బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష–Taarkad-11–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

యిక తార్ఖడ్ వారి బాబా అనుభావలలో మరొకటి.
బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష

ప్రియమైన సాయిభక్త పాఠకులారా ! యింతవరకు నేను చెప్పిన ఈ అనుభవాలన్ని కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను.

మన సాథారణ జీవిత చక్రం యెలా ఉంటుందంటే మొదట మనం సంసార జీవితానికి అల్లుకోవాలి, తరువాత మనకి తీపి, చేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి.

వాటిని అనుభవించాక మనం చివరికి మనశ్శాంతి కోసం ఆథ్యాత్మికత వైపు ఆకర్షితులమువుతాము. కాని, ఈ చక్రం మా నాన్నగారి విషయంలో తిరగబడింది.

ఆయన మొదట చాలా దివ్యానుభూతులని పొంది తరువాత కఠినతరమైన సంసార జీవితాన్ని గొడ్డలితో బాగా నలగగొట్టవలసి వచ్చింది.

ఒక విషయం మాత్రం తేటతెల్లం, యెందుకంటే సాయిబాబా సాహచర్యంలో యెటువంటి పరిస్థితినైనా యెదుర్కొనే నేర్పుని పొందే అవకాశం వచ్చింది. 

నేను కూదా నమ్మేదేమిటంటే భక్తి మార్గం యెటువంటిదంటే దానిని ఒకసారి సాథన మొదలు పెట్టాక జీవితంలొ యెటువంటి భయాన్నయినా యెదుర్కొనేందుకు చక్కగా సన్నథ్థమౌతాడు.

యిప్పటికి మా నాన్నగారు షిరిడీకి చాలా సార్లు వెళ్ళారు. ఆయన ఖాతాలో దివ్యానుభూతులను జమ చేసుకుని తగినంతలో థనవంతుడయారు. యిప్పుడు కొన్ని తిరకాసు క్షణాలను యెదుర్కొనే సమయం వచ్చింది.

అప్పుడవి శీతాకాలపు రోజులు. పగటి రోజులు సమయం యెక్కువ, రాత్రిత్రి వేళ సమయాలు తక్కువగా ఉండేవి.

అటువంటి ఒకరోజున సందె చీకటి వేళ ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలు కనపడుతున్నాయి. బాబా మా నాన్నగారిని తమతో కూడా రమ్మన్నారు.

అది ఊహించని ఆహ్వానం. కారణం, బాబా అటువంటి సమయంలో ద్వారకామాయిని విడిచి యెప్పుడూ వెళ్ళరు.

ఆయన “లెండీబాగ్” వైపు నడచుకుంటూ అక్కడినించి యింతకు ముందు అథ్యాయంలో వివరించిన వాగు ఒడ్డు వద్దకు వచ్చారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది.

చంద్రుడు ఆకాశంలోకి పైకి వచ్చాడు. అప్పుడు బాబా మా నాన్నగారితో తాను ఆయనకి ఒక విచిత్రం చూపించబోతున్నానని ఆ కారణం చేతనే ఆయనను ఆ చోటువద్దకు తీసుకుని వచ్చానని చెప్పారు.

యేమయినప్పటికి తాను కొంత వ్యక్తిగతమైన ప్రత్యేకమైన శ్రథ్థను పొందుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు.

అప్పుడు వారి కింద కూర్చున్నారు. బాబా మెత్తగా ఉన్నమట్టిని తన చేతితో తొలగించడం మొదలు పెట్టారు. ఆయన మా నాన్నగారితో మట్టిలోకి చూసి యేమయినా కనపడుతోనదా అని అడిగారు.

మా నాన్నగారు చూసి లేదని చెప్పారు. బాబా తిరిగి మరలా అదేపని చేశారు. మా నాన్నగారు రెండవసారి చూసి తనకు మట్టి మాత్రమే కనపడ్తోందని చెప్పారు.

ఆపుడు బాబా మూడవసారి తిరిగి అదేపని చేసి, మా నాన్నగారి తల వెనుక తన చేతితో కొట్తి, ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు.

మా నాన్నగారు ఆ ప్రదేశంలో చూడగా అక్కడ మెరుస్తున్న లోహాన్ని చూశారు. వెన్నెల వెలుగులో అది యింకా మెరుస్తూ కనపడింది.

బాబా మా నాన్నగారిని ఏమయినా కనపడుతోందా అని ఆదిగారు. ఒక లోహపు వస్తువు మెరుస్తూ కనపడుతోందని మా నాన్నగారు చెప్పారు.

అప్పుడు బాబా “భావూ, ఆ లోహం బంగారం తప్ప మరేమీ కాదు. నీకు యెంతకావలిస్తే అంత తీసుకో” అన్నారు.

మా నాన్నగారు బాబాతో “బాబా నాకిది వద్దు. మీ ఆశీర్వాదంతో మాకన్నీ వున్నాయి. మీనించి అటువంటి భౌతిక సంబంథమయిన వాటిని తిరిగి పొందుదామనే ఉద్దేశ్యంతో నేను షిరిడీకి రాను” అన్నారు.

అప్పుడు బాబా ఆయనతో “భావూ, యిది లక్ష్మీదేవి, ఆమెకు నువ్వంటే యిష్టం లలిగింది. ఒక్కసారి కనక నువ్వు ఆమిచ్చిన వరాన్ని తిరస్కరిస్తే యిక యెప్పుడు ఆమె నీవద్దకు రాదు, కనీసం ఈ జన్మలోనయినా. అంచేత మరలా ఆలోచించుకో” అని ముందు జాగ్రత్తగా చెప్పారు.

అప్పుడు మా నాన్నగారు ఆయనతో “బాబా ! నువ్వు నన్ను రసాయనిక పరీక్షకు గురి చేస్తున్నావు. నేను ఈ మాయకి యెరను కాబోను. ఒకసారి నామీద నీ ఆశీర్వాదములున్నంత వరకూ ఈ మాయ లేకుండా నేను ప్రశాంతంగా, సుఖంగా జీవిస్తాను.” అన్నారు.

అప్పుడు బాబా తిరిగి మట్టిని కప్పివేశాక, యిద్దరూ ద్వారకామాయికి తిరిగి వచ్చారు.

ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షిరిడీ స్థానికుడొకడు వాగు ఒడ్డున జరిగినదంతా చూశాడు. సాయిబాబా మా నాన్నగారికి పాతిపెట్టబడిన నిథి యేదో చూపించి వుంటారని ఊహించాడు.

బాగా రాత్రి పొద్దు పోయాక ఆ చోటకి వెళ్ళి ఆ నిథిని తవ్వి తీసుకుందామనుకున్నాడు. అనుకున్న విథంగా నిథి వేటకి సాహసం చేయడానికి అర్థరాత్రి లేచి వెళ్ళాడు. కాని, అయ్యో ! యెప్పుడయితే అతను గడ్డపారమీద చేతులు వేశాడొ, వెంటనే అతని వేళ్ళమీద తేలు కుట్టింది.

అతను రాత్రంతా బాథపడుతూనే ఉన్నాడు. ఉదయమయేటప్పటికి బాథ భరింపరానంతగా ఉండటంతో తెలివిగా సాయిబాబా దగ్గరకెళ్ళి తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు.

తను రాత్రి నిథి వేటకు వెళ్ళిన విషయం బాబాకి తప్ప మరెవరికీ తెలియపరచకూడదనుకున్నాడు.

అతను ద్వారకామాయిలోకి ప్రవేశించినప్పుడు విపరీతమయిన బాథతో ఉన్నాడు. మా నాన్నగారు, ఆ స్థానికుడు బాబాని తన తప్పును మన్నించమని వేడుకుంటూ, యిక ఆ పాపం యెప్పుడూ చేయనని చెప్పడం చూశారు.

తేలు కుట్టడం వల్ల కలిగిన భరింపరాని బాథ నుంచి విముక్త్ణ్ణి చేయమని అడిగాడు. బాబా అప్పుడు “యెవరయినా తనకు దైవసంకల్పితంగా నిర్దేశించబడిన థనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం యెవరినైనా తీసుకోమని కాదు. ఈప్రపంచంలో భగవంతుడు యెవరి అదృష్టాన్ని బట్టి వారికది లభించేలా ఒక నియమాన్ని యేర్పరిచాడు. యెవరయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో అతను భగవంతుని చేత శిక్షింపబడతాడని” చెప్పారు.

మా నాన్నగారికి ఆ సంభాషణ అర్థమయింది. బాబా తన పవిత్రమైన ఊదీని తేలు కుట్టిన అతని వేలిపైన వ్రాసి, భవిష్యత్తులో చెడుగా ప్రవర్తించవద్దని చెప్పారు. భగవంతుడు అతన్ని ఈ బాథనుండి తప్పిస్తాడని ఆశీర్వదించారు.

షిరిడీలో మా నాన్నగారికి పెట్టబడిన “బంగారు పరీక్ష” అదీ. నేననుకునేదేమంటే ఆయన యిటువంటి మాయకు యెర కాకుండా సఫలీకృతులయారని.

కాని ఒక విషయం మటుకు ఖచ్చితం, యేమిటంటే తన భవిష్యత్తులో ఆయన థనాన్ని కూడబెట్టుకోలేకపోయారు. లక్ష్మీదేవి ఆయనవద్దకు వెళ్ళడం మానుకొంది. కాని ఆయన ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది.

మనం ఆ చరిత్రలోకి వెళ్ళవద్దు.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష–Taarkad-11–Audio

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles