంతంగా,సుఖంగా జీవిస్తాను అన్నారు.
అప్పుడు బాబా తిరిగి మట్టిని కప్పివేశాక యిద్దరూ ద్వారకామాయికి తిరిగి వచ్చారు.
ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.షిరిడీ స్థానికుడొకడు వాగు ఒడ్డున జరిగినదంతా చూసాడు.
సాయిబాబా మా నాన్నగారికి పాతిపెట్టబడిన నిధి యేదో చూపించివుంటారని ఊహించాడు.బాగా రాత్రి పొద్దుపోయాక ఆ చోటకి వెళ్లి ఆనిధిని త్రవ్వి తీసుకుందామనుకున్నాడు.
అనుకున్న విధంగా నిధి వేటకి సాహసం చేయడానికి అర్థరాత్రి లేచి వెళ్ళాడు,వెంటనే అతని వేళ్ళమీద తెలుకుట్టింది.
అతను రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు.ఉదయమయ్యేటప్పటికి బాధ భరింపరానంతగా ఉండటంతో తెలివిగా సాయిబాబా దగ్గరకెళ్ళి తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు.
తను రాత్రి నిధి వేటకు వెళ్ళిన విషయం బాబాకి తప్ప మరెవరికీ తెలియపరచకూడదను కున్నాడు.
అతను ద్వారకామాయిలోకి ప్రవేశించినప్పుడు విపరీతమయిన బాధతో ఉన్నాడు.ఆ స్థానికుడు బాబాని తన తప్పును మన్నించమని వేడుకుంటూ,ఇక ఆ పాపం యెప్పుడూ చేయనని క్షమాపణ చెప్పాడు.
ఆ స్థానికునితోపాటు మా నాన్నగారు కూడా అతనిని క్షమించమని బాబాని వేడుకున్నారు.తేలు కుట్టడం వల్ల కలిగిన భరింపరాని బాధ నుంచి విముక్తి చేయమని అడిగాడు.
బాబా అప్పుడు “యెవరయినా తనకు దైవసంకల్పితంగా నిర్దేశించబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్ధం మరెవరినైనా తీసుకోమని కాదు.ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరి అదృష్టాన్ని బట్టి వారికది లభించేలా ఒక నియమాన్ని యేర్పరిచాడు.ఎవరయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో అతను భగవంతుని చేత శిక్షింపబడతాడని” చెప్పారు.
మా నాన్నగారికి ఆ సంభాషణ అర్ధమయింది.
బాబా తన పవిత్రమైన ఊదీని తేలు కుట్టిన అతని వేలిపై వ్రాసి,భవిష్యత్తులో చెడుగా ప్రవర్తించవద్దని చెప్పారు.భగవంతుడు అతన్ని ఈ బాధనుండి తప్పిస్తాడని ఆశీర్వదించారు.
షిరిడీలో మా నాన్నగారికి పెట్టబడిన “బంగారు పరీక్ష” ఇదీ.
నేననుకునేదేమంటే ఆయన ఇటువంటి మాయకు యెర కాకుండా సఫలీకృతులయ్యారని.
కాని ఒక విషయం మటుకు ఖచ్చితం,ఏమిటంటే భవిష్యత్తు లో ఆయన ధనాన్ని కూడబెట్టు కోలేకపోయారు.
లక్ష్మీదేవి ఆయనవద్దకు వెళ్ళడం మానుకొంది.కాని ఆయన ఆర్ధిక పరిస్థితి అలాగే ఉంది.మనం ఆ చరిత్రలోకి వెళ్ళవద్దు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష–Taarkad-11–Audio
- బండలపై బాబా రూపం
- బాబాయే యజమాని మరేవరూ కాదు –Taarkad–Audio
- సాయి వారసత్వం! …..సాయి@366 మే 3….Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై రెండో భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments